12, జూన్ 2009, శుక్రవారం
జూనియర్ డాక్టర్ల లొల్లి
జూనియర్ డాక్టర్లు మళ్ళీ లొల్లి మొదలు పెట్టినారు.డాక్టర్లను ఎవరూ ఊరకే కొట్టరు.ఆవతల వ్యక్తికి చాలా కడుపు మండుతే తప్ప ఊరకనే ఎవరూ కొట్టరు.ప్రభుత్వాసుపత్రులలో డాక్టర్లు చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.నాకు కూడా ప్రభుత్వాసుపత్రిలో ఒక అనుభవముంది.మా బంధువు ఒకాయన కు చేయి విరిగితే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాం.అక్కడ డాక్టర్లకు ప్రతి ఒక్కరికీ ప్రేవేట్ ప్రాక్టీసు ఉంది.అక్కడ డాక్టర్లు అందరూ విదేశీ కార్లు వాడుతున్నారు.అక్కడ మా బంధువును చూసిన తర్వాత అక్కడ డాక్టరు తన ప్రవేట్ క్లినిక్కు కు రమ్మని అడ్రస్ చెప్పాడు.అక్కడ బేరం మొదలు పెట్టినాడు.మేము అంత డబ్బు ఇవ్వమని చెప్పేసరికి మాకు పదునైదు రోజులు అడ్మిస్సినే దొరకలేదు.అడ్మిట్ అయిన తర్వాత ఒక డాక్టరు ఉదయం ఇంజేక్షేన్ వ్రాసి పోతే అది వేయడానికి ఎవరూ వచ్చేవాళ్ళు కాదు .అక్కడ ఉన్న నర్సులను అడిగితే మేము వేయకూడదు.జూనియర్ డాక్టరు వేస్తాడు,అని చెప్పేవాళ్ళు.జూనియర్ డాక్టర్లు ను అడిగితే చాలా నిర్లక్ష్యంగా జవాబు చెప్పేవాళ్ళు.చివరకు ఆ రోజంతా ప్రయత్నం చేసినా గానీ ఇంజక్షన్ వేయించు కోలేకపోయాము.మాకేమో ఇన్ఫెక్షన్ వస్తుందని భయం.చివరికి అక్కడ నుండి డిశ్చార్జ్ చేయించుకొని పుత్తూరు కు వెళ్లి కట్టుకట్టించుకొని వచ్చినాము.అటువంటి సందర్భములో కొట్టాలని అనిపించదా? ప్రభుత్వం ఈ ఆసుపత్రుల మీద ,డాక్టర్లమీద ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంది.కానీ ఈ డాక్టర్లకు కొంచం కూడా సామాజిక భాద్యత లేదు.వీళ్ళు డాక్టరులుగామారడానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది ప్రజల సొమ్మే అని వీళ్ళు మర్చిపోతున్నారు.ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలకుజవాబుదారీగా లేనంతవరకూ ప్రజలకు వేరే మార్గంలేక ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూనేఉంటారు.జూనియర్ డాక్టర్లు స్త్రైకులు,ధర్నాలు చేస్తే వాళ్ల డిగ్రీ ని రద్దు చేయాలి.ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హక్కువాళ్లకు లేదు.వీళ్ళు ప్రతిసారీ ఇలాగే చేస్తున్నారు.కావున వాళ్ల బెదిరింపులకు ప్రభుత్వం భయపడకూడదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్‌లు:
శస్త్రచికిత్స ద్వారా బిడ్డను కనడానికి గర్భిణి నిరాకరించడంతో వచ్చే డబ్బులు పోయాయన్న దుగ్ధ కొద్దీ ప్రసవం తర్వాత బిడ్డ చేతిని కత్తిరించిందొక కర్కశ వైద్యురాలు.వైద్యవృత్తికే కళంకం లాంటి ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. శిశువు జన్మించాలంటే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారని... అందుకు నిరాకరించడంతో పుట్టిన తర్వాత శిశువు కుడి చేతిని కత్తిరించి టేపుతో అతికించారని తల్లితండ్రులు ఆరోపించారు. ఈ విషయం చెప్పకుండా ఇంటికి పంపించివేశారని చెప్పారు. రెండురోజుల తర్వాత ఈ విషయాన్ని గమనించి మరో ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. అక్కడి వైద్యుడు శిశువు చేతిని కత్తిరించారని చెప్పారట.(ఈనాడు22.7.2010)
రచయిత వ్రాసింది ..అక్షరాలా నిజం !
రచయిత వ్రాసింది ..అక్షరాలా నిజం !
కామెంట్‌ను పోస్ట్ చేయండి