2, జులై 2014, బుధవారం

చంద్రబాబు గారు మాట నిలబెట్టుకునేటట్లు గానే కనిపిస్తున్నారు !

చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారం  లో భాగంగా "ఏం  తమ్ముడూ నీకు ఋణ  మాఫీ వద్దా "," ఏం  చెల్లెమ్మా నీకు డ్వాక్రా ఋణ  మాఫీ వద్దా " అని వేలు చూపిస్తూ అడిగినప్పుడు ,ప్రజలనుండి కావాలి..కావాలి .. అని కేకలు . ఆ ప్రచారం ఇప్పటికీ ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా గుర్తుకు వస్తూనే ఉంది . ఆయన మాటలు నమ్మి ప్రజలు ఎంతో ఆశతో ఓట్లు వేసి ఆయనను అధికారం లో కూర్చో బెట్టి ఇప్పటికి దగ్గర ,దగ్గరగా  నెల రోజులు అయ్యింది . కానీ ఋణ  మాఫీ గురించి  ఊసే లేదు ,మిగతా హామీల సంగతి దేవుడెరుగు! దీన్ని బట్టి  చూస్తే  చంద్రబాబు గారు "మాట తప్పడం లో " మాట నిలబెట్టుకునేటట్లు గానే కనిపిస్తున్నారు !   

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అందుకే ఆయన్ని "వెన్నుపొటు"బాబు అంటారు.అది ఆయనకు "వెన్న"తొ పెట్టిన విద్యా.ఆయన్ని అర్థం చేసుకోవడంలొ ప్రజలు విఫలం అయ్యారు.

hari.S.babu చెప్పారు...

చందమామా మసకేసి పోయే ముందుగా కబురేలోయ్!