తెలంగాణా ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లే ఉంది . ఎంత సేపు కాంగ్రెస్స్ పార్టీకి తమ ఓట్లు ,సీట్ల గురించి,జగన్ ఫోబియా నుండి బయట పడే మార్గం గురించే ఆలోచించి దే తప్ప ,ఒక వేల విభజిస్తే మిగతా ప్రాంతాల్లో ఉండే ప్రజల గురించి ఆలోచన చేసినట్లు లేదు. రాయలసీమ ,మరియు కొన్ని కోస్తా జిల్లాల్లో కరువు వుంది . ప్రజలకు పనులు లేక వలసలు పోవు చున్నారు. కలసి ఉన్నప్పుడే హైదరాబాదులో సీమాంధ్రు లు ఉద్యోగాల కోసం వస్తే వారి సర్టిఫికెట్లను చించి వేసిన సంధర్భాలు ఉన్నాయి. అలాంటిది విడిపోయిన తర్వాత సీమాంధ్రుల నిరుద్యోగుల పరిస్థితి ఏంటి . ముందు సీమాంధ్ర లో పరిశ్రమలు ,నీటి వసతి అభివృద్ధి చేసిన తర్వాత విడగొడితే బాగుండేది . లేక పోతే హైదరాబాదును ఎవరికీ చెందకుండా పెట్టాలి .
30, జులై 2013, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
4 కామెంట్‌లు:
రమణారెడ్డి గారూ & ఇతర మిత్రులు: దాదాపు ఏడాది పాటుగా "తెలంగాణా నదీజలాలు, నీటి పారుదల & వ్యవసాయం" అనే అంశాలపై చేసిన పరిశోధన ఆధారంగా నేను కొన్ని బ్లాగు టపాలను ప్రచురిస్తున్నాను. వారానికి రెండు టపాలతో వచ్చే నెలలలో నా పరిశోధన సారాంశం ధారావాహికంగా వెలువడుతుంది.
ఈ విషయాలపై ఆసక్తి కలిగిన వారు నా టపాలను చదివి తమ అమూల్యమయిన వ్యాఖ్యలు తెలుపగలరు.
మీ బ్లాగులో ప్రకటన చెస్తున్నందుకు క్షమించండి. మీకు & మీ చదువరలకు ఆసక్తికరం అని అనుకునే ఈ సాహసం చేసాను. ఇలా నా సొంత బ్లాగును మీమీద రుద్దడం తప్పయితే, ఈ వ్యాఖ్యను తొలగించండి
Dear friend,
do not assume that u will loose jobs. you may get more jobs in new capital. we are loosing jobs from decades, please consider this side people as people.
Kalidasu
ఎందుకు మాష్టారూ ఇంతటి నిరాశ. తెలంగాణా ఏర్పడగానే అక్కడ ఉన్న కోస్తా ఆంధ్రా ప్రజలను వెళ్ళగొట్టేస్తారా? ఎన్ని వేలమంది తెలుగు వాళ్ళు అనెక రాష్ట్రాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. విదేశాల్లో కూడా తెలుగు వాళ్ళు హాయిగా జీవిస్తున్నారు. ప్రతి దానికి హైదరాబాదు అనుకునె మనస్తత్వం వల్లే ఇప్పుడు చాలా మందికి మనస్తాపం కలుగుతున్నది. రేపు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తరువాత కూడా తెలుగు వారికి ఉధ్యోగాల్లో ఏమీ ఢోకా లేదు. ఏ ప్రభుత్వ సంస్థ ఐనా సరే, ఈ ప్రాతం వాళ్ళే ఈ ఉద్యోగానికి అర్హులు అని ప్రకటన ఇస్తున్నారా. అలాగే ఏ పారిశ్రామిక సంస్థ అయినా కూడా వాళ్ళకు కావలిసిన ప్రావీణ్యం ఉన్న వాళ్ళను, వాళ్ళ వ్యాపారానికి తగిన వాళ్ళను తీసుకుంటుంది కాని, ఒక వ్యక్తి ఒక ప్రాంతాని చెందినవాడు అన్న ఒక్క విషయం మీద ఏ ఉద్యోగమూ ఇవ్వరు. కాబట్టి ప్రావీణ్యం, సమర్ధత ఉన్నవాళ్ళకి ఉద్యోగాలకు కొదువేమీ లేదు. భయపడాల్సిన పనిలేదని నా భావన.
ప్రసాదుగారూ, ఇతర రాష్ట్రాలలోని తెలుగువారిని అక్కడి ప్రజలు దొంగలూ దోపిడీదారులూ ద్రోహులూ అంటూ నిందించటం లేదు.
ఇన్నాళ్ళూ అందరూ మనవాళ్ళే అనుకుంటున్న సీమాంద్రులకు ఇది విచారం కలిగించే అనుభవం. వేయేళ్లకూ మరచిపోలేరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి