ఈ మధ్యన ఊర్లలో వ్యవసాయ భూముల వివరాలను కంప్యూటరీకరణ చేస్తున్నారు.అందులో చాలా తప్పులు దొర్లుతున్నాయి.వాటిని సరిదిద్దుకొనడానికి రైతులు నానా పాట్లు పడుతున్నారు.ఇప్పుడే చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఈ తప్పులను సరిచేసుకోవడానికి తమ పనులు విడిచి పెట్టి పలుమార్లు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగ వలసి వస్తున్నది.కంప్యూటర్లో వాళ్ళే తప్పులు నమోదు చేసి ,సరిదిద్దమని రైతులు వెళితే డబ్బులు డిమాండ్ చేసి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.కంప్యూటర్లో నమోదు చేయు వాళ్ళు చాలా చోట్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.వీళ్ళు తప్పులు ఎంత చేస్తే అంత డబ్బులు వస్తున్నాయి.ఇక్కడ తప్పుకు శిక్ష లేదు.రివార్డులు వస్తున్నాయి.అటువంటప్పుడు వాళ్ళు బాధ్యతగా ,సరిగా ఎందుకు చేస్తారు.తమ భూమి రికార్డ్ లో తప్పు ఉందని రైతు అప్లికేషన్ తో వచ్చిన ప్రతిసారి ,ఒక్కో తప్పుకు ఇంత అని పనిచేసే వాళ్ళ జీతములో కోత పెడితే అప్పుడు పనులు సరిగా చేస్తారు .ఈ విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఆలోచన చేయాలి.లేక పొతే కావాలనే కంప్యూటర్లో తప్పులు ఎక్కువ నమోదు చేస్తారు.
12, డిసెంబర్ 2012, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్‌లు:
చదువుకునే విద్యార్థులు అవసరమైన సర్టిఫికెట్ల కోసం వెళ్తేనే, చాలా సార్లు తిప్పుకుంటారు..అలా తిరగడం ఇస్టం లేకపోతే వెంటనే డబ్బులు చూపిస్తే పని చేస్తున్నారు. ఇంక రైతులని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న వాళ్లకి మీరు చెప్పినట్టుగా జీతం డబ్బుల్లో కోత విధించాలి
బర్త్ సర్టిఫికెటో...డెత్ సర్టిఫికెటో కావాలని వెడితే...మనమిచ్చిన పేర్లూ..తారీకులు తప్పులతో నింపి సర్టిఫికెట్ చేతిలో పెడతారు...మళ్లీ వాడు చేసిన తప్పుకు ఆర్నెల్లు మనకు...*** తీరుద్ది... తప్పు వాడు చెస్తే మన సొమ్ము..టైమ్ బొ** దీనిమీద ఎవరైనా కోర్టుకు పోయి వాళ్ళ తప్పుకు వాళ్ళే భాద్యత వహిస్తూ..వారికి ఇంక్రి మెంటో ..ప్రమోషనో కోసే ఏర్పాటు చేయిస్తే బాగుణ్ణు...నా కొడుకులు వాళ్ళ నిర్లక్ష్యం తో...చావ **బ్బుతున్నరు...రాజధాని లో ఉన్న వాళ్ళే చొరవ తీసుకో వాలేమో??
కామెంట్‌ను పోస్ట్ చేయండి