18, జులై 2012, బుధవారం

పార్టీలకు ఓటు విలువ గురించి చెప్పే నైతిక అర్హత ఉందా??

టి.డి.పి పార్టీ రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యంగా ఉంది.ఒకప్పుడు సాధారణ ఎన్నికలల్లో పోలింగ్ శాతం తగ్గినప్పుడు చాలా పార్టీలు టి.డి.పి తో సహా ఓటు విలువ ఓటర్లకు తెలియదని ,ఓటు గురించి,ప్రజాస్వామ్యం గురించి చాలా ప్రసంగాలు చేసినాయి.మరి ఇప్పుడేమి అయ్యిందో అర్థం కావడం లేదు. చెప్పేదొకటి చేసేదొకటా?తమ ఓట్లు వేసి గెలిపించిన టి.డి.పి ఎం.పి లు,ఎమ్మెల్లే లు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించక పొతే , సామాన్య ఓటరు పరోక్షంగా తమ రాష్ట్రపతి ని ఎన్నుకునే అవకాశం కోల్పోయినారు. పార్టీ లు తమ రాజకీయ అవసరాలకోసం ఒక్కక్క సారి ఒక విధంగా పిలుపు ఇవ్వకూడదు.రేప్పొద్దున ఎన్నికలమీద నిరాసక్తత కలిగి సామాన్య ఓటర్లు ఓటు హక్కు వినియోగించక , పోలింగ్ శాతం తగ్గితే పార్టీ లు ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకొమ్మని పిలుపు ఇచ్చే నైతిక హక్కు ఉండదు.చాలా సార్లు కొన్ని విప్లవ పార్టీ లు ఎన్నికలను బహిష్కరించమని పిలుపునిస్తే వారిని ప్రజాస్వామ్య వ్యతిరేకులని ఇవే పార్టీ లు విమర్శించాయి. ఇప్పుడు సామాన్య ఓటరుకు పార్టీ మీద కూడా అదే అనుమానం వచ్చే ప్రమాదం వుంది.

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

జగన్మోహనరెడ్డికి మాత్రమే ఓటువిలువ గురించి చెప్పే నైతిక అర్హత ఉంది. ఎందుకంటే ఇంత దారుణంగా అవినీతి చేసిన రాజకీయ నాయకుడు మన దేశంలోని మరే పార్టీలోనూ లేడుకదా!
- పిచ్చిరెడ్డి

అజ్ఞాత చెప్పారు...

అవును జగన్ మాత్రమే చెప్పింది చేస్తాడు, మిగతా వాల్ల లాగ అధికారం కోసం నానా గడ్డి కరవడు. ఫిక్షింగ్ లు చేసుకోడు.
-పాచిరేవు.

అజ్ఞాత చెప్పారు...

మరి ఇప్పుడు చేస్తున్నదేమిటో,?
కోర్ట్ లో బెయిల్ కోసం రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ కు మద్దతివ్వడం జగన్ బాబుకు మాత్రమే తగిన చర్య,మళ్ళీ సిగ్గులేకుండా ఆత్మాభిమానం అంటూ పత్రికా కధనాలు ఒక వైపు...
థూ ..

అజ్ఞాత చెప్పారు...

ఇక్కడ చర్చ ఓటు వెయ్యడం, వెయకపోవడం గురించి. మరీ ముఖ్యంగ రాజకీయ పార్టీలే ఓటు వెయ్యడం ఒక బాధ్యత అని తెలిసి కూడా పట్టించుకోకుండా బాధ్యతారహితంగా ప్రవర్తించడం గురించి. దాని గురంచి మాట్లాడితే బగుంటుంది.

మయూఖ చెప్పారు...

అవునండి ,దాని గురించి చర్చిస్తే బావుంటుంది