26, జులై 2014, శనివారం

ఇంజనీర్ కావాలంటే అక్కడ మాత్రమే చదవాలి......

            ఇప్పటికే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ వలన ,ప్రభుత్వ విద్యావ్యవస్థలు మూతపడే స్థాయికి వచ్చినాయి . తీరా ఈ కార్పొరేట్ విద్యావ్యవస్థ వలన ఏమైనా మెరుగు పడిందా అంటే అదీ లేదు. చాలా మంది పేదలు విద్యకు దూరం అవ్వాల్సిన పరిస్థితి.విద్యలో కూడా నాణ్యత లోపించింది .  
     
                    ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ లో మార్కులు చాలా మందికి 95 శాతానికి పైగా వస్తున్నాయి,ఇంకా కొన్ని సబ్జక్టుల్లో అయితే 100 శాతం వస్తున్నాయి. కానీ  EAMCET  విషయం లోకి వచ్చేసరికి ర్యాంకులు వేలల్లో ,లక్షల్లో వస్తున్నాయి.ఇదేం  చదువో అర్థం కావడం లేదు.  

                    ఇటువంటి పరిస్థితి ఉంటే ఇప్పడు ఏకంగా మంత్రి గారు ఇంజనీరింగు అడ్మిషన్లను ఇంటర్ మార్కుల ఆధారంగా చేయడానికి స్టడీ చేస్తున్నామనడం చాలా హాస్యాస్పదంగా ఉంది . ఇదే కనుక అమలు చేస్తే ఇంజనీరింగు కావాలంటే ఆ రెండు కార్పొరేట్ కాలేజీల లోనే చదవాలని పరోక్షంగా సూచించడమే! 




కామెంట్‌లు లేవు: