ఎన్నికలు అయి ,ఓడిపోయిన తర్వాత చంద్రబాబు గారి ప్రకటనలు,ఆయన ముఖంలోని భావాలను గమనించినట్లైతే అధికారం అనేది ఈ రాష్ట్రంలో ఆయనకు తప్ప వేరే ఎవరికీ ఇవ్వకూడదు,రాజరికం లాగా ఆయననే ప్రతిసారీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుండ పెట్టాలి అనే భావనతో ఉన్నారు.లోక్సత్తా ,ప్రజారాజ్యం పార్టీలు వచ్చి మమ్మలను ప్రతిపక్షంలో కూర్చో పెట్టినారు అన్నాడు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా పార్టీ పెట్టి వాళ్ల విధానాలు చెప్పుకొని ఎన్నికలలో పోటీ చేయవచ్చు.వాళ్ళొచ్చి ఈయన జాగీర్దారును లాక్కోన్నట్లు ప్రజాస్వామ్య స్ఫూర్తి కి విరుద్దంగా మాట్లాడాడు.తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతాడని ఊహించలేదు.అటువంటి ఫ్యూడలిస్టిక్ భావాలు కలిగిన వ్యక్తి తో తొమ్మిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాలించ బడినారంటే అది ప్రజల ఖర్మ . అసెంబ్లీ లో స్పీకరు గా ఎన్నికైన వ్యక్తిని అన్ని రాజకీయ పార్టీల నాయకులు అతని స్థానానికి పిలుచుకొని పోవడం ఒక సాంప్రదాయం.మొదటి సారి అసెంబ్లీ కి వచ్చినపార్టీ సభ్యులు కూడా చాలా హుందాగా ఆ సంప్రదాయం పాటించారు.ఈయన ఆ సంప్రదాయాన్ని కూడా పాటించ కుండా ప్రజాస్వామ్య వ్యవస్థ లో స్పీకరు స్థానానికున్న గౌరవాన్ని దిగజార్చారు.ఈ రోజు అసెంబ్లీ లో ఆయన హావభావాలు పరిశీలిస్తే ఆయన చాలా అన్ ఈసీ గా కూర్చున్నట్లు కనిపించింది.ముఖ్యమంత్రి పీఠం ఆయన జన్మ హక్కు అయినట్లు,దాన్ని వేరెవరో ఆయననుంచి బలవంతంగా లాక్కున్నట్లు ఆయన భావాలు కన్పిస్తున్నాయి.వాళ్ల సభ్యుడు మాట్లాడు తూ స్పీకర్ స్థానానికి కులాన్ని,ప్రాంతాన్ని అంటగడుతూ మాట్లాడాడు.ముఖ్యమంత్రి,ప్రతిపక్షనాయకుడు,స్పీకర్ ముగ్గురూ ఒకే ప్రాంతం నుండి వచ్చినట్లు తెలుగుదేశం వాళ్లకు బాధగా ఉంటే ప్రతిపక్ష నాయకుని పదవిని చంద్ర బాబు గారిని త్యజించి వేరే ప్రాంతం వాళ్లకు ఇస్తే సరి పోతుంది.ఇప్పుడు చంద్రబాబు గారి కి వచ్చిన సీట్లు ఆయన ముఖం చూసి ఎవరూ ఓట్లు వేయలేదు.మహా కూటమి కట్టడం వలెనే ఆయనకు ఆ సీట్లు వచ్చినాయి అని ఆయన గుర్తు పెట్టుకుంటే మంచిది.చంద్రబాబుగారిని నమ్మడం ప్రజలు ఎప్పుడో మర్చి పోయినారు.ఆయన ఇప్పటికైనా ప్రజాస్వామ్య స్ఫూర్తి తో వ్యవహరిస్తే ఆయన గౌరవం మరియు శాసన సభ గౌరవం ఇనుమడిస్తుంది.లేదంటే రామారావు గారు ప్రజలకు ఎంతో సేవ చేయాలనీ స్థాపించిన పార్టీని ,చంద్రబాబు గారిని ప్రజలు ఛీ కొడతారు.
4, జూన్ 2009, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
10 కామెంట్‌లు:
"ఇప్పుడు చంద్రబాబు గారి కి వచ్చిన సీట్లు ఆయన ముఖం చూసి ఎవరూ ఓట్లు వేయలేదు.మహా కూటమి కట్టడం వలెనే ఆయనకు ఆ సీట్లు వచ్చినాయి అని ఆయన గుర్తు పెట్టుకుంటే మంచిది".
Wrong analysis. If Mahakootami was a factor, then Mahakootami might have got 100+ seats in Telangana.
TRS is not a player outside Telangana. And you know the strength of CPI and CPM.
If Mahakootami worked as a unit, they might have got 100+ seats in Telangana, they have the necessary vote percentage (50% or more).
So it was the strength of Babu and TDP, so they got 90+.
While analyzing election results, don't bring your personal dislike about Babu into it.
ఏ పదవికైనా గౌరవం ఆ పదవిలో ఉన్నవారి ప్రవర్తనను బట్టి ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి గత చరిత్ర అంటే ఆయన గత శాసన సభలో ప్రవర్తించిన తీరును బట్టి ఆయన స్ఫీకరు పదవిని నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని ఎవరూ అనుకోవడంలేదు. అసలు ప్రతిపక్షాన్ని కట్టడి చేసేందుకే ఆయనను ఎన్నికచేసారనిపిస్తోంది.ఈయన సురేష్ రెడ్డి గారికన్నా నాలుగాకులు ఎక్కువేచదువుతారులెండి.ముందుముందు తెలుస్తుంది ఆయన స్పీకరు పదవికి గౌరవం తెస్తాడో లేక ?
గత అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడిని విమర్శిస్తూ వాళ్ళ అమ్మ ప్రస్తావన తీసుకొచ్చిఅసెంబ్లీలో మాట్లాడకూడని మాటలను మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఆ పదవికి ఎంత గౌరవం పెంపొందించారో మీకు తెలియదా ?
మొత్తం పైన మీకు చంద్రబాబుగారిపైన చాలా కోపమున్నట్లుంది.
అయినా గొంగడిలో కూర్చుని అన్నంలో వెంట్రుకలున్నాయన్నట్లు రౌడీలను,ఫ్యాక్షన్ లీడర్లను, అవినీతిపరులను ,జనాలను మోసం చేసేవాళ్ళను ఎన్నుకుంటూ పదవులకు గౌరవం ఆశించడమనేది ఎంతవరకు సమంజసమో ఆలోచించండి.
ఇలా చెప్పానని నేను చంద్రబాబు అభిమానినని మాత్రం అనుకోకండి.
చంద్రబాబు ఒక తీవ్రమైన నిస్పృహలో ఉన్నారు. కొంత కాలం చూద్దాం.
I agree totally with vijaymohan garu.
If you have observed KKReddy in the last five years as chiefwhip, you don't come to this conclusion.
The displeasure expressed by the opposition should be a areminder at should be at the back of Mr.Reddy's mind when he is on the speaker's seat.
Why they did not offer the speaker's position to a Dalit???
TDP did honor that community in making Pratibha Bharati and Balayogi.
Ia m not a great fan of Chandrababu,but he proved to be a credible opposition leader inspite of humiliation he faced in the assembly and never lost his temper.
please be clear when you deal with a topic and don't drift.
if you don't like Babu please write a different mail, speaker selection has nothing to do with assembly elections
పైన అజ్ఞాత గారు చెప్పిన విషయాన్ని పూర్తిగా అంగీకరిస్తున్నా. నా ఉద్ధేశ్యం లో మహాకుటమి చాలా తప్పు concept, జనాలు కూటములతో విసిగిపోయి ఉన్నారు, ఎవరో ఒకరికి పూర్తి గా మద్దతు తెలిపి ప్రభుత్వం సుస్థిరంగా ఉంటె చాలు అనుకున్నారు. అలాంటప్పుడు కూటమి ఎట్లా సక్సెస్ అవుతుంది? ముఖ్యంగా కూటమి లో కావాల్సింది ఐక్యత అది లేదు అని ఎన్నికల ముందే ప్రజల్లో స్పష్టంగా చాటుకున్నారు. భావ సారుప్యత లేని పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఓట్లు వేయడానికి ప్రజలు పిచ్చి వాళ్ళు కారు కదా!
తెలుగు దేశం తరఫునుంచీ ఇదొక విఫలమైన రాజకీయ ఎత్తుగడ. అనవసరం కూడా. తెలుగుదేశం ఓటమి నుంచీ ఇంకా కోలుకోలేదు. భవిష్యత్తుమీద బెంగతో ఉన్నారు. ఈ సమయంలో ఇలాంటివి తప్పవు.
అజ్ఞాత గారూ చంద్ర బాబు గారు మహా కూటమి తో పొత్తు పెట్టు కోని పాటైతే ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా వచ్హేవి కావు.ఆయనకు ఈ విషయం తెలుసు కాబట్టే అందరి కాళ్ళా వేళ్ళా పడి మహాకూటమిని కట్టారు.సినీ గ్లామరు తో సహా అన్ని ఆయుధాలు వాడినందు కే ఈ రోజు చంద్రబాబు గారికి అన్ని సీట్లు వచ్హినాయి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా తక్కువ ఉంది.అంతో ఇంతో ఉన్న వ్యతిరేక ఓట్లు చీలి పోకుండా కూటమికే పడ్డాయి. సి.పి.ఇ,సి.పి.ఎం,టి.ఆర్.ఎస్ కు అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉంటుంది.ఆ ఓట్లు కూడా కూటమి కి ఉపయోగ పడ్డాయి.చంద్రబాబు గారితో పొత్తు పెట్టు కోవడం వలన మిగతా పార్టీ ల వాళ్లు దెబ్బ తిన్నారు.ఎందుకంటే ప్రజలు ఆయనను విశ్వసించడం లేదు.ఆయన తో పొత్తు పెట్టుకోవడం వలన వీళ్ళ విశ్వసనీయత కూడా దెబ్బతినింది.చంద్రబాబు గారి నాయకత్వం క్రింద తెలుగు దేశం పార్టీ ఉండడం అంటే కుక్క తోక పట్టుకొని గోదావరిని ఈదినట్లే.రామారావు గారి లాంటి మహాను భావుడు పెట్టిన పార్టీకి చంద్రబాబు గారి నాయకత్వం చాలా చేటు తెస్తోంది.తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం క్రింద ఇంకా కొన్ని రోజులు ఉంటే ఆ పార్టీకి పుట్ట గతులు ఉండవు.
విజయ మోహన్ గారూ ఏ పదవి లో ఉన్నప్పుడు ఆ పదవి కి వన్నె తెచ్హేలా ప్రవర్తించాలి.సహజంగానే కిరణ్ కుమార్ గారు చీఫ్ విప్ గా ఉన్నప్పుడు అధికార పక్షాన్ని డిఫెండ్ చేయాలి కాని అప్పుడు కూడా చంద్రబాబు గారి అడుగులకు మడుగులు ఒత్తలేడు కదా.మొదటి రోజే చంద్రబాబు గారు సంప్రదాయం పాటించకుండా స్పీకరు స్థానాన్ని అగౌరవ పరిచి ,స్పీకరు స్థానానికి పక్షపాతం అంటగట్టాడు.ఈయన హుందా గా ప్రవర్తించి ఉంటే స్పీకరు నుండి నిష్పక్షపాతాన్ని ఆశించి ఉండవచ్హు.మొదటి రోజే ఈయన ప్రవర్తన స్పీకరు తో యుద్దానికి దిగుతున్నట్లనిపించింది.ఎవరి ప్రవర్తన అయినా ఎదుటి వారి ప్రవర్తనను బట్టే ఉంటుంది.
చిలమకూరు విజయమోహన్ గారి అభిప్రాయాన్ని బలపరుస్తాను.
విజయ్ మోహన్ గారు అన్నట్లు,
>>గొంగడిలో కూర్చుని అన్నంలో వెంట్రుకలున్నాయన్నట్లు రౌడీలను,ఫ్యాక్షన్ లీడర్లను, అవినీతిపరులను ,జనాలను మోసం చేసేవాళ్ళను ఎన్నుకుంటూ పదవులకు గౌరవం ఆశించడమనేది ఎంతవరకు సమంజసమో ఆలోచించండి.
చిలమకూరు విజయమోహన్ గారి అభిప్రాయాన్ని బలపరుస్తాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి