8, జనవరి 2010, శుక్రవారం

అంబానీల,రామోజీల ఆస్తులు ధ్వంసం అయినప్పుడు మాత్రమే చంద్రబాబు గారు స్పందిస్తారా?

గత నెల రోజులుగా అటు సమైఖ్యాంధ్ర ఉద్యమం ,ఇటు తెలంగాణా ఉద్యమం లో ప్రభుత్వ,ప్రజల ఆస్తులు ఎన్నో ధ్వంసం అవుతున్నా , ఉద్యమాలతో సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నా మీడియాకు,ప్రజలకు ముఖం చాటేసిన చంద్రబాబు గారు ,నిన్న రిలయన్స్ వారి ఆస్తులు ధ్వంసం అయినాయని తెలిసి రోజు మీడియా ముందుకు వచ్చిఖండనలు ఇస్తున్నారు.దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు గారికి రిలయన్స్ వారి ఆస్తులు,రామోజీ గారి ఆస్తులు,తన మరియు తన వాళ్ళ ఆస్తులు మాత్రం బాగుంటే సరి ,ప్రజల,ప్రభుత్వాల ఆస్తులు ఏమై పోయినా పరవాలేదని అనిపిస్తుంది.నెల రోజులుగా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నా ఒక్క రోజు కూడా ఆయన ఖండనలు ఇవ్వలేదు.దీన్నిబట్టి చూస్తే అర్థం అవుతుంది ,చంద్రబాబు గారు పెట్టుబడి దారులకు మాత్రమే కొమ్ముకాసే వ్యక్తి అని ,సామాన్య ప్రజల గోడు మాత్రం పట్టించుకోడని .ఇటువంటి భాధ్యతా రాహిత్యమైన ,అవకాశవాద ,స్వార్థపరమైన రాజకీయనాయకులు ఉండబట్టే వాళ మన రాష్ట్రం పరిస్థితులలోకి నెట్టి వేయబడినది.

4 కామెంట్‌లు:

మంచు చెప్పారు...

బాబు ..పచ్చి అవకాశవాది

అజ్ఞాత చెప్పారు...

కరవమంటే కప్పకు కోపం వదలమంటే పాముకు కోపం...అలానే. ఆంధ్రా వాళ్ళ ఆస్తులు ధ్వంసం అయ్యినప్పుడు తెలంగాణా వాళ్ళను విమర్శించలేడు. తెలంగాణా వాళ్ళ ఆస్థులు ధ్వంసమైనప్పుడు (ధ్వంసం అయ్యాయా లేదా అన్నది వేరే సంగతి) ఆంధ్రా వాళ్ళని విమర్శించలేడు. ఎవరిని విమర్శిస్తే వాళ్ళ వోట్లు పోతాయేమోనన్న భయం...మీరు కూడా రాజకీయనాయకుడైతే తెలిసేది...రిలయన్స్ మీద దాడి చేసిన వాళ్ళు ఖచ్చితం గా వైఎస్ సానుభూతి పరులైన కాంగ్రెస్ వాళ్ళే చేసిఉంటారు. వాళ్ళని విమర్సిస్తే కొత్తగా పోయే వోట్లు ఏమీ ఉండవు...మన నిజ జీవితం లో మన పరిధి లో మనం కూడా ఇలాంటి పనులు (స్వలాభాన్ని బట్టి నోరు మూయతం లేదా తెరవటం) చేస్తూనే ఉంటాం.

అజ్ఞాత చెప్పారు...

బాబు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా చేసినవాడిగా, అటు తెలంగాణా, ఇటు కోస్తానో, తన రాయలసీమో అని లేకుండా బయటకు వచ్చి మొన్న జరిగిన RTC బస్సుల దహనాలు, ప్రైవేటు ఆస్తుల విద్వంసం గురిచి మాట్లాడితే బాగుండేది, కాకపోతే ఆయన తన పాత్రను, పరిధిని తనే కుదించుకొని ఇంట్లొ కూర్చున్నడు అనేది నిజం

ఇక రెలయన్స్ గొడవలకు ఒక బాబేమిటి, బంగారమ్మ కోరు కమిటీ ని పిలుస్తున్నారంట , కేసులెట్టమని మన హోం మంత్రికి సిఫార్సులంట, మరి దీనికేమంటారు? నిజానికి ఇప్పుడు రెలయన్స్ ఆస్తులకంటే ఎక్కువ విద్వంసం జరిగినప్పుడు ఏమయ్యింది ఈ బంగారమ్మ? అంతా డబ్బు మహిమ, వీళ్ల హడావుడు చూస్తూ ఉంటే, రిలయన్స్ వాటాదారులకంటే ఎక్కువ చేస్తున్నారు అనిపిస్తుంది.

ఇక చానల్స్ మీద కేసులంట, మరి తగలడుతున్న బస్సులను, తగలబెట్టుకొంటున్న అమాయకులను గంటలు, గంటలు చూపి, నెలరోజులు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసినప్పుడు ఎమయ్యింది ఈ బుద్ది, అప్పుడెమీ లేవే చానల్స్ మీద కేసులు? కాబట్టి చానల్స్, మీరు డబ్బు ఉన్న మారాజుల జోలికి వెళ్లకండి, మిగతా వాటి మీద మీ ఇష్టమొచ్చినట్లు పిచ్చి పిచ్చి గా, రెచ్చగొట్టే పోగ్రాం లు చేసుకోండి అనా మన వాళ్లు చెబ్తున్నది?

kvsv చెప్పారు...

వేల కోట్ల రూపాయల గాస్ ను బాబు గారు రిలయన్స్ కి కట్టబెట్టారు అల్లాగే రిలయన్స్ కూడా ఈనాడు లో నిదులు ప్రవహించింది అంతా బాబు గారి హయాం లోనే ..అందు కె ఈ వురుకులు పరుగులూ ...బాబు గారివీ రామోజీ గారివీ ..ఈగ వాలనీయరు అంబానీ ల మీద.. 8-01-10 ఈనాడు చూడండి వొంటి కాలి మీద యలా విరుచుకుపదిందో ..వీళ్లు రాస్తే పరిసోదనాత్మకం..ఇతరులైతే అశ్లీలం..కట్టు కదలు ...రామోజీ మార్క్ జర్నలిసం నాయనా ..