23, నవంబర్ 2012, శుక్రవారం

బెంగుళూరు లో బాడుగ ఇంటిలో ఉన్న బాధలు అన్నీ ఇన్నీ కావు..

బెంగుళూరు లో ఇండ్లు బాడుగకు తీసుకోవడంలో ఉన్న బాధలు అన్నీ ఇన్నీ కావు.ఎక్కడ లేని విధంగా పది నెలల అడ్వాన్సు ఇవ్వ వలసి ఉంటుంది.ఇండ్లు వెతికి పెట్టిన ఏజెంట్ కు ఒక నెల బాడుగ ఇవ్వాలి.ఇంతా చేస్తే వాళ్ళు అగ్రిమెంటు రాసేది 11 నెలలకు మాత్రమే .ఆ తర్వాత వాళ్లకు ఇష్టం అయితే 10 శాతం పెంపు దలతో అక్కడ ఉండ  వచ్హు .లేకుంటే తిరిగి ఇళ్ళ వెతుకులాట కొనసాగించాలి.వాళ్ళ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఇంటికి రంగులు వేయించడానికి ,ఏవైనా కుళాయిలు  (taps) పొతే (దానికి కాలం తీరి పోయినా సరే) అన్నింటికి మన అడ్వాన్సు డబ్బులు పట్టుకుని చేయించుకుంటారు.ఇంటి యజమానులు వాళ్ళ ఇంటికి 5 సంవత్సరాలకు  ఒకసారి  కూడా రంగులు వేయించ కున్నా బాడుగ ఇళ్ళకు మాత్రం ప్రతి సంవత్సరం రంగులు వేయిస్తారు.ఎందుకంటే  సొమ్ము ఒకడిది సోకు ఒకడిది.సొమ్ము బాడుగ వాళ్ళది,సోకు ఇంటి యజమానులది.దీనివలన బెంగుళూరు లో రంగులు కొట్టే  పని వాళ్లకు ,బాడుగ వాహనాలు పెట్టుకున్న వాళ్లకు  చాలా డిమాండ్ ఉంది,ఇదే పనిగా జీవనం సాగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు.బెంగుళూరు లో ఒక సారి ఇల్లు మారాలంటే  కనీసం 30 వేల రూపాయల ఖర్చు వస్తుంది .అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు  అన్నీ ఒక వైపే ఉంటాయి.అన్నీ ఇంటి యజమానులకు అనుకూలంగా ఉంటాయి.చాలా సందర్భాలలో బాడుగకు ఉన్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు వాళ్ళ అడ్వాన్సు ఇవ్వకుండానో  లేక అందులో చాలా మటుకు దానికో ,దీనికో అని పట్టుకొని  సతాయించిన సందర్భాలు చాలా ఉన్నాయి.


9 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

It is all well established mafia.. people mafia ,actually started by our telugu people only ... sad .

karthik చెప్పారు...

మీరు చెప్పినవి చాలా మటుకు నిజమే అయినా అందరూ ఇళ్ళ ఓనర్స్ అలా ఉండరండీ.. నేను ఇప్పటికి మూడు సార్లు ఇల్లు మారాను. కేవలం ఒక్కసారి మాత్రమే మీరు చెప్పిన ఇబ్బందులు పడ్డాను. మేము కోరమంగలలో ఇల్లు ఖాళీ చేసినప్పుడు మా ఇంటి ఓనర్ అంకుల్ మాకు సామాన్లు సర్దుకోవడంలో కూడా సహాయం చేశారు.

కానీ మీరు చెప్పిన్నట్టు పద్దతులు మాత్రం ఓనర్లకు సహకరించేవిలాగానే ఉన్నాయి. ఐ.టి. బూం వల్ల జరిగిన కొలేటరల్ డామేజ్ అంతే!
-కార్తీక్

అజ్ఞాత చెప్పారు...

True! And the try to decide so many things including who get to visit u ,When u should sleep and when u should wash ur clothes etc...

Life of bangalore is over and done. The water problem becomes more prevalent in future. Its t

అజ్ఞాత చెప్పారు...

M'afraid what i meant is 'owners try to decide'

vruttanti.blogspot.com చెప్పారు...

నెను బెంగలురులొ స్తిరపడ్డాను. నా ఫ్లాట్ అద్దెకి ఇచ్చాను. నేను సున్నం కొట్టించక పోతే మళ్ళీ చేరే ఆయన ఏవండి సున్నం కొట్టించలేదు అని అదుగుతాడు. అలవాటు చేసింది మనమే కాబట్టి అనుభవించాల్సిందికూదా మనమే. పోనీ హైదరాబాదులో ఉద్యొగం చేద్దామా అంటే, అక్కడ స్మసాన వైరాగ్యం సంగతి సరే సరి. అన్ని కంపెనీలు బంగలొరెకు మద్రాస్కు తరలిపొయాయ్.

చంద్ర శేఖర్ నిమ్మగడ్డ
కచడారాజకీయం.బ్లాగ్స్పొట్.ఇన్

మయూఖ చెప్పారు...

1st ajnata yes sir it is true ,it was started by our telugu people only,especially who have come from chittor district and settled as builders,this fact is telling by the local kannada people also,before tenents were asked to get it painted if they stayed in the same house more than two years,but it was changed by our people even if a tenent stayed 2 months also ,tenents are being asked to get it painted.

Padmarpita చెప్పారు...

మీరు చెప్పింది నా ఫ్రెండ్స్ కూడా ఇలాగే బాధపడ్డామని చెప్పారు, ఏ స్మశాన వైరాగ్యమైనా హైదరాబాద్ ఈస్ బెస్ట్:-)

మయూఖ చెప్పారు...

@కార్తీక్ గారు అందరూ అలాగే ఉండకపోవచ్హు ,కానీ చాలా వరకు అలాగే ఉంది.
@పద్మార్పిత గారు నేను హైదరాబాదు లో 6 సంవత్సరాలు ఉన్నాను ,అప్పుడు ఈ బాధలు ఏమీ లేవు ,ఇక్కడికి వచ్హిన తర్వాతనే సమస్యలు అన్నీ,ఇప్పుడు అక్కడ కూడా ఏమైనా పద్దతులు మార్చారా? అదేనండి ఎక్కువ నెలలు అడ్వాన్సు అడగడాలు,రంగులు కొట్టించడాలు అలాంటివి ఏమైనా కొత్త పద్దతులు వచ్హాయా?

అజ్ఞాత చెప్పారు...

కొంత మంది కడూపుకి అన్నం కాక పెంట తినే దరిద్రులు నీతి తక్కువపనులు చేస్తూ ఓనర్లని వేపుకుతింటూంటారు.
వాళ్ళు వెళ్తే చాలని ఇంటిఒనర్లు సామాన్లు సర్దుకోవడంలో కూడా సాయం చేస్తారు.