13, ఆగస్టు 2012, సోమవారం

ప్రమోషన్లలో రిజర్వేషన్లు అవసరమా??

అంతవరకూ నీ కంటే జూనియర్ అయిన,నీ కంటే తక్కువ స్థాయి లో ఉన్న ఉద్యోగి,అంత వరకూ నిన్ను సార్.. సార్.. అని సంభోధించిన ఉద్యోగి విధమైన డిపార్టుమెంటల్ టెస్ట్ లు రాయకుండా , విధమైన ఉన్నత చదువు చదవకున్నా తెల్ల వారేసరికి నీకు అధికారి అయి పోతాడు.అప్పటి వరకూ నిన్ను సార్ అన్న వ్యక్తిని అప్పటి నుండి నీవు సార్ అని అతని ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి,ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇస్తే ఉంటుంది. పరిస్థితి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అమలులో ఉంది.తన కన్నా చాలా జూనియర్ అయిన వ్యక్తులు తన ముందే 4 ,5 ప్రమోషన్లు తీసుకొని ముందుకు పోతా ఉంటే తానూ మాత్రం అదే ఉద్యోగం లో రిటైర్ కావలసిన పరిస్థితి. పరిస్థితి వలన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల మధ్యన సామరస్య మైన వాతావరణం పోయి,పని చేసే సంస్కృతి తగ్గి పోయి క్రమశిక్షణ లోపించింది.O.C. ఉద్యోగులు ఎలాంటి ప్రోత్సాహకాలు లేక చాలా ఆత్మా న్యూనతా భావంతో పనులు చేస్తున్నారు.ఆర్థికంగా ,సామాజికంగా బలం చేకూర్చడం కోసం S.C.,S.T. కు మరియు మిగతా కులాల వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చినారు బాగానే ఉంది.కానీ ప్రభుత్వ సాయం ఏమీ లేకుండానే ఆర్థికంగా వెనక బడిన అగ్రవర్ణాలు అనబడే వారి పిల్లలు కష్టపడి ప్రభుత్వోద్యోగం తెచ్చుకుంటే ,ఉద్యగం లో చేరిన తర్వాత తార తమ్యాలు ఎందుకో అర్థం కావడం లేదు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఎందుకో అర్థం కావడం లేదు.పాలకులు తమ ఓట్ల వేట కోసం క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసు కోకుండా ఇలా చేసుకుంటూ పోతా ఉంటే ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగి పోతాయి. ఇలాగే కొన సాగితే కొన్ని రోజుల తర్వాత అగ్రవర్ణాల వారిని ఆర్థికంగా , సామాజికంగా పైకి తీసుకు రావడానికి వారికి రిజర్వేషన్లు అమలు చేయ వలసిన పరిస్థితి వస్తుంది.

16 కామెంట్‌లు:

rohini చెప్పారు...

Ramanareddy garu ,bagaa chepparu ,aa avedana ardham chesukune sahrudayam kudaa undalandi,ree reservationlu mana pragatiki enta addankiga maaraayo medhavulu vivarinchi cheppali aa avusaram undi kudaa visayam pai malee meeku vipulanga vrastanu ,manchi topic ni ennukunnanduku naa dhanyavadalu

శ్రీ చెప్పారు...

ఈ రిజర్వేషన్లనేవే ఉండకూడదు...
ఆర్ధికంగా వెనుకబడినవారికి..
హై స్కూల్ చదుకు పూర్తయ్యేవరకు విద్య చెప్పించి
వారికి కావాలంటే అదనపు శిక్షణ ఇప్పించి
తరవాత అందరితోనూ పోటీ పడే తత్వం అలవాటు చేయాలి...
అంతే తప్ప కులం పేరుతొ మతం పేరుతొ వోట్ల బ్యాంకు కోసం
రాజకీయ నాయకులు ఇచ్చే రిజర్వేషన్ సరైనది కాదు...
నాకంటే ఐదు సంవత్సరాల వెనుక జాయిను ఐనవాడు నాకంటే రెండు పోస్టుల పైకి వెళ్లి
మూడేళ్ళు అవుతోంది...
సుప్రీం కోర్టు... ప్రమోషన్లలో రిజర్వేషన్ వద్దు అన్నందుకు సర్కారు వారు రాజ్యాంగ సవరణ
చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు...
బాధని అనుభవించిన వారికే తెలుస్తుంది వీటి వలన నష్టాల గురించి...
దయ చేసి ఎవరూ వ్యక్తిగతంగా ఈ వ్యాఖ్యని తీసుకోవద్దని ప్రార్థన...
@శ్రీ

Jai Gottimukkala చెప్పారు...

చాలా మంచి ప్రశ్న. జవాబు చెప్పాలంటే మరో రెండు ప్రశ్నలు వేసుకోవాలి.

1. నిమాయకంలో రిజర్వేషనులు అవసరమా?
2. అవసమయితే ఎ ప్రాతిపదిక మీద ఉండాలి?

నిమాయకంలో అవసరమయితే, ప్రమోషన్ల లోనూ అదే ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు అవసరం.

మయూఖ చెప్పారు...

శ్రీ గారు చెప్పింది కరెక్ట్.ప్రభుత్వాలు చదువులో,సీట్లలో రిజర్వేషన్లు ఇచ్హి ,స్కాలర్షిప్పు లు ఇచ్హి వాల్లను చదివిస్తున్నాయి.అవేమీ లేకుండానే అగ్రవర్ణాలనే వాల్ల పిల్లలు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడి చదువు కొని ఈ పోటీ ప్రపంచంలో నెట్టుకొని వస్తున్నారు.కులాలతో సంభంధం లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు ఉండి చదవ లేని ప్రతిభా వంతులైన పిల్లలను వాల్లు ఎంత వరకు చదువుతారో అంతవరకు చదివించి డానికి ప్రభుత్వాలు సహాయపడి వాల్లను పోటీ పడమనాలి.అప్పుడే నిజంగా అందరికీ లబ్ది కలుగుతుంది.ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే రిజర్వేషన్ వలన పెద్ద ఆఫీసర్ అయిన వాల్ల పిల్లలు అందరూ పట్టణాలలో ఇంగ్లీషు చదువులు చదువుతారు.వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి.వీళ్ళతో , ఆర్థికంగా ఇబ్బందులు పడి తెలుగు మీడియం స్కూల్లల్లో పల్లెల్లో చదివిన అగ్రవర్ణాలు అన బడే వాళ్ళ పిల్లలు పోటీ పడి ఉద్యోగాలు తెచ్హు కోవాలి.ఒక వేల ఉద్యోగాలు తెచ్హుకుంటే ప్రమోషన్లలో ఈ అధర్మం.ఇది చాలా భాధాకరం.ఇది ఎంత వరకు సమంజసం.పాలకులు అగ్రవర్ణాలను కూడా ఓటర్లుగా గుర్తించాలి.వాల్ల ధర్మమైన కోర్కెలను వినాలి.లేకుంటే ఇంకొక అణగారిన జాతి సమాజంలో ఉద్భవిస్తుంది.అప్పుడు వీళ్ళకు కూడా రిజర్వేషన్ల లాంటివి ఇవ్వవలసి ఉంటుంది.

మయూఖ చెప్పారు...

@rohini,@jai @sri thanks for ur comments,fair and healthy discussion is welcomed.

అజ్ఞాత చెప్పారు...

వుండాల వుండాల. అన్ని రాజకీయ పదవుల్లో కూడా అన్నివిధాల వెనకబడిన వాళ్ళకు ఇచ్చి మిగిలిన చప్రాసీ వుధ్యోగాలు ప్రతిభావంతులకు కులమత భేధాలు లేకుండా న్యాయంగా పడేయాలి. ప్రైవేట్ కంపెనీల్లో, విదేశీ వీసాల్లోనూ జనాభా ప్రాతిపదికన(మంద లెక్కన) కోటాలు పడేయాలి.

/అవసరమయితే, ప్రమోషన్ల లోనూ అదే ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు అవసరం. /

అవసరమూ?! అవసరమున్నా లేకున్నా ముందుగల్ల ఇచ్చేయుడే, ఆతర్వాత రిటైరయ్యాక అవసరంగురించు ఆలోచించుడు చేసుకోవచ్చు. అంతే కదా జైగో సారూ? :)) ;)

కమనీయం చెప్పారు...



నిష్పక్షపాతంగా ఆలోచించిన తర్వాత నా అభిప్రాయం;;మరొక ,15,లేక 20 సం.వరకు విద్యాసంస్థలలో పట్టభద్రత వరకు,(B.A.,B.SC,B.TECH,M.B.B.S.)వంటి కోర్సులలో 50 శాతం రెజెర్వేషన్లు ఉండవచ్చును.కాని పొస్ట్ గ్రాడ్యుఏషన్ కోర్సులలో మెరిట్ ప్రకారం అందరికీ సమానావకాశాలు ఇవ్వాలి.గవర్న్మెంట్ ,పబ్లిక్ సెక్టర్ ఉద్యోగాలకి రిజర్వేషన్ 50శాతం వర్తింపజేయాలి.( FIRST ENTRY POST) ప్రొమోషన్లు కిమాత్రం రిజర్వేషన్లు ఉండకూడదు.ప్రొమోషన్లకిఉండే నియమాలు అన్నీ (సర్వీసు సీనియారిటీ ,కాంఫిడెన్షియల్స్ మొ; ) అందరికీ సమానంగా వర్తింపజేయాలి.
ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు పనికి రావు.ఉద్యోగుల ఎన్నిక,పదోన్నతి,మొ;వాటిలో యాజమాన్యానికి స్వేచ్చ ఉండాలి.
30సం; సర్వీసు అనుభవంతో ఈమాటలు రాస్తున్నాను.

అజ్ఞాత చెప్పారు...

ప్రైవేటు రంగం లో రిజర్వేషన్స్ పెడితే అన్ని కంపెనీలు మూసుకుని కూర్చుంటాయి. పని చేసే వాడికే ఇక్కడ చోటు ఉంటుంది వాడు ఎవడైనా సరే. కులం పేరు చెప్పుకుని, బేవార్స్ గా తినడానికి ఎవరూ ఒప్పుకోరు.
ఒకవేళ పెట్టిన , జాయిన్ అయిన రెండోరోజే బయటకి గెంటేస్తారు, ఎందుకంటే రిజర్వేషన్ లో చదివి వచ్చిన వాడి దగ్గర ఏముంటుంది బూడిద తప్ప.
:venkat

satya చెప్పారు...

If there are 100 posts in entry level then based on reservations 50%gen and 50%reservations candidates will be there.. so they same can be applied in case of promotions also.. so competition for both will be same ..50% gen will try for 50% promotions and 50% reservation ppl will try for those 50%reserved promotions.. it should be because you should not expect the reservation people to surpass general people to get promotions.. they lacked in initial stage itself to get that job... how can they perform the job in the same manner? so you just want to give them a job and leave them at that level? that is not the motto of our reservation system.. and if promotions are purely time basis then no need of any reservation... but they incorporated kind of confidential reports form managers... managers(90% gen people) can be partial to other gen people...so not a good idea.. and coming to your point "నీ కంటే జూనియర్ అయిన,నీ కంటే తక్కువ స్థాయి లో ఉన్న ఉద్యోగి,అంత వరకూ నిన్ను సార్.. సార్.. అని సంభోధించిన ఉద్యోగి ఏ విధమైన డిపార్టుమెంటల్ టెస్ట్ లు రాయకుండా ,ఏ విధమైన ఉన్నత చదువు చదవకున్నా తెల్ల వారేసరికి నీకు అధికారి అయి పోతాడు.అప్పటి వరకూ నిన్ను సార్ అన్న వ్యక్తిని అప్పటి నుండి నీవు సార్ అని అతని ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి,ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇస్తే ఉంటుంది" it will be there for few years and it will be get adjusted..



PS: I belong to OC

Jai Gottimukkala చెప్పారు...

సత్య గారి వ్యాఖ్య కొంతవరకు సరిగ్గా తోస్తుంది. అభ్యర్తులు బయటి వ్యక్తులు కారనే ఒకే ఒక్క తేడాతో ప్రమోషన్లు కూడా నిమాయకాలే.

అయితే పనితనానికి సంబందించిన అర్హతలను (ఉ. విద్యార్హత, అనుభవం వగైరా) సడలించడం వల్ల నాణ్యత దెబ్బ తింటుంది. ఇతర నిబంధనలలో (ఉ. వయసు) మినహాయింపు ఇచ్చినా వచ్చే నష్టం లేదు.

అజ్ఞాత చెప్పారు...

@Satya:
How long will it take to get adjusted ?
Has not been getting adjusted for last 60 years ?
These Reservations will be there for next 600 years to sink the talent down into the earth.

మయూఖ చెప్పారు...

సత్య గారు
చాలా డిపార్టుమెంటుల్లో ప్రమోషన్లు పనితనానికి ఏమీ సంభంధం ఉండదండి.సీనియారిటీ ప్రకారం రొటీన్ గా ఇస్తా పోతా ఉంటారు.ఇందులో రిజర్వేషన్ ప్రకారం వీళ్ళకు కూడా ఇస్తా ఉంటారు.అదే ఎందుకు అంటాను.వీల్లకు కూడా అందరితో పాటే సీనియారిటి వచ్హినప్పుడు ఇవ్వాలి. ఉద్యోగం ఇవ్వడం ద్వారా వీల్లకు ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవు.సీనియర్లను తొక్కేసి వీల్లు పోతా ఉంటే వాల్లకు ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి.దీని వలన కార్యాలయాల్లో క్రమశిక్షణ లోపించింది.ఎందుకంటే తన జూనియర్ అయిన రిజర్వుడు ఉద్యోగిని అతడు తప్పు చేసినా ఏమీ అనలేని పరిస్థితి.ఎందుకంటే అతడు ఏదో ఒక రోజు తనకు బాస్ అయి పోతాడనే భయం ఉంటుంది.వాల్లు కూడా ఒక వేల ఏమైనా అంటే తాము బాసు ల మైన తర్వాత OC ఉద్యోగుల పైన కక్ష సాధిస్తారు.ప్రాక్టికల్ గా ఇన్ని సమస్యలు ఉన్నాయి.

Jai Gottimukkala చెప్పారు...

రమణారెడ్డి గారూ, తన కింది ఉద్యోగి తనకు బాసు కావాలంటే ఆయన రెండు మెట్లు ఎదగాలి, పైగా అదే డిపార్టుమెంటులో పోస్టింగు తెచ్చుకోవాలి. ఇది అంత సాధారణంగా జరగక పోవచ్చేమో?

మయూఖ చెప్పారు...

it is happening in central govt.presently.

మయూఖ చెప్పారు...

it is happening in central govt.presently.

శ్రీ చెప్పారు...

jai gottumukkala gaaroo!
it haapeened to me...
my collegue in the same post got two promotions and he is the officer now..
in central govt.jobs this is very common...
@sri