1, జూన్ 2009, సోమవారం

ఆధునిక వెట్టిచాకిరి

కార్పోరేట్ కాలేజీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి.తమ కాలేజీ లకు ఇన్ని ర్యాంకులు వచ్చినాయి ,ఇంతమంది .ఐ.టి లకు సెలెక్ట్ అయినారని తిరిగి తమ విద్యా వ్యాపారాన్ని పెంచు కోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు.ఎంతమంది పరీక్షలు వ్రాసినారు,సీట్లు,ర్యాంకులు రాని వారు ఎంతమంది కాలేజీ లలో ఉన్నారనే విషయం ఎవరికీ తెలియడంలేదు. కాలేజీలు తల్లితండ్రులను,పిల్లలను తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ,తాముకోటీశ్వరులు కావడానికి పావులుగా వాడుకుంటున్నారు,తప్ప పిల్లల భవిష్యత్ గురించి ఏమీ పట్టించుకోవడం లేదు.సివిల్ సర్విసులలో నెగ్గిన వాళ్లు కూడా రోజుకు ఎనిమిది గంటలు చదివితే చాలంటున్నారు.కానీ కాలేజీలు పిల్లలనుఒక రూము కు పరిమితము చేసి సుమారు పంతొమ్మిది గంటలు చదివిస్తున్నారు.చదివించడమనే దాని కంటే యాజమాన్యాలు కోటీశ్వరులు కావడానికి పిల్లల చేత వెట్టి చాకిరి చేయిస్తున్నారని చెప్పవచ్చు.పిల్లలకు ఆటలు ,మరే ఇతర వ్యాపకాలు లేకుండా చేసి వారిని మానసిక వికలాంగులుగా మారుస్తున్నారు. కాలేజీ లు సాగిస్తున్నఅరాచకాలను,ఆధునిక వెట్టి చాకిరి ని అడ్డుకోక పోతే సమాజం భ్రష్టు పట్టి పోతుంది.



5 కామెంట్‌లు:

Icanoclast చెప్పారు...

మయూఖ అంటే ఏమిటండీ?

Icanoclast చెప్పారు...

for the comment feed.

మయూఖ చెప్పారు...

మయూఖ అంటే కాంతి కిరణం.

Padmarpita చెప్పారు...

నిజంగా ఆ పిల్లని చూస్తే జాలి వేస్తుంది.

Pravar చెప్పారు...

ఈ పరిస్థితులని ఒకసారి ఆలోచిస్తే, తల్లిదండ్రుల mindset కారణమనిపిస్తోంది. ఇప్పుడు రెండే రెండు కోర్సులు ఉన్నాయ్ మనకు: డాక్టర్ లేదా ఇంజనీర్, ఇవి తప్ప మిగతావన్నీ వేస్ట్ అని వాళ్ళ అభిప్రాయం. ఈ రోజుల్లో ఎంత మంది తల్లితండ్రులు సివిల్ సర్వీసెస్, ఆర్ట్స్, ఆర్థిక విద్య గురించి ఆలోచిస్తున్నారు ? లేదా పిల్లల్లో టాలెంట్ ని చూసి సరైన కోర్సు ఎంత మంది నిర్ణయిస్తున్నారు?
అందరూ డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఇంకా అన్ని సీట్లు ఎక్కడుంటాయి? అందుకే ఇంత పోటీ ఉంది. పిల్లలు ఇష్టం లేకపోయినా పుస్తకాలు భట్టీ పట్టాల్సి వస్తోంది. పగలు రాత్రి ఆహరం నిద్ర మర్చిపోయి చదవాల్సి వస్తోంది.
ఈ పరిస్థితి మారాలంటే తల్లి తండ్రులు మారాలి. పోటి గురించి కాదు ఆలోచించాల్సింది, పిల్లలకు పనికివచ్చే విద్య అబ్బుతుందా, ఏమైనా నేర్చుకుంటున్నారా అని ఆలోచించాలి. వారికీ తగ్గ విద్యని ఎంచుకొని దాన్లో నైపుణ్యం సాధించేలా చూసుకోవాలి.