చాలా మంది సినిమా వాళ్ళను మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఖచ్చితంగా అడిగే ప్రశ్న ఒకటి ఉంటుంది.అదేమంటే మీకు ఏ ఆహారం అంటే ఇష్టం అని ,అప్పుడు చాలా మంది చెప్పే జవాబు వాళ్లకు ఇటాలియన్ ,మెక్సికన్ ,కాంటినెంటల్ ఆహారం అంటే ఇష్టం అని చెబుతారు.అదేంటో నాకర్థం కాని విషయం ,వాళ్ళు చిన్నప్పటి నుండి అదే తిని బ్రతుకు తున్నట్లు చెబుతారు.తాము చిన్నప్పటి నుండి తిన్న రోటీ ,కూరలు ,అన్నం గురించి చెప్పనే చెప్పరు .సాధారణంగా మనం చిన్నప్పటి నుండి తినే ఆహారానికే మన నాలుక మీద ఉండే రుచి మొగ్గలు అలవాటు పడి ఉంటాయి.వేరే ఆహారం ఏది తిన్నా అది మనం ప్రతి రోజూ తినలేము,అది మనకు ఇష్టం కాదు.వీళ్ళందరినీ చూసి ప్రతి అడ్డమైన వాళ్ళు కొంచం ఇంగ్లీషు మాట్లాడడం వస్తే చాలు వాళ్ళు కూడా పిజ్జా లు ,బర్గర్లను గురించి మనది కాని ఆహారం గురించి వావ్ అంటూ గొప్పగా చెబుతూ ఉంటారు.ఎంతో ఆరోగ్య కరమైన మన ఆహారం గురించి చెప్పాలంటే వీళ్ళకు నామోషి.వాళ్లకు కూడా తెలుసు తాము తమ ఆత్మ ద్రోహం చేసుకొని చెబుతున్నామని,కానీ ఫాల్స్ ప్రిస్టేజి కి పోతున్నారు. మనం తినే ,మనకు ఇష్టమైన ఆహారం గురించి చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము. ఈ మధ్యన నడమంత్రపు సిరి వచ్చిన వాళ్లకు ఇది మరీ ఎక్కువైంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 కామెంట్‌లు:
చాలా బాగా రాసారు. డబ్బు హోదా రాగానే ఫాల్స్ ప్రిస్టేజ్ ఎక్కువవుతుంది. గొప్పకోసం వాళ్ళు అలా చెప్తారు. అయితే పేదవాళ్ళ ఆహారం గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. సెంటి మెంట్ పేరుతొ వాళ్ళని వాళ్లకు ఇష్టమైన ఆహారం తినకుండా చేస్తాం మనం. అది కూడా అన్యాయమే కదా. ఉదాహరణకి గొడ్డు మాంసం. ఇది మా ఆహారం అని సగురవంగా తిననిస్తున్నామా మనం ? రెక్కలు ముక్కలు చేసుకుని కూలి నాలి చేసుకుని బతికే నిరుపేదలకు చవగ్గా దొరికే పౌష్టిక ఆహారం అదే కదా.. వారిపై ఆంక్షలు విధించే అధికారం మనకెక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా ఆలోచించాలి.
- సంపత్ కుమార్
that is also true,we have to give respect to inidividual food habits.
నిజమేనండి మీరన్నది ఇది సినిమావాళ్ళకే కాదు మనలోనూ ఉన్నారు..
అవును పద్మ గారు మన్లో చాలా మంది ఉన్నారు.
పప్పు చారు, చేపల కూర అని చెప్పిన వాళ్ళు ఉన్నారండి.
Very true. I think lack of public awareness of native foods is one main reason. If you say certain native dish of Godavari is your favorite, the next question is what is it, how to make it etc. you need not be a cook to tell what you like to eat. To avoid that embarrassment people simplify their choice to a more popular ones.
చాతకం గారు నేను చెప్పేది అవగాహన లేని వాళ్ళ గురించి కాదండి. అన్నీ తెలిసి కావాలని తమ గొప్పలు చెప్పుకునేవాల్ల గురించి నేను చెప్పేది.పరాయి దేశాల ఆహారాల గురించి చెప్పి తమకు తాము మహా మేధావులమని ,తమకు చాలా తెలుసు అని చెప్పుకునే వాల్ల గురించి..
కామెంట్‌ను పోస్ట్ చేయండి