6, జూన్ 2009, శనివారం

భూస్వామ్య భావజాలం

చాలా మంది రాజకీయనాయకులు మేము దళితులకు స్పీకరు పదవి ఇచ్చినాము.మైనారిటి లకు రాష్ట్రపతి పదవి ఇచ్చినాము అనడం ఫ్యాషన్ అయి పోయింది.అంటే వాళ్లకు ప్రతిభ లేదా .వీళ్ళు ఇచ్చేవాళ్ళు ,దళితులు పుచ్చుకునేవాల్లా.ప్రతిభా భారతి గారిని,బాలయోగి వంటి దళితులను స్పీకరు ను చేసినాము అని ,మరియు కలాం గారి లాంటి మైనారిటి ని రాష్ట్రపతిని చేసినాము అని చంద్రబాబు గారు,ఈ మధ్యన మీరాకుమార్ లాంటి దళిత మహిళ ను లోక్సభ స్పీకర్ ను చేసినామని కాంగ్రెస్స్ వాళ్లు చాలా సార్లు అంటున్నారు.అంటే దళితులైన ,మైనారిటి లైన వీళ్ళందరికి ప్రతిభ లేదా.వాళ్ల వాళ్ల ప్రతిభను బట్టి వాళ్లకు ఆ పదవులు దక్కినాయి.ప్రజాస్వామ్య భారతదేశం లో ప్రజలందరికీ వాళ్ల వాళ్ల ప్రతిభను బట్టి ఎలాంటి పదవైనా పొందే అవకాశం ఉంది. దళితులని ఆ పదవులు ఇచ్చినాము అనడం దళితులను ,వాళ్ల ప్రతిభను అవమానించడమే అవుతుంది.మన రాజ్యాంగాన్ని వ్రాసింది ఒక దళితుడే. కావున ఆ మాటను పదేపదే అనడం భూస్వామ్య భావజాలమే అవుతుంది.మన రాజకీయనాయకులు ఆ పద ప్రయోగం మానుకుంటే దళితుల ను , మైనారిటి ల ను నిజంగా గౌరవించి నట్లవుతుంది.

30 కామెంట్‌లు:

vinod చెప్పారు...

కలాం గారు మొదటిసారిగా రాష్ట్రపతి కావడంలో చంద్రబాబు పాత్ర ఉన్న మాట నిజమేగా.ఆయన ప్రతిభావంతుడూ,సొంతంగా ఆలోచించేవాడూ కావడంవల్లనే రెండోసారికి ఆయన్ని పక్కనపెట్టి ప్రతిభ పాటిల్ కి పట్టం కట్టారు.

మీరా కుమార్ గారు ప్రతిభావంతులే.ఐతే ఆమెనే స్పీకర్గా ఎన్నుకోవడానికి కారణం ఆమె ఒక్కరే ఆ స్థానానికి న్యాయం చేయగలరనీ కాదు,ఆమెకంటే ప్రతిభావంతులు లేకా కాదు.కారణం ఆమె మహిళ+దళిత్.ఆమెకు మద్దతు ఇచ్చింది UPA+NDA.వాళ్ళలో హిందూ,ముస్లిం,దళిత్ ఇలా అన్ని వర్గాల వారూ ఉన్నారుగా.

ఐనా స్పీకర్ ,రాష్త్రపతి, ఇలాంటి పదవులన్నీ ఇస్తే పుచ్చుకునేవేగానీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుచుకునేవి కాదుగా.ప్రస్తుతం సోనియా గాంధీ ఇచ్చే వారూ ,మిగిలిన వారు పుచ్చుకునే వారు.
మొన్న ఏదో తెలుగు బ్లాగ్ లో ఎవరో కామెంట్ చేసారు స్పీకర్ పదవికోసం కిరణ్ కుమార్ రెడ్డి,అశోక గజపతిరాజులని పోటీ చేయించే బదులు అదేదో ఒక దళితుడికి ఇవ్వొచ్చుగా అని.అక్కడికేదో వాళ్ళు ఇచ్చేవాళ్ళు ,దళితులు పుచ్చుకునేవాళ్ళూ ఐనట్లు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

వాళ్ళన్నదాంట్లో తప్పేమీ లేదు. ఇప్పటిదాకా కిందినుంచి పైదాకా దళితులు సంపాదించిన ఏ ప్రభుత్వ పదవులూ/ ఉద్యోగాలూ ప్రతిభతో గానీ, కృషితో గానీ సంపాదించుకున్నవి కావు. ఇదొక వాస్తవం. ఈ మాట అన్నంత మాత్రాన ఎవరూ ఎవరినీ అవమానించినట్లు కాదు. ఎవరూ ఎవరికీ శత్రువులు కారు. రిజర్వేషన్లు, కులపరమైన పొలిటికల్ కరెక్ట్ నెస్సులూ లేని సమాజం వచ్చాక మీరన్నది నిజమవుతుంది. అప్పటిదాకా అది అతిశయోక్తే అవుతుంది. దళితులు ప్రతిభని పెంచుకోకుండా అడ్డుపడుతున్నది, వారిని ఇలా మాటలు పడేలా చేస్తున్నదీ రిజర్వేషనే.

vinod చెప్పారు...

@తాడేపల్లి లలితా సుబ్రహ్మణ్యం
ఏంటండీ ,అంత మాట అన్నారు?
నాకు sweeping generalization అనిపిస్తుంది.

మయూఖ చెప్పారు...

లలితా సుబ్రమణ్యం గారూ మీ కామేంటు కు ధన్యవాదములు.లలితా సుబ్రమణ్యం గారూ అగ్రవర్ణపు వాళ్ళు సంపాదించుకున్న ఉద్యోగాలు అన్నీ ప్రతిభ తో మాత్రం సంపాదించుకున్నారని మీ అభిప్రాయమా? ఎంతో మంది డబ్బున్న అగ్రవర్ణపు వాళ్ళు డొనేషన్లు కట్టి ప్రైవేట్ కాలేజీలలో సర్టిఫికేట్లు కొనుక్కొని వచ్హారు. వాళ్ళంతా మేధావులని మీ అభిప్రాయమా? రాజకీయ, అధికార అండదండలు ఉన్న అగ్రవర్ణపు వాళ్ళు పైరవీ ల తో ఎంతో మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు.మీకు తెలియదా?దళితులు రాజ్యాంగం వాళ్ళకు ఇచ్హిన హక్కులను వాళ్ళు ఉపయోగించు కుంటున్నారు.సమాజంలో జాతి,కులాల వలన ఉత్పన్న మైన ఆర్థిక వైరుధ్యాలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే.రిజర్వేషన్లు ఉపయోగించుకొని దళితులు ,మిగతా నిమ్న కులాల వాళ్ళు ఆర్థికంగా,సామాజికంగా పైకి ఎదగాలి.కులాన్ని బట్టి తెలివితేటలు ఉండవు.మీరు మరీ సంకుచితంగా మాట్లాడుతున్నారు.దళితులలో ఎంతోమంది మేధావులు ఉన్నారు.అలాగే అగ్రవర్ణాలలో ఎంతో మంది మూర్ఖులు ఉన్నారు.విషయాన్ని మరీ జనరలైజ్ చేసి మాట్లాడారు.

రాజకీయనాయకులు మాట్లాడుతూ దళితులైన వీళ్ళను స్పీకరును చేసినాము,వాళ్ళను రాష్ట్రపతిని చేసినాము అని చెబుతున్నారు.ఏదో వీళ్ళ సొత్తు తెచ్హి దళితులకు కట్టబెట్టినట్లు.ఆ మాట ప్రతిసారీ అంటూ ఉంటే వినడానికి అసహ్యంగా ఉంది.దళితులకు భిక్ష వేసినట్లు వీళ్ళు మాట్లాడుతున్నారు.ఆ మాట తిరిగి అంటే అది దళితులను అవమానించినట్లే.ఎవరైనా దళిత సంఘాలు ఈ మాట ను లేవనెత్తుతారు అని చాలా రోజులు చూసాను.కానీ ఏవరూ లేవనెత్తలేదు.అందుకే నాకు బాధ వేసి ఈ పోస్ట్ వ్రాశాను.

Praveen Mandangi చెప్పారు...

రమణారెడ్డి గారు, మీరు భూస్వామ్య భావజాలాన్ని ఏమాత్రం విశ్వసించకపోతే మీ పేరు నుంచి "రెడ్డి" అనే పదాన్ని కూడా ఉపసంహరించుకోవాలి. రంగనాయకమ్మ గారు తన ఇంటి పేరుని ఉపసంహరించుకోగలిగినపుడు కులం పేరుని ఉపసంహరించుకోవడం కష్టం కాదు.

మయూఖ చెప్పారు...

ప్రవీణ్ గారూ పేరులో ఏముందండి.మనసులోని అభిప్రాయాలలో ,భావాలలో ఉండాలండి.పేరు మార్చుకున్నంత మాత్రాన మనసులోని భావాలు అదే విధంగా ఉంటే ఏం ఉపయోగముందండి.

మయూఖ చెప్పారు...

రెడ్డి అనేది కులం పేరు కాదండి.రెడ్డి కాని వాళ్ళు కూడా రెడ్డి అని పెట్టుకున్నారు.ఉదాహరణకు మంత్రి రఘువీరారెడ్డి ,కార్మిక నాయకుడు పి.ఎల్.సంజీవరెడ్డి.

vinod చెప్పారు...

@రమణారెడ్డి గారు
రఘువీరా రెడ్డి గారిది రెడ్డీ కులం కాదా?ఏ కులమో తెలుసా? ఏ జిల్లా?

మయూఖ చెప్పారు...

రఘువీరారెడ్డి గారు యాదవులు.ఆయనది అనంతపురం జిల్లా నీలకంఠాపురం.

Praveen Mandangi చెప్పారు...

మంద కృష్ణ తన పేరు చివర "మాదిగ" అని కులం పేరు తగిలించుకోవడం వల్ల దళితుల మధ్యే అభిప్రాయ బేధాలు వచ్చాయి.

అజ్ఞాత చెప్పారు...

@Ramana reddy,
దళితులలో ఎంతోమంది మేధావులు ఉన్నారు.విషయాన్ని మరీ జనరలైజ్ చేసి మాట్లాడారు.
Can you write top 50 medhavi's in dalits after in dependence in different fields who are all on par with any other forward caste medhavis.

Pravar చెప్పారు...

ఇంకా ఎంత కాలం ఈ రిజర్వేషన్లు ? రిజర్వేషన్లు శాశ్వతంగా ఉండకూడదు, సామజిక సమానత వచ్చింది అనిపించిన రోజు రిజర్వేషన్లు తీసివేయాలి. అప్పుడు ఎవరు పై స్థాయికి వచ్చినా వాళ్ళ కృషి, సామర్ధ్యం వల్ల వచ్చినట్లవుతుంది.

అప్పటివరకు దళితులు గొప్ప వాళ్ళా, రెడ్లు గొప్ప వాళ్లా, ఇంకో కులం వాళ్ళు గొప్పా అన్న అర్థం పర్థం లేని వాదన కొనసాగుతూనే ఉంటుంది...మన రాజకీయ నాయకులు ఈ కులం బలహీనతను cash చేస్కుంటూనే ఉంటారు...

పునర్వసు చెప్పారు...

రిజర్వేషనులు ప్రజల సంక్షేమం కంటే రాజకీయనాయకుల స్వలబ్దికే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. రిజర్వేషనులు ఉంచుతూ వాటిని కొంతకాలము తర్వాత తొలిగించడమనేది ఎప్పటికీ సాద్యముకాదు. రోజురోజుకి క్రొత్త క్రొత్త రిజర్వేషనులు అంటూ ప్రజల మద్య అంతరాలు సృష్టిస్తూ వోట్లను కులాల పరంగా చీల్చి తక్కువ వోట్లతో ఎక్కువ సీట్లు సాదించే చిత్త శుద్దిలేని రాజకీయనాయకులు ఉన్నంతకాలము రిజర్వేషనులు ఉంటాయి.

రమణా రెడ్డి గారు అన్నట్లు రాజ్యాంగ పరంగా లభించిన హక్కును దళితులు వాడుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరాదు. అయితే రాజ్యాంగమనేది ఎవరు తయారు చేస్తారు? గౌ: అంబేద్కరు ప్రతిపాదించిన రిజర్వేషనులు ఎన్ని, ఇప్పుడు ఎన్ని. కుల రిజర్వేషనులతో ఆ నిప్పు ఆగక, మత, ప్రాంత రిజర్వేషనులనే వికృత రూపం దాల్చింది.

నిప్పునార్పాలంటూ నూనె పోస్తూవుంటే నిప్పు ఆరదు, ఇంకా ఎక్కువగా మండుతుంది.

చర్చ ప్రతిభ గురించి కాబట్టి, అందరికి ప్రతిభ పెంచే పని ప్రభుత్వం చేపట్టాలి. దానికి తగిన రాజ్యాంగ మార్పులు చేయాలి. చదువుతో ప్రతిభ పెరుగుతుంది కాబట్టి ఆరంగంలో అందరికి అవకాశం దొరికేటట్లు
రిజర్వేషనులు నిర్దిష్ట కాలపరిమితితో ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరేటట్లు పభుత్వాలు పనిచేయాలి.
విద్యారంగంలో రిజర్వేషనుల వల్లే అగ్రవర్ణపు వాళ్ళు ఎంతో డబ్బు వెచ్చించి తమ పిల్లలకు డొనేషన్లు కట్టి ప్రైవేట్ కాలేజీలలో చదివిస్తున్నారు.

అగ్రవర్ణపు వాళ్ళు పైరవీల తో ఎంతో మంది ఉద్యోగాలు సంపాదిస్తున్నారని రెడ్డిగారు చెప్పారు. దానికి పరిష్కారం రిజర్వేషనులా? పదవితో వచ్చిన అధికార దుర్వినియోగం అగ్రవర్ణపు వాళ్ళు మాత్రమే చేస్తారా? దళితులు చేయరా?

ప్రతిభ ఉన్నవాడికీ లేనివాడికి ఆకలి సమానమే. కాబట్టి రిజర్వేషనులు ఉద్యోగరంగంలో ఉండకూడదు.

అంటరానితనం అనేది కుల వ్యవస్థ యొక్క వికృత రూపం. దానికి అంటరానితనం నేరము అనే రాజ్యాంగ నిబందన, దానిని చిత్తశుద్దితో అమలు పరచడమే పరిష్కారము.

ఇప్పుడు అందరూ అంటున్న 'చదువు ', ఇంగ్లీషు వాడు చెప్పిన చదువు. దానిని నేర్పడానికి వాడు రిజర్వేషను పెట్టలేదే?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, మన పాలకులు అందరికి అవకాశాలు కల్పించవచ్చు కదా? మరి రిజర్వేషనుల అవసరం ఏమొచ్చింది?

కులాలు పోవాలంటే కులాలను చూచించే పదాలు తమ పేర్లలోవాడకుండా ఉండడమే? లేదా అందరూ తమకు నచ్చిన కులాల పేర్లను తమ పేర్లలో కలుపుకోవడమే? (రఘువీరారెడ్డి పేరు లాగా). దానితో అంతా అయోమయం. అందరికి అర్థమవుతుంది, పేరులో కులం నేతి బీరకాయ లోని నేయియని.

కులము, మతము అనేవి వ్యక్తిగతాలు. రాజ్యాంగబద్దంగా కులాల లిస్టులు ప్రకటిస్తూ, వాటిని ప్రజలకు గుర్తుచేస్తూ, ప్రజలకు కులం లేదు, మతం లేదు, మనుషులందరూ సమానమే అనడం రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయనాయకులు ఆడే నాటకం.

Ajit Kumar చెప్పారు...

రమణారెడ్డిగారూ ఇప్పుడు నడుస్తున్నది భూస్వామ్య భావజాలమే. బ్రిటీష్ రాణి మనదేశాన్ని నెహ్రూగారికి అప్పగించింది. కనుక పూర్వపు జమీందార్లు, రాజవంశీయులు , భూస్వాములు దేశంలోని ఏ ప్రాంతం నుండయినా రాజప్రతినిధులుగా (ప్రజా ప్రతినిధులుగా)ఎన్నికయ్యే అవకాశం రాజ్యాంగం కల్పించింది. రిజర్వేషన్ లేకుండా దళితులు ,గిరిజనులు ఎన్నికలలో గెలిచే అవకాశాలు లేవుగనుక బ్రిటిష్ వారి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. రిజర్వేషన్ తో రాజప్రతినిధిగా ఎన్నికైనప్పటికీ స్పీకర్,రాష్ట్రపతి వంటి నామినేటెడ్ పోష్టుల్లో వారిని నియమించి తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.
రాజ్యాధికారం బ్రాహ్మణుల చేతుల్లో ఉన్నంతకాలం వాళ్ళు ఇచ్చే వాళ్ళూ దళితులు పుచ్చుకునేవారుగానే ఉండకతప్పదుకదా.
అలాగే ఉద్యోగాలపోటీలో రాజ్యాధికారం బ్రాహ్మణుల చేతుల్లో ఉన్నది గనుక వారికి అనుకూలంగా జ్ఞాపకశక్తి పరీక్షలునిర్వహించి ఎక్కువ భాగం ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. అదే రాజ్యాధికారం దళితులచేతుల్లో ఉంటే బహుశా ఈత పోటీలద్వారా ఉద్యోగాలు ఇచ్చి ఉండేవారు. అప్పుడు ఈ బ్రాహ్మణులకు కొంత రిజర్వేషన్ ఇస్తూ సముద్రంలో ఈదలేకపోయినా కనీసం మోకాళ్ళ లోతువరకు నీళ్ళలోకి రాగలిగితే ఉద్యోగం ఆని రిజర్వేషన్ ఇచ్చుండేవాళ్ళుగదా.ఏమంటారు?

అజ్ఞాత చెప్పారు...

@Ramana reddy,
దళితులలో ఎంతోమంది మేధావులు ఉన్నారు? When I asked top 50 medhavulu at leaset you did not mention one name. Indian govt gave rservations and lot of benifts to them, stil after 50 years we are struggling to write top 20 dalit intelectual people names in the country excluding people like mayavati and kanshi ram bcs they are politicians. Every body knows what they are good at. only writing books like maarthanda.

Kathi Mahesh Kumar చెప్పారు...

కులాన్ని బట్టి "వీళ్ళింతే" అని నిర్ణయించే మన వేల సంవత్సరాల గొప్ప సంస్కృతికి ఇస్తున్న షాక్ ట్రీట్మెంట్ రిజర్వేషన్లు. తరాలుగా,వేల సంవత్సరాలుగా అప్రకటిత రిజర్వేషన్లు పొందిన కొన్ని వర్గాలు/కులాలు/సమూహాల్లో ఇలాంటి తీవ్రమైన వ్యతిరేకత ఉండటం అర్థం చేసుకోదగ్గ పరిణామమే!

vinod చెప్పారు...

కూడలిలో నా బ్లాగ్ కూడా కనపడాలంటే ఎలా?support@veeven.comకు
మెయిల్ చేశా కానీ రిప్లయి లేదు.

http://www.vinvk.blogspot.com

మయూఖ చెప్పారు...

vinod ,goto your gmail and send mail to koodali.org stating your blog URL name.ok.it will take one day to appear your blog in koodali.

అజ్ఞాత చెప్పారు...

Mahesh,
I would be very happy if you would have told 25 names in sted of commenting తరాలుగా,వేల సంవత్సరాలుగా అప్రకటిత రిజర్వేషన్లు పొందిన కొన్ని వర్గాలు/కులాలు/సమూహాల్లో ఇలాంటి తీవ్రమైన వ్యతిరేకత ఉండటం అర్థం చేసుకోదగ్గ పరిణామమే!.
Do some soul search. You did not even recollet atleast K. R. Narayan's name. He was a very good ad sucessful diplomat. He significantly improved our relationship with Chaina during his tenure.
I am a Brahmin. Hope you will realize how Brahmin's remebers who contributed to this country irrespective of their caste.

Kathi Mahesh Kumar చెప్పారు...

@అనామకుడు: దళితుల పునాది లేకుండా, దళితులు చెమటోడ్చకుండానే ఈ సమాజ త్రిభుజం నిలిచుందనుకుంటున్నారా? పొలంలో రైతుకూలీలుగా ఇప్పటికీ పనిచేస్తున్న కోట్ల మంది దళితులు ఈ భారత నిర్మాణానికి పునాదులే.కేవలం మేధ ఆధారంగా contribution ని జమకట్టే బ్రాహ్మణికల్ భావజాలానికి ఈ శ్రమ జీవుల పెట్టుబడి ఏమర్థమౌతుంది?

కేవలం అలోచనే మేధకు ప్రామాణికత అనుకున్నా వచ్చిన సిమితమైన అవకాశాల మధ్యన పోరాటాల నడుమ దేశానికి తమవంతు మేధోసాయం చేసిన దళిత మేధావుల్నే తీసుకున్నా అంబేద్కర్ మొదలు చంద్రభాన్ ప్రసాద్ వరకూ కొన్ని వందల మంది (చూస్తే) కనిపిస్తారు. మీకు చూడటం ఇష్టం లేకపోయినా, వారందర్నీ పటంగట్టి మనసుల్లో పెట్టుకున్న దళితజనుల ఆర్తిని మాత్రం తక్కువచేసి చూడకండి.

మయూఖ చెప్పారు...

బాబూ అజ్ఞాత వీరుడా ,చాలా ఇంటర్వ్యూల బోర్డులలో మీ లాంటి బ్రాహ్మణ కుల దురంకారులు ఉండినారు.అందుకే మీరు అప్రకటిత రిజర్వేషన్లు పొందినారు.అందుకే మీలో చాలా మందికి ఉద్యోగాలు దొరికినాయి.అదంతా మీ ప్రతిభ అని మురిసి పోతున్నారు.ఒక వేల రిజర్వేషన్లు లేకుండా ఉండి ఉంటే మీ లాంటి బ్రాహ్మణ కుల దురంకారులు ప్రతిభను ఏ మాత్రం గుర్తించ కుండా కులం చూసి దళితులకు ఉద్యోగాలు ఇచ్హేవారు కాదు.అందుకే రాజ్యాంగం ఆ విధంగా దళితులకు ప్రొటెక్షన్ ఇచ్హింది.ఈ రోజు దేశంలో మీరు చూస్తున్న అభివ్రుద్ది దళితుల ,శూద్రుల నెత్తురు చెమట చుక్కల గా మారినందువల్లనే ,అది గుర్తు పెట్టుకోండి.ఎంతో మంది శూద్రుల,దళితుల నెత్తురు చెమట చుక్కలుగా మారి ఈ భూమిని తడిపినందువల్లనే ఈ రోజు మీరు నోట్లో పెట్టుకునే అన్నం ముద్ద అని మరిచి పోకండి.ఈ దేశాభివృద్దిలో శూద్రులు,దళితులతో పోల్చుకుంటే మీ contribution చాలా తక్కువ అని గుర్తు పెట్టుకోండి.మీ వంటి కుల అహంకారులు ఉన్నారు కాబట్టే ఈ వాళ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కావాలని తెరపైకి వచ్హింది.

అజ్ఞాత చెప్పారు...

ణా రెడ్డి అక్కడికే దో దళితులు/ శూద్రులు అంటె రైతులు కూలిలు బ్రహ్మణు లంతే పొలం చేయని వారిలా మట్లాడుతున్నావు. ఇంకా చేప్పాలి అంటె స్వీపింగ్ అనరలైషన్ చెస్తున్నావు. మా తాతల కాలం నుంచి మేము పొలలు దున్నాము. ఏదొ 1000 సంవత్సరాల నుంచి మా తాత లంత దేవాలయాలలో ను, ఏ.సి. గదులో సుఖంగా ఉంటే మీరు ఎదొ ఎండలో పడి పని చెసినట్టు రాస్తారు. చదివేవారు కూడ ఇది నిజమనుకుంటారు. అసలు విషయం ఏమంటే ఆ రోజుల లో ఇప్పుడు ఉన్న వాటి లో సగం దేవాలయాలు కూడా లేవు ఏ.సి.లు అసలికి లేవు. పొతన కూడ వ్యవసాయం చేశాడు.
*.ఊర్లలో బ్రాహ్మణులకు భూములు. వాళ్ళు ఊరక కూర్చొని తిని ఆ భూములాన్నిటినీ అమ్ముకున్నారు.ఇప్పుడు వాళ్ళు అడుక్కుంటున్నారు*
వాటిని వారి దగ్గర పాలేర్లుగా పనిచేసిన రెడ్డ్లు, శుద్రులు కొన్నుకున్నారు. మిగతా వారిలా పొలాలను ఉంచుకొని భుస్వాములై పక్కన వారి భూములను అక్రమించు కోలేదు.
వారు ఊరక కూర్చొని తిని అని నీకు అర్థమైంది నేను అందు లో చాలమంది తమ ఆచార వ్యవహారాలను ( ఉపనయనం, తద్దినాలు) పాటించటాని కొరకు అమ్ముకున్నారు అని అంటాను. మీరు మీ పర్సనల్ ఎక్ష్పిరియన్స్ మాట్లాడుతున్నారు (ఒక బ్రాహంణుడు ఉన్నాడు.ఆయన చిన్నప్పటి నుండి బెంగులూరులో ఇంగ్లీషు ).

మా పాటశాలలో ఒక దళిత టిచర్ నన్ను చిన్నప్పుడు చావ బాదే వాడు ఎందుకంటె ఆయన కు మీలా బ్రహ్మణులంటె మంట అందులో నేను చాలా నేను తెల్లగ ఉన్నటాను ఆయన అది ఒక ఈర్ష. నాకు అప్పటిలో తెలెది కాదు ఎందుకు నాను అందరిలో అవమానిస్తాడు అని. ఇటువంటి అనుభవాలు అనదరికి ఉంటాయి. దాని మిద పుస్తకాలు రాయరు, కాని ఈ రోజుల లో మీ లాంటి వారు అదే కన్సెప్ట్ తో రాసిందే రాస్తున్నారు.

అజ్ఞాత చెప్పారు...

మహేష్,
నీ బలహీనమైన వాదనకు నా జోహర్. పదవి నిర్వహనకు నాలెడ్జ్ అవసరం ఇక్కడ మనము దేశం లోని
అతి పెద్ద పదవీ ఎన్నిక గురించి మాట్లాడు తున్నము అంతెకాని రైతులు, చదువు లేని వారి గురించి కాదు.వారి కంట్రిబ్యుషన్ గురించి కాదు.
*అంబేద్కర్ మొదలు చంద్రభాన్ ప్రసాద్ వరకూ కొన్ని వందల మంది (చూస్తే) కనిపిస్తారు*
నాకు ఇద్దరు కని పించారు అందు లో ఒక్కరు మాత్రం మేధావి అని అనవచు.సరె మెజారీటి ప్రజలు నిర్ణయించేశారు కనుక ఆయన మేధావే. కాని ఇక్కడ మీ పేరు చేపటం మరచినట్టు ఉన్నారు.

అజ్ఞాత చెప్పారు...

బాబు రమణ, నిన్ను చూస్తుంటె బావిలో కప్ప గుర్తుకువస్తున్నాది. అది నా బావి కన్న సముద్రం పెద్దదా అని అదిగినట్లుంది. నువ్వు చేసె చిన్న ఉద్యొగానికి తెగ ఫీలై నేను బి.ఆ. చదివిన వాదికన్నా బాగ పని చేస్తాను అని గప్పాలు కొటతం
*ఈ దేశాభివృద్దిలో శూద్రులు,దళితులతో పోల్చుకుంటే మీ చొంత్రిబుతిఒన్ చాలా తక్కువ అని గుర్తు పెట్టుకోండి. *
ఒక చెస్ లో విశ్వనథ ఆనద్, నోబుల్ ప్రైజులు రవిద్రనథ్ టాగుర్, సి.వి.రామన్, చంద్రశేఖర్ సుబ్రమనియం, వి.యస్. నైపాల్, 90% వాళ్ళవే ఒక్క అమర్త్యా సేన్ తప్ప.
మరి క్రికెట్ సౌరవ్ గంగులి, సచిన్, అనిల్ కుంబ్లె, గవస్కర్, వి.వి.యస్. లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, ప్రకాష్ పదుకొనే (దీపిక పదుకొణే వాల్ల నాన్న) రాయలి అంటె నాకు విసుగొస్తున్నాది. అంతెందుకు అంతరిక్షం లో కి మొదటి వెల్లింది కూడా రాకెష్ శర్మ. మరి విరివలన దేశానికి పెరు రాలేదంటె నీకు యెమి తెలియని బాక వి అని అర్థమౌతున్నాది. ఎమైనా మేము రాస్తె బ్ర్నాహ్మణ అహంకారమా ? ఎమీ చేయకుండా నిద్ర లేచిన మొదలు బాంబులు వెసుకొంటు, బలహీనులను కొట్టుకుంటు , ఇతరుల స్తలాలను అక్రమించుకునే వర్గం వాల్లు చాల గొప్ప వాళ్ళా?

అజ్ఞాత చెప్పారు...

అన్నిటి కన్నా తమాషా ఎమంటె నువ్వే ఆ భూస్వామ్య వర్గానికి చెందిన వాడివి, నువ్వు ఎదో దళితుల మీద ప్రేమ ఒలక పోయటం. దానికి మహేష్ వ్యుహాత్మక మద్దతు మీకు.

మయూఖ చెప్పారు...

అది చెప్పడానికి ఇన్ని రోజులు పట్టిందండి.మీరు ఇచ్హిన పేర్లలో చాలా మందివి అప్రకటిత రిజర్వేషన్లు పొందినవే,అని ఎందుకు అనుకోవద్దు.

మయూఖ చెప్పారు...

నాకు బ్రాహ్మణులంటే ఏమీ కోపం లేదు.నాకు బ్రాహ్మణులు చాలా మంది స్నేహితులు ఉన్నారు.నాకు మీలాగా కుల దురహంకారం లేదు.మీరు రంగును గురించి మాట్లాడుతున్నారు.అది వాళ్ళ తల్లిదండ్రులను బట్టి వచ్హి ఉంటుంది.ఆంగ్లో ఇండియన్స్ చాలా తెల్లగా ఉంటారు.మీరు తెల్లగా ఉన్నారని ఫీలవుతున్నట్లు ఉన్నారు.మీరు ఆస్టేలియా వెళ్ళండి.అక్కడ మిమ్ములను కూడా బ్లాక్ ఇండియన్స్ అనే అంటారు. హిట్లర్ కూడా ఇలాగే జాతి అహంకారంతో ప్రవర్తించి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.హిట్లర్ చే నానా హింసలు బడ్డ యూదులు ఈ రోజు ఒక బలమైన దేశాన్ని ఏర్పరుచుకున్నారు.చుట్టూ శత్రు దేశాలు ఉన్నపటికీ గణనీయమైన అభివృద్ది సాధించి తలెత్తి నిలబడ్డారు.ఇప్పటికైనా ప్రతిభను గుర్తించండి.మీ లాంటి వాళ్ళు ఇంటర్వ్యూ బోర్డులలో ఉండకూడదని దేవుని ప్రార్థిస్తూ ..ఉంటాను.

మయూఖ చెప్పారు...

దళితులు మూడు విధాలుగా పోరాటం చేయవలసి ఉంటుంది.ఒకటి ఆకలి కోసం,రెండవది కుల అహంకారులవలన ఎదురయ్యే భాధలు,మూడవది ఎదగదానికి పోరాటం.

అజ్ఞాత చెప్పారు...

బాబూ నువ్వు మార్తాండవని తెలియక నేను వ్యాఖ్యలు రాసాను. ఎదో తప్పు అయింది. ఇక నుంచి నీ బ్లాగ్ చాయలకి రాను.
*.మీరు ఇచ్హిన పేర్లలో చాలా మందివి అప్రకటిత రిజర్వేషన్లు పొందినవే,అని ఎందుకు అనుకోవద్దు.* *ఇప్పటికైనా ప్రతిభను గుర్తించండి*
నాయన నాకు రెక్కాడితె గాని దొక్కాడదు. మా కులం పేరు చెప్పుకొంటె వచ్చె ఉద్యొగం కూడా పొతుంది. అందువలన వెంటనె సమాధనాలు
ఇవ్వ లేక పొయాను అంతె కాని ఎదో భూఅక్రమణల కి, పంచాయితిలు పెట్టటానికి పొయానని అనుకోకు.
నేను రాసిన నంబర్ 1 వాల్లు అప్రకటిత రిజర్వేషన్లు పొందినవారు అని చెప్పి మరొక్క మారు మీ తెలివి మీద అందరికి అవగాహన ఎర్పరిచారు.
ఎవరు ప్రతిభను గుర్తిస్తున్నారో తెలుస్తునేఉంది.

మయూఖ చెప్పారు...

నేను మార్తాండ నేమిటండి.నాకు అర్థం కావడం లేదు.కొంచం అర్థం అయ్యేట్లు చెప్పండి.