2, ఆగస్టు 2012, గురువారం

లక్షలు ,వేలు ర్యాంకులు వచ్చిన వాళ్లకు ఫీజు రీ ఇంబర్సుమెంట్ అవసరమా ?

వేలు ,లక్షలు ర్యాంకులు వచ్చిన వారికి ,చివరికి ఎంసెట్ లో పాస్ మార్కులు రాని వారందరికీ ఫీజు రీ ఇంబర్సుమెంట్ అవసరమా?ఎంసెట్ ర్యాంకులలో 5000 లోపు వచ్చిన వాళ్లకు లేక ఏదో ఒక కటాఫ్ పెట్టాలి. దానివలన నిజంగా ప్రతిభ ఉండి,ఆర్ధిక పరిస్థితి సహకరించని వారికి ఇది ఉపయోగ పడి,ప్రతిభను కూడా ప్రోత్సహించిన వారవుతారు.లేకుంటే ప్రజల సొమ్మును ఇలా చదువురాని వాళ్లకు ఖర్చు పెట్టి వాళ్ళను సోమరి వాళ్ళగా తయారు చేసి ,సమాజానికి పనికి రాకుండా చేసి,వ్యవసాయదారులకు కూలి వాళ్ళు దొరక్కుండా చేసి మన సమాజం సర్వనాశనం అవుతున్నది.ప్రభుత్వాలు విషయం లో పునరాలోచించాలి.

19 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఓట్లు అక్కరలేకపోతే చెయ్యచ్చు. అటువంటి పని చెయ్యరు కాక చెయ్యరు, అనుమానమా?

అజ్ఞాత చెప్పారు...

ఆత్మాభిమానం లేకుండా జనాల మీద అడ్డంగా పది తినే ఇలాంటి వెధవలకి, బయట ఒక రూపాయి ఉంటె వేయమని అడిగే అడుక్కునే వాళ్లకి పెద్ద తేడ లేదు.

ఆత్రేయ చెప్పారు...

ఏనాడు ఏ జంట కో రాసి ఉంచాడు విధి ఎప్పుడో...
ఇంక చెరప నలవి కాని వ్రాత
బరువైన వ్రాత ...

Jai Gottimukkala చెప్పారు...

ఎంసెట్లో పాసు కాని వారెవరికీ సీట్లు ఇవ్వడం లేదండీ.

ఇకపోతే కాలేజీలో చదివే అంశాలకు, ఎంసెట్లో పరీక్షించిన సబ్జెక్టులకు సంబంధం లేదు. ఎంసెట్ రాంకు ఎంత వచ్చినా సీటు దొరకిన అందరికీ పుస్తకాలు ఒక్కటే, పరీక్షలు ఒక్కటే, పాసు మార్కులు ఒక్కటే. తక్కువ ఎంసెట్ రాంకు వచ్చిన వారికి ఎ రకమయిన మినహాయింపు కానీ సడలింపు కానీ లేవు. అలాంటప్పుడు ఫీసు ఇంబర్సుమెంట్ ఎందుకు ఇవ్వకూడదు?

వ్యవసాయ కూలీలు దొరకపోవడానికి వారికి గిట్టుబాటు భత్యం దొరకకపోవడం. రైతులను ఉద్దరించడానికి కూలీలు సబ్సిడీ ఇవ్వాలా? అసలు ఈ టపాకి రైతుకూలీలకు సంబంధం ఏమిటి?

అజ్ఞాత చెప్పారు...

అవసరమే. తాడిత, పీడిత, అణగారిన వర్గాలకు ఇంజనీరింగ్ చదివే హక్కు లేదా? అని గర్జిస్తూ పెసినిస్తుండాను అద్దెచ్చా. ఇంజనీరింగులో తప్పిన పెతి సమచ్చరము ఫీజులు చెల్లించాల్సిందే.

రాజీవ్ పీజులు చెల్లించు పథకం లాంటివి లేకుంటే అధికార పార్టీ చోటా నేతల విద్యా యాపారానికి వూరట ఏది? పార్టీనే నమ్ముకుని షేవ చేసుకుంటున్నవాల్లేమై పోవాల?

అజ్ఞాత చెప్పారు...

/ఇకపోతే కాలేజీలో చదివే అంశాలకు, ఎంసెట్లో పరీక్షించిన సబ్జెక్టులకు సంబంధం లేదు. ఎంసెట్ రాంకు ఎంత వచ్చినా సీటు దొరకిన అందరికీ పుస్తకాలు ఒక్కటే, పరీక్షలు ఒక్కటే, పాసు మార్కులు ఒక్కటే /

అవునా?!! భలే పట్టేశారు, జైగో గారు. :(:)

(ఆనందబాష్పాలు తుడుచుకుంటూ...)
కాలేజీలో చదివే ఆంశాల మీద, చదవక ముందే పరీక్షిస్తే బాగోదేమో... ఓ సారి కనికరించి ఆలోచించున్రి.
:P :))

Jai Gottimukkala చెప్పారు...

@SNKR:

లెక్కలు, ఫిసిక్సు లాంటి సబ్జెక్టులు బ్రహ్మాండంగా నేర్చు"కొని" సీటు తెచ్చుకున్న విద్యార్థికి ఇంజనీరింగు బాగా రావాలని లేదు కదా. కళాశాల పరీక్షలు తప్పిన వారికి ఇంబర్సుమెంట్ మానేస్తే నాకు అభ్యంతరం లేదు. ప్రవేశ పరీక్షల పాత్ర అడ్మిషన్ వరకు మాత్రమె ఉండాలన్నదే నా మనవి.

మధ్యలో కూలీలు దొరకక అన్నదాతలు కష్టపడడం ఏమిటో నాకయితే అర్ధం కాలేదు.

అజ్ఞాత చెప్పారు...

కూలీలు దొరకటం లేదుగా అని చెప్పి,కూలీల పంపకం కింద పదవ తరగతి పేపెర్ కష్టంగా ఇచ్చి ఫైల్ అయిన వాళ్ళందరిని సప్ప్లై చేయాలి.....ఆలోచన బాగుంది...........చీ.........
అసలిక్కడ ర్యాంక్ కీ,కూలిలకీ సంబందం సరిపోలేదు ,పైగా అవినీతి లో తింటే తప్పు లేదు, కులాలు చెప్పుకుని బతికి పోతారు(జగన్, అదర్ కాంగీస్),ఏదో కుర్రళ్ళకి కాస్త చదువు సహాయం చేస్తే లబొ దిబో...చ,కాని ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం మార్క్స్ లిమిట్ పెట్టి డబ్బు సాంక్షన్ చేస్తే బాగుంటుంది,అవినీతి పరుల ను నిలదీయలేక ఓట్లు వేసారు(జాలి తో) , పథకాలని విమర్శిస్తే కాంగీలు పథకాలలొ మార్పులు చేస్తే,ప్రభుత్వం కూలిపొయి జగన్ కి అధికారం వచ్చేల ప్లాన్ అనుకుంటా?!(ఎంతైనా యువత ఓట్లు బాగానె ఉంటాయి కదా)?!?

మయూఖ చెప్పారు...

జై గొట్టిముక్కల గారూ పాస్ మార్కులు రాని ప్రతి వ్యక్తి ఇంజనీరు కావాలను కోవడం అత్యాశకాదా?ఐ .టి.ఐ.,డిప్లొమా చదివే వాడెవ్వడూ లేడు. మీరు లెక్కలు చూల్లేదా?ఇప్పుడు వస్తున్న ఇంజినీరులు పది శాతం కూడా పనికి రారంట.ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఎంత బుర్రకు అంత చదువు ఉండాలి.మేము చిన్నప్పుడు పదవ తరగతి లో ఎనభై మందిమి ఉంటే పదవ తరగతి ఇద్దరు మాత్రమే పాసు అయ్యారు.వాల్లు మాత్రమే పై చదువులు చదివినారు.మిగిలినవాల్లు మల్లీ సప్లమెంటరీ వ్రాసి కొంతమంది పాసు అయ్యి ,వాల్లకు తగిన చదువులు చదివినారు.మిగిలిన వాల్లు ఊర్ళోనే ఉండి భూమి ఉన్నవాడు భూమి చేసుకొని ,భూమి లేనివాడు వ్యవసాయ పనులకు పోతా ఉండే వారు. అప్పుడు కూలీలకు ,వ్యవసాయానికి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు అంతా మోసం .పదవ తరగతి లో ,ఇంటరు లో ఇప్పుడు ఫెయిల్ అయ్యే వాళ్ళే లేరు.అందరికీ మొదటి ర్యాంకులే.అందులో చాలా మందికి 90 శాతం మార్కులు కు పైగానే వస్తున్నాయి.ఏం ఈ జనరేషన్ వాల్లు అంత ఏక సంథాగ్రాహులయ్యారా?ఇంటరు లో నాకు తెలిసిన వాల్లకు కార్పొరేట్ కాలేజీల్లో చదివిన వారికి చాలా మందికి 97 శాతం మార్కులు వచ్హినాయి.కానీ ఎంసెట్ లో 35 శాతం మార్కులు కూడా రాలేదు.వాల్లకు వేలల్లో ర్యాంకులు వచ్హినాయి.ఇంటరు లో వచ్హిన మార్కులకు ఎంసెట్ లో వచ్హిన మార్కులకు సంభంధం ఉండడం లేదు.ఏదో మోసం జరుగుతూ ఉంది.లేక పోతే అలా ఎందుకు జరుగుతుంది.తమ వాడు ఇటువంటి మార్కుల్తో ఇంజనీరు చదువు చదువు తున్నాడని చాలా మంది అమాయకులైన తల్లిదండ్రులకు తెలియక వాల్లకు ఏ పని చెప్పక ,పిల్లలకు పని రాక వాడు పెద్దయ్యాక తను ఇంజనీరు చదివానని ఇంట్లో ఉండే ఏ పనీ చేయక ,వాడికి ఉద్యోగం ఎవ్వరూ ఇవ్వక చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.ఇప్పుడు పల్లెలకు వచ్హి చూడండి ప్రతి చిన్న ఊరిలో 50 మందికి తక్కువ కాకుండా నిరుద్యోగ ఇంజినీరులు చెట్ల క్రింద కూర్చొని పిచ్హాపాటి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని ఉన్నారు.వాల్లకు పెళ్ళిల్లు కూడా కావడం లేదు. ఇది సత్యం.నిజాలు మీ లాంటి వాళ్ళు ఒప్పు కోవాలి.ఇప్పటి కే సమాజం చాలా నష్ట పోయింది.పని లేకుండా యువత ను పెడి తే సమాజానికి చాలా ప్రమాదం.ఇప్పటి కైనా ప్రభుత్వాలు మేల్కొనాలి.

అజ్ఞాత చెప్పారు...

ఏం నాయనా "చివరి అజ్ఞాత" నీదికూడా అదే బాపతేనా?అపాత్రదానం వలన లబ్ది పొందిన వాడి వేనా?అందుకే అంత కోపం వచ్హింది.
--పాచిరేవు.

అజ్ఞాత చెప్పారు...

పధకాలు పేదల కోసం కాదని గుర్తు ఉంచుకోండి,ఇవి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలను కోటీశ్వరులను చేసి,నిశ్చింతగా నిద్ర పోడానికి ప్రవేశపెట్టిన పధకాలు....కాలేజీలు మూసుకునే పరిస్థితి నుంచి ఒక్కోడూ 2-3 కాలేజీలు పెట్టే స్థాయి కి ఎదిగారు...అంతా కర్మ!!!

ప్రేరణ... చెప్పారు...

నేను kvsvగారితో ఏకీభవిస్తున్నాను.

Jai Gottimukkala చెప్పారు...

రమణారెడ్డి గారూ,

ప్రవేశ పరీక్షలో పాసు మార్కు రాకుండానే సీట్లు ఇస్తున్నారని మీరు చేసిన అభియోగం నిజం కాదు. పాసు మార్కు పెంచాలని మీకు అనిపించవచ్చు అది వేరే విషయం.

ఇంజనీరింగు చదువుల ప్రమాణాలు పడిపోయాయన్నారు వాస్తవమే. దీనిలో విద్యార్థుల పాత్ర తక్కువనీ, యాజమాన్యాల & ఉపాధ్యాయుల పాత్ర ఎక్కువనీ నాకు అనిపిస్తుంది మీరేమంటారు?

ఇప్పుడు వస్తున్న ఇంజనీర్లు పది శాతం మాత్రమె పనికొస్తే దానికి కారణం కళాశాలలలో మరియు ఉపాధ్యాయులలో అయిదు శాతం మాత్రమె బాగుండడం కాదా? డబ్బు, పలుకుబడి ఉన్న ప్రతి ఒక్కడూ విద్యావ్యాపారంలో దిగినప్పుడు ఇంతకన్నా ఆశించగలిగింది ఉంటుందా?

చదువు అబ్బని ప్రతి ఒక్కడూ వ్యవసాయ కూలీ కాడు. పెద్దవారి బిడ్డలు ఏ వ్యాపారమో సినిమాయో చేస్తారు. మీరు ఒక వర్గాన్ని మాత్రమె టార్గెట్ చేయడం సబబు కాదేమో?

అదేరకంగా రైతుకు గిట్టుబాటు ధర ఎంత ముఖ్యమో కూలీలకు గిట్టుబాటు భత్యాలు అంటే ముఖ్యం. ఆ విషయాన్ని మరిచిపోయి కూలీలు దొరకడం లేదని ఆడిపోసుకోవడం పాడియేనా?

మయూఖ చెప్పారు...

జై గారూ ఇంజినీరింగ్ మాత్రమే కాదు ఈ కార్పొరేట్ చదువులు వచ్హిన తర్వాత ప్రతి చదువు ప్రమణాలు పడిపోయాయి.ఒక పెద్ద కార్పొరేట్ కాలేజీలో మా బంధువు ఒకరు ఇంటరు కు చేరి చేరిన ఒక వారానికే అక్కడ వసతులు బాగా లేవని తిరిగి వచ్హి వేరే కాలేజీలో చేరినారు.తను ఒక్క పరీక్ష కూడా అక్కడ రాయలేదు.కానీ 6 నెలల వరకు ప్రతి వారం తనకు వివిధ టెస్టుల్లో వచ్హిన మార్కుల వివరాలు పోస్టు లో వస్తూ ఉండేవి.ఈ విధంగా ఉంటాయి కొన్ని కార్పొరేట్ కాలేజీల మోసాలు.తల్లిదండ్రులను వివిధ రకాల చదువుల పేర్లతో మోసాలు చేస్తున్నాయి.కార్పొరేట్ కాలేజీలు తమ కాలేజీల్లో ఇన్ని ర్యాంకులు వచ్హినాయి అని చెబుతున్నారు,ఎంత మంది రాస్తే అన్ని ర్యాంకులు వచ్హినాయి అని చెప్పడం లేదు .పిల్లలు బాగుపడింది లేదు,తమ చేతికి అంది వచ్హింది లేదు.వీల్ల మోసాల బారిన పడి చాలా మంది తల్లిదండ్రులు ఆర్థికంగా నష్ట పోయి కుమిలి పోతున్నారు.చదువు రాదని తెలిస్తే పిల్లలను వివిధ పనుల్లో పెట్టుకొని వాల్లకు బ్రతుకు మీద విశ్వాసం కల్పించవచ్హు.ఇప్పుడున్న జనాభాలో ఎంత శాతం మంది ఉద్యోగాలలో ఉండి తమ బ్రతుకు బ్రతుకుతున్నారు.చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఉద్యోగాలలో జీవిస్తున్నారు,మిగిలిన వాల్లు తమకు నచ్హిన వివిధ పనులు చేసుకొని బ్రతుకుతున్నారు.పూర్వం పదవ తరగతి అయిపోతూనే చదువు లో వాడి కథ తెలిసేది. చదువు ఒంట పట్టకుంటే బ్రతుకు తెరువు కోసం వాడు వివిధ పనులలో స్థిర పడి తల్లిదండ్రులకు చేదోడు వాదోడు గా ఉండే వాడు. ఇప్పుడు ఈ తప్పుడు విధానాల వలన ఈ అవకాశం లేదు.పిల్లలు ,యువత చాలా నిస్ప్రుహ తో ఉన్నారు. ఇది సమాజానికి చాలా ప్రమాదం.

అజ్ఞాత చెప్పారు...

One of my cousins got EAMCET Rank more than 1,50,000.
But He got admission in of the Engineering colleges with a reduced price. Hostel is free for all 4 years and fee is also reduced by 40%.
I have seen many other cases like this.

అజ్ఞాత చెప్పారు...

with 1,50,000 rank should he become engineer,what can we expect from such type of engineers.

అజ్ఞాత చెప్పారు...

and surprisingly this kind of engineers/ doctors aspire to get Govt jobs. Never risk to join private sector. Govt offices are the ultimate resorts to relax life long with great previlages.

అజ్ఞాత చెప్పారు...

who will give them privet jobs,they dont have that much compititive spirit.

అజ్ఞాత చెప్పారు...

recently these type of candidates only got private jobs ,by providing duplicate certificates,atleast in govt .jobs they have to face tuff compitition and govt.scrutanizes certificates properly.