ఈ రోజు సాయంత్రం సాక్షి టి.వి. లో తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత గారి (కే.సి.ఆర్ గారి కుమార్తె) మాటలు విన్న తర్వాత ఈ పోస్ట్ వ్రాయకుండా ఉండలేక పోయాను."అదుర్స్" సినిమాను ఆంధ్ర వాళ్ళు నిర్మించి నటించారు కాబట్టి ఆ సినిమాను తెలంగాణాలో అడ్డుకుంటామంటున్నారు.ఈ సినిమా నిర్మాత లగడపాటి నిరాహారదీక్ష శిబిరంలో కూర్చున్నారని ఒక సాకు చెబుతున్నారు.తెలంగాణా వాళ్ళు వాళ్ళ వాదాన్ని ఎంత బలంగా వినిపిస్తున్నారోఆంధ్రా వాళ్ళు కూడా వాళ్ళ వాదాన్నిఅంతే బలంగా వినిపించే హక్కు ఉంది.దీన్ని అడ్డుకోవడానికి వీళ్ళు ఎవరు.ఆంధ్రా వాళ్ళు వీళ్ళాలాగ వేర్పాటు వాదం వినిపించడం లేదు.అందరం సమైఖ్యంగా ఉందాం అంటున్నారు.ఈ ప్రజాస్వామ్య దేశం లో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళ భావాలను ఇతరులకు ఇబ్బంది లేకుండా ప్రకటించవచ్చు.తెలంగాణా సమస్య కే.సి.ఆర్.కుటుంబ సమస్య ఏ మాత్రం కాదు.అందరూ తెలంగాణా వాళ్లకు నచ్చినట్లు మాత్రమే మాట్లాడాలి,అనుకూలంగా మాట్లాడక పోతే అడ్డుకుంటా మంటే కుదరదు.ఈ విషయం చూస్తే తెలుస్తున్నది ,తెలంగాణా ఉద్యమం లో ఎంత మేర ప్రజాస్వామ్యం ఉందో.వీళ్ళంతా ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు.ఇటువంటి ఉద్యమ కారుల వలన వచ్చిన తెలంగాణా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ మాత్రం మన జాలదు,నిరంకుశత్వం లోకి జారుకుంటుంది.సామాన్య ప్రజలు వీళ్ళఉక్కు కౌగిళ్ళలో నలిగి పోవలసి వస్తుంది.ఇటువంటి అప్రజాస్వామిక,నియంతృత్వ,బ్లాక్మెయిల్ రాజకీయాలను , ఉద్యమాలను,ఉద్యమ కారులను నిజమైన ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలి .
11, జనవరి 2010, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
8 కామెంట్‌లు:
vallaki kavalsindhi ade
so d/o telagana emmana indira gandhi laga fell ai pothunda tharavatha emi aindo mekku telusuga
అయినా ప్రజాస్వామ్యం వుందని మీకు ఇంకా నమ్మకం ఉందా ? మనదేప్పుడో ప్రజాస్వామ్యం నుండి పైసాస్వామ్యం ఐంది గా ...ఒకటో రొండో కోట్లు పోస్తే అంత గప్చుప్ .... :-)
అలా ఐతే ఉద్యమంలో ప్రజలు లేరా ? కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే ఉందా ? సమైక్యం అనేది.. వినటానికి బానే ఉంది.. అసలు దాన్ని మోసం చేయటం అనాలి..
ముందు సమైక్యం అంటారు..
తర్వాత ఒకే రాష్ట్రం కాబట్టి సమాన అవకాశాలు అంటారు..
ప్రాజెక్ట్ లు తెలంగాణ ల.. నీళ్ళు ఆంధ్ర కి..
అన్నింటికి కేంద్రం ఐన సచివాలయం ని గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నరు
సినిమా వాళ్ళు తీసేది తెలుగువాళ్ళందరి కోసమా.. లేక కొందరి ప్రయోజనాలను కాపాడటానికి అభిమానం అనే మత్తు లో ముంచటానికా ?
ఆ మోహన్ బాబు గారిడికి తెలంగాణ లో ఉంటూ దాని కష్టాల పై లేని ప్రేమ... ఒక్కసారిగా ఆంధ్రా పై ఎందుకో.. ఇన్నాల్లు మాలో ఉంటూ మా గురించి మాట్లాడని వాడికి ఇప్పుడు వేరే వాళ్ళ రాబోయే కష్టాల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది..
హరికృష్ణ మాటలను బుడ్డోడు ఖండిస్తూ.. నాకు ప్రాంతాల పై అభిమానం లేదు.. తెలుగు వారిపై ఉంది అని ఒక మాటంటే ఎలా ఉంటది.. గుండెల్లో పెట్టుకుంటం.. ఇప్పటికే బుడ్డోడి పోరాట దీక్ష కి అభిమానులం..
ఆసలు సినీ పరిశ్రమ ఇంకెన్నాల్లు హంస తోలు కప్పుకుని ఉంటది.. అది నిజంగా హంస లా ఉండాలనేది మా కోరిక ..దేన్ని దానిలా చూడాలని..
అన్న రాజ
తేలంగానో...తందానానో తరువాత
కోన్ని కోట్లు ఖర్చు చేసి సినిమా తీసినా వారిని అడ్డుకుంటాం అపుతాం అంటున్నారు ఆ నిర్మాత చేసిన తప్పు ఏంటొ..
Chotu ne bataaya ki.. mai telangana ki hoon.. ab hamaraa dil kuch.. hum sab dhekhenge ye cinema... NTR adurs...
@Pavan: baath producer ki hi nahi.. balke sabi stakeholders ki hote hain. pehla kadam hero lena padta.. ab chotu ne dikhaaya..
jo mera man me 30mins pehle thaa.. mai abhi chotu ke news statement dekha .. kithna matured hai ye chotu.. jeete raho NTR..
kuch nahi kush tha vo..typo
బాబు రాజ గారు తెలంగాణా ఉద్యమం లోనే ద్వేషం ఉంది.ఆంధ్రా వాళ్ళు అంతా వెళ్ళండి అంటున్నారు.సమైఖ్యం లో ప్రేమ ఉంది.థియేటర్లలో సినిమాలు అడ్డుకుంటారు సరే,మరి ఇండ్లలో టి.వి. లలో వచ్హే సినిమాల సంగతేంటి నాయనా ?తెలంగాణా ప్రజలందరి కళ్ళకు గంతలు కట్టి ,చెవులలో దూది పెడతారా,టి.వి.లలో వచ్హే సినిమాలు చూడకుండా,వినకుండా ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి