సాఫ్ట్ వేర్ కంపెనీలు ,బి.పి.ఓ కంపేనీలు పెద్ద పెద్ద సిటీ ల్లో ఉండడం అవసరమా? సాధారణంగా వస్తూత్పత్తి చేసే సంస్థలకు ముడిసరకు రావడానికి ,తయారైన వస్తువులు రవాణా చేయడానికి రవాణా సదుపాయాల కోసం పెద్ద పట్టణాలలో పెట్టినారు.కానీ సాఫ్ట్ వేర్ మరియు బి.పి.ఓ కంపెనీలకు మనుష్యులు ,కంప్యూటర్ లు మరియు ఇంటర్నెట్ సదుపాయాలూ ఉంటే చాలు కదా?ఇవన్నీ ఇచ్చి అనంతపురం లాంటి జిల్లాల్లోని పల్లెల్లో ని బీడు భూముల్లో సంస్థలు నెలకొల్పి అక్కడే ఉద్యోగస్తులకు వసతి కల్పించ వచ్చు కదా?దీని వలన సిటీ ల మీద ఒత్తిడి తగ్గి ,ట్రాఫిక్ సమస్య ,మౌలిక వసతుల సమస్యలు అన్నీ తొలిగి పోతాయి కదా?ఆ చుట్టూ పక్కల పల్లెలు కూడా చిన్న చిన్న వ్యాపారాల వలన వృద్ది చెందుతాయి కదా?ఈ విధంగా అన్ని జిల్లాల్లోని బీడు భూములను గుర్తించి సంస్థలను నెలకొల్పితే బావుంటుంది కదా?ఈ విధంగా చేస్తే పెద్ద సిటీ ల్లో స్థిరాస్తుల ధరలు కూడా తగ్గుముఖం పడతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
5 కామెంట్‌లు:
క్షమించాలి SW companies అన్నీ ఉన్న చోటే పెడతాయి. అన్నీ వాళ్ళు సమకూర్చు కోవడానికి ఇష్ట పడరు.
yes u r right
kani bpo company chalavarku sys , furniture, net,phone, total eqpmt anni rent base lo tisukuntaru ... so meru chepindi cheyalante vaadu chala money invest cheyali ... anta risk bpo company tesukodu...any way meru cheppindi bagane undi....
నాకు తెలిసి ప్రభుత్వాలు ఈ దిశలో ప్రయత్నిస్తూనే ఉన్నాయి. విశాఖ, కాకినాడ నగరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహించి వసతులు బాగానే సమకూర్చింది. కంపనీలు కూడా ముందుకొస్తున్నాయి.
అనంతపురం, హనమకొండ, నెల్లూరు లాంటి పట్టణాలకు విస్తరిస్తే ఇంకా బాగుంటుంది. మీరు చెప్పిన లాభాలే కాక అద్దె తక్కువ కావడం, కాలుష్యం లేకపోవడం వంటి కారణాల వల్ల పరిశ్రమలకు కూడా ఇదే మంచిది.
అయితే ఉద్యోగస్తులు ఇందుకు సహకరించకపోవచ్చు. విశాఖకు వెళ్ళమని స్టాఫ్ మొరాయించడం నేను చూస్తున్నాను. పిల్లలకు తగినన్ని స్కూళ్ళు లేవనో మరోటనో సాకులు చెబుతారు. చిన్న ఊళ్లకు వెళితే భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు తగ్గుతాయనే భయం ఉందని వారు చెప్పకనే తెలుస్తుంది.
జై గారు
తిరిగి పట్టణాలకు పోవద్దు సార్.తిరిగి అవి పాడవుతాయి.పల్లెలకే పోవాలి.ఉద్యోగం కావలసిన వాడు అక్కడికి పోతాడు.స్కూల్లు కంపెనీ వాల్లే ఏర్పాటు చేయ వచ్హు. ఎలాగు ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వాల్ల పిల్లలను చూసు కునే టైం లేక చాలా మటుకు పబ్లిక్ స్కూల్లల్లో ,హాస్టల్లల్లో ఉంచి చదివిస్తున్నారు.కావున చదువుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు.
ఒక వ్యాపారం,లేక పరిశ్రమ పెట్టాలంటే దాని యజమానులు ,నిర్వాహకులు ఎన్నో విషయాలు చూసుకోవాలి.పెద్ద నగరాల్లో ఉన్న సౌకర్యాలు చిన్న పట్టణాల్లో ఉండవు.రాజకీయ పరిస్థితులు,ప్రోత్సాహకాలు కూడా ముఖ్యం.( ఉదా; గుజరాత్,-బెంగాల్ ) మన ఆంధ్ర ప్రదేశ్లో విశాఖ వంటి 2 వ తరగతి నగరాల్లో ఈ పరిశ్రమ విస్తరించడానికి ప్రభుత్వం తోడ్పడు తున్నది.ఏమైనా స్థలనిర్ణయం పరిశ్రమలకే విడచిపెట్టాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి