చంద్రబాబు గారు లోక్సత్తా పార్టీ మీద తిరిగి గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టినారు.ముఖ్యమంత్రి కావడానికి ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు మాత్రమే అర్హతలు ఉన్నాయని ఆయన భ్రమ.లోక్సత్తా ,ప్రజారాజ్యం వాళ్లు వచ్చి ఆయన ఓటు బ్యాంకు ను కొల్లగొట్టారని ఆయన ఆరోపణ.ఏదో ఆయన జాగీరు పోయినట్లు,ఆయన అధికారంలోకి రాకపోవడం ఆంధ్రప్రజలు చేసుకున్న పాపం లాగా ఆయన చాలా బాధపడిపోతున్నారు.ఆయనకు విశ్వసనీయత లేదని మొన్న జరిగిన ఎన్నికలలో ప్రజలు తేల్చేశారు.ఆయన ఏ రోజు కూడా ప్రజల అవసరాలు గుర్తించలేదు.ఎంతసేపు ఆయన దృష్టి అంతా అధికారాన్ని ఏదోవిధంగా పొందడమే.ఈవాళ లోక్సత్తా మీద ఆయన ఆరోపణలుచూసి ప్రజలు నవ్విపోతున్నారు.ప్రజలకు కొత్తరాజకీయాన్ని పరిచయం చేసిన లోక్సత్తా లాంటి పార్టీని ఆయన కాంగ్రెస్ ఏజెంటు లాగా అభివర్ణిస్తే అంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొకటి లేదు.చంద్రబాబుగారి మీద కొంతమందికి అంతో ఇంతో ఉన్న సానుకూల మైన అభిప్రాయం కూడా ఈ వాళ పటాపంచలయి పోయింది.ఈ ప్రకటన తో ఆయన విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింది.ఆయన వైఖరి ఎలా ఉందంటే ఏదైనా పోటీలో నేనొక్కన్నే ఆడతాను ,అందులో నేనే మొదటి ,తర్వాతి స్థానాలలో ఉంటాను మిగతా వాళ్ళంతా చూస్తూ ఉండండి అనే విధంగా ఉంది.ఆయన ఓటమి ని క్రీడా స్ఫూర్తితో తీసుకోలేకున్నారు.ఆయన మానసిక పరిస్థితి ఇలాగే ఉంటే ఆయన పార్టీ పరిస్థితి ,ఆయన్ను నమ్ముకున్న వాళ్ల పరిస్థితి కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు ఉంటుంది.తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుగారే గుదిబండగా మారే పరిస్థితి ఉంది.
5, జులై 2009, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 కామెంట్‌లు:
లోక్సత్తా పై చంద్రబాబు వ్యాఖ్యలో సత్యం ఉన్నా నేను ఆస్చర్య పోను. ఎందుకంటే ఫస్టఫాల్ జె.పి ఒక బ్యూరాక్రెట్. అతను అన్నేళ్ళు ప్రభుత్వ యంత్రాంగంలో కొనసాగాడంటేనే అతనెంత పెద్ద హిప్పక్రట్టో అర్థం చేసుకోవచ్చు.
I am not supporter of JP. కానీ జె.పి. వల్ల చంద్రబాబు ఓడిపోయాడంటే నేను నమ్మను. కేవలం ఒక్క సీటు గెలుచుకున్న లోక్ సత్తా వల్ల తెలుగు దేశం పార్టీ ఓడిపోయింది అనుకోవడం హాస్యాస్పదం.
మురుగేషన్ గారూ ప్రభుత్వ యంత్రాంగంలో ఉండి నిజాయితీగా ఉండవచ్హు.అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి.ఈ వాళ కేంద్ర మంత్రి గా ఉన్న ఆంటోని గారిని,ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్ గారిని చెప్పుకోవచ్హు.ఈ వ్యవస్థ లో అవినీతి ఉన్నంత మాత్రాన అందరినీ అదే గాటనే కట్టివేయలేము. అలాగే జె.పి.గారిని కూడా అవినీతి జాడ్యం అంటని వారిగా చూడవచ్హు.ఆయనకు అధికారమే పరమావధి అయి ఉంటే ఆయన కూడా మార్పు అంటూ వచ్హిన చిరంజీవి లాగా ,మిగతా పార్టీలలాగా డబ్బు,సారాయి రాజకీయాలు నడిపేవారు.ఆయన యేమి చెప్పినారో అదే చేసి చూపించినారు.ఆయనకు వచ్హిన ఒక సీటు చాలా అమూల్యమైనది.గంగి గోవు పాలు గరిటెడైన చాలు అన్నట్లు.
చిత్తూర్ మురుగేశా, సాంబార్ వాళ్లు అందరూ వెధవలే అంటె ఎంత చెత్త statement అవుతుందో, బ్యురోక్రాట్స్ అందరూ హిప్పోక్రాట్స్ అనటమూ అంత చెత్త statement అవుతుంది.
JP ప్రకాశం కలెక్టర్ గా చేసినప్పుడు, తన శైలి ని దగ్గరా చూసిన వాళ్లను కాని, తెలిసిన వాళ్లను కాని ఎవరినయినా కనుక్కోండి చెప్తారు, తను చేసిన పనుల గురించి కాని, అక్కడి గుండ్లకమ్మ ప్రాంతం లో రైతుల దగ్గర తనకు ఉన్న పాపులారిటీ గురించి కాని. తను, అందరి బ్యూరోక్రాట్ లాంటివాడు, కాబట్టె, చాలా రోజులు లూప్ లైన్ లో, ముక్యం గా మంచి బ్యురోక్రాట్స్ అంటె భయపడె రాజకీయనాయకులు ఉన్నన్ని రోజులు ఉన్నది. కాస్తో, కూస్తో, తన ప్రతిభని గుర్తించినది NTR మాత్రమే. ఆ NTR పోయినతరువాత తను ఎటూ బయటకు వచ్చి లోక్ సత్తా పెట్టారనుకోండి.
ఇక, ఒక సీట్ గెలిచిన తను, TDP అవకాసాలను ఎలా దెబ్బ కొట్టగలరు అనేది, గెలిచింది ఒక సీట్ అయినా, ధనరాజ్యం లాగానే, లోక్ సత్తా కూడా, TDP అవకాశాలను బాగానే దెబ్బకొట్టింది అని చెప్పవచ్చు పోయిన ఎన్నికలలో, ముక్యంగా పట్టణ ప్రాంతాలలో, ఉదాహరణకు లోక్ సత్తా లేకపోతే, బెజవాడ లో, గద్దె తప్పక గెలిచి ఉండేవాడు.
ఇక, చంద్రబాబు ఆరోపణలలో నిజాలు ఉన్నాయో, లెదో చెప్పటం మాత్రం కష్టమే. ఆ విషయం లో మురుగేష్ అన్నట్లు నిజాలు ఉన్నా నేను ఆశ్చర్యపోను. ఎప్పుడు అయితే లొక్ సత్తా, ధనరాజ్యం తో పొత్తులు అంటూ మొదలెట్టిందో, అప్పుడే ఇలాంటి match fixing కు తెర direct or indirectly తీసినట్లయ్యింది. దానికి తోడు, కొద్ది సంవస్తరాలలో నే, పూర్తి అధికారం లోకిరావటానికి తన దగ్గర ప్రణళికలు ఉన్నాయ్యి అంటున్న JP మాటలలో కూడా, అధికారం కోసం, విలువలకు తిలోదికాలు ఇవ్వటానికి మేమూ రెడీ అన్న అర్ధం నాకెందుకో అనిపిస్తుంది.
చూద్దాం ఇంతవరకూ ఎంతో మందిని తన విలువలతో inspire చేసిన లొక్ సత్తా ఆ విలువల కోసం, విలువల మీద నిలబడుతుందో, లెక రాజకీయ తాను లో తాను ఓ ముక్క అవుతుందో!!
ఈ గోబెల్స్ ఎవరండీ బాబూ! రాజశేఖరరెడ్డిగారు పదవిలోకొచ్చిన తర్వాత ఈ మాట ఎక్కువగా వినపడుతోంది
గోబెల్స్ హిట్లర్ దగ్గర మంత్రిగా పని చేసే వాడు. అతను కూడా హిట్లర్ లాగే పచ్చి అబద్దాలకోరు. చంద్రబాబు కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు హిట్లర్, గోబెల్స్ స్థాయిలో అబద్దాలు ప్రచారం చేసేవాడు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి