అన్నీ ముఖ్యమంత్రిగా వై.ఎస్. ఉన్నప్పుడు ఆయన చెప్పినట్లే సంతకాలు చేసామని ,తమ కేమీ తెలియదని తాము అమాయకులమని ఇప్పుడు మంత్రులు చెబుతున్నారు.అటువంటప్పుడు మంత్రివర్గం ఎందుకు? మంత్రులకు అధికార బంగళాలు ,ఎర్ర బల్బు కార్లు,పి .ఎ లు,పి.ఎస్ లు ఇతర సిబ్బంది ని ప్రజా ధనాన్ని ఉపయోగించి ఇవ్వడం ఎందుకు?ప్రజాధనాన్ని వృధా చేయడం ఎందుకు ? ముఖ్యమంత్రి పదవి ఒకటి ఉంటే సరిపోతుంది కదా!! ఈ వాల అలా అంటున్న మంత్రుల మీద ఆ సమయంలో ఖర్చు పెట్టిన ప్రజా ధనాన్ని రికవరీ చేస్తే తప్పవుతుందా?
23, ఆగస్టు 2012, గురువారం
సాఫ్ట్ వేర్ మరియు బి.పి.ఓ కంపెనీలు పెద్ద సిటీ ల్లో ఉండడం అవసరమా?
సాఫ్ట్ వేర్ కంపెనీలు ,బి.పి.ఓ కంపేనీలు పెద్ద పెద్ద సిటీ ల్లో ఉండడం అవసరమా? సాధారణంగా వస్తూత్పత్తి చేసే సంస్థలకు ముడిసరకు రావడానికి ,తయారైన వస్తువులు రవాణా చేయడానికి రవాణా సదుపాయాల కోసం పెద్ద పట్టణాలలో పెట్టినారు.కానీ సాఫ్ట్ వేర్ మరియు బి.పి.ఓ కంపెనీలకు మనుష్యులు ,కంప్యూటర్ లు మరియు ఇంటర్నెట్ సదుపాయాలూ ఉంటే చాలు కదా?ఇవన్నీ ఇచ్చి అనంతపురం లాంటి జిల్లాల్లోని పల్లెల్లో ని బీడు భూముల్లో సంస్థలు నెలకొల్పి అక్కడే ఉద్యోగస్తులకు వసతి కల్పించ వచ్చు కదా?దీని వలన సిటీ ల మీద ఒత్తిడి తగ్గి ,ట్రాఫిక్ సమస్య ,మౌలిక వసతుల సమస్యలు అన్నీ తొలిగి పోతాయి కదా?ఆ చుట్టూ పక్కల పల్లెలు కూడా చిన్న చిన్న వ్యాపారాల వలన వృద్ది చెందుతాయి కదా?ఈ విధంగా అన్ని జిల్లాల్లోని బీడు భూములను గుర్తించి సంస్థలను నెలకొల్పితే బావుంటుంది కదా?ఈ విధంగా చేస్తే పెద్ద సిటీ ల్లో స్థిరాస్తుల ధరలు కూడా తగ్గుముఖం పడతాయి.
13, ఆగస్టు 2012, సోమవారం
ప్రమోషన్లలో రిజర్వేషన్లు అవసరమా??
అంతవరకూ నీ కంటే జూనియర్ అయిన,నీ కంటే తక్కువ స్థాయి లో ఉన్న ఉద్యోగి,అంత వరకూ నిన్ను సార్.. సార్.. అని సంభోధించిన ఉద్యోగి ఏ విధమైన డిపార్టుమెంటల్ టెస్ట్ లు రాయకుండా ,ఏ విధమైన ఉన్నత చదువు చదవకున్నా తెల్ల వారేసరికి నీకు అధికారి అయి పోతాడు.అప్పటి వరకూ నిన్ను సార్ అన్న వ్యక్తిని అప్పటి నుండి నీవు సార్ అని అతని ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి,ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇస్తే ఉంటుంది.ఈ పరిస్థితి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అమలులో ఉంది.తన కన్నా చాలా జూనియర్ అయిన వ్యక్తులు తన ముందే 4 ,5 ప్రమోషన్లు తీసుకొని ముందుకు పోతా ఉంటే తానూ మాత్రం అదే ఉద్యోగం లో రిటైర్ కావలసిన పరిస్థితి.ఈ పరిస్థితి వలన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల మధ్యన సామరస్య మైన వాతావరణం పోయి,పని చేసే సంస్కృతి తగ్గి పోయి క్రమశిక్షణ లోపించింది.O.C. ఉద్యోగులు ఎలాంటి ప్రోత్సాహకాలు లేక చాలా ఆత్మా న్యూనతా భావంతో పనులు చేస్తున్నారు.ఆర్థికంగా ,సామాజికంగా బలం చేకూర్చడం కోసం S.C.,S.T. ల కు మరియు మిగతా కులాల వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చినారు బాగానే ఉంది.కానీ ప్రభుత్వ సాయం ఏమీ లేకుండానే ఆర్థికంగా వెనక బడిన అగ్రవర్ణాలు అనబడే వారి పిల్లలు కష్టపడి ప్రభుత్వోద్యోగం తెచ్చుకుంటే ,ఉద్యగం లో చేరిన తర్వాత ఈ తార తమ్యాలు ఎందుకో అర్థం కావడం లేదు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఎందుకో అర్థం కావడం లేదు.పాలకులు తమ ఓట్ల వేట కోసం క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసు కోకుండా ఇలా చేసుకుంటూ పోతా ఉంటే ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగి పోతాయి. ఇలాగే కొన సాగితే కొన్ని రోజుల తర్వాత అగ్రవర్ణాల వారిని ఆర్థికంగా , సామాజికంగా పైకి తీసుకు రావడానికి వారికి రిజర్వేషన్లు అమలు చేయ వలసిన పరిస్థితి వస్తుంది.
3, ఆగస్టు 2012, శుక్రవారం
2, ఆగస్టు 2012, గురువారం
లక్షలు ,వేలు ర్యాంకులు వచ్చిన వాళ్లకు ఫీజు రీ ఇంబర్సుమెంట్ అవసరమా ?
వేలు ,లక్షలు ర్యాంకులు వచ్చిన వారికి ,చివరికి ఎంసెట్ లో పాస్ మార్కులు రాని వారందరికీ ఫీజు రీ ఇంబర్సుమెంట్ అవసరమా?ఎంసెట్ ర్యాంకులలో 5000 లోపు వచ్చిన వాళ్లకు లేక ఏదో ఒక కటాఫ్ పెట్టాలి. దానివలన నిజంగా ప్రతిభ ఉండి,ఆర్ధిక పరిస్థితి సహకరించని వారికి ఇది ఉపయోగ పడి,ప్రతిభను కూడా ప్రోత్సహించిన వారవుతారు.లేకుంటే ప్రజల సొమ్మును ఇలా చదువురాని వాళ్లకు ఖర్చు పెట్టి వాళ్ళను సోమరి వాళ్ళగా తయారు చేసి ,సమాజానికి పనికి రాకుండా చేసి,వ్యవసాయదారులకు కూలి వాళ్ళు దొరక్కుండా చేసి మన సమాజం సర్వనాశనం అవుతున్నది.ప్రభుత్వాలు ఈ విషయం లో పునరాలోచించాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)