6, మార్చి 2009, శుక్రవారం

చంద్రబాబు గారి ఉత్తుత్తి హామీలు

తినడానికి చేపలు ఇవ్వకుండా చేపలు పట్టే విధానం నేర్పించాలని ఒక నానుడి ఉంది.తెలుగుదేశం పార్టి వాళ్ళు ప్రజలను సోమరిపోతులలాగా మార్చాలని చూస్తున్నట్టున్నారు.ఐనా కానీ చంద్రబాబు గారి మాటలు ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరు.ఆయన పరిపాలించినపుడు ఏం చేసారో ప్రజల మనో ఫలకం నుండి ఇంకా తొలగిపోలేదు.
ఇటువంటి సాధ్యం కాని హామీలను ఇచ్హి ఎలాగోలా అధికారానికి రావాలని ఆయన కలలు కంటున్నారు.
ప్రజలు చాలా తెలివైనవాళ్ళు.ప్రజలు మీరు ఇస్తే తీసుకునే భిక్షగాళ్ళు కారు.వాళ్ళు మీకు అధికారం ఇచ్హేది శాశ్వతమైన పథకాలు ఉదా:- విద్య,వైద్యం,స్థిరమైన ఆర్థిక పరిస్థితి కోరుకుంటారు.
కాబట్టి ప్రజలు నవ్విపోకుండా పద్దతి గల హామీలు ఇస్తే బావుంటుంది.

3 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

ప్రపంచ బ్యాంక్ జీతగాడు జనం మీద పన్నుల భారం వేసి నడ్డి విరగ్గొట్టగలడు కానీ ఫ్రీగా ఏమి ఇవ్వగలడు?

--మార్తాండ

Anil Dasari చెప్పారు...

>> "ప్రజలు చాలా తెలివైనవాళ్ళు.ప్రజలు మీరు ఇస్తే తీసుకునే భిక్షగాళ్ళు కారు.వాళ్ళు మీకు అధికారం ఇచ్హేది శాశ్వతమైన పథకాలు ఉదా:- విద్య,వైద్యం,స్థిరమైన ఆర్థిక పరిస్థితి కోరుకుంటారు"

అధిక శాతం వోటర్ల తెలివి మీరనుకునే స్థాయిలో లేదు మరి. 2004లో రెడ్డి ఇచ్చిన ఇలాంటి పనికిమాలిన హామీలే బాబు కొంప ముంచాయి. గత ఐదేళ్లలో రెడ్డిగారు రాష్ట్ర వోటర్లని ముష్టివాళ్లకన్నా హీనంగా తయారు చేసి పడేశారు. ఇప్పుడు బాబూ ఆయన్లా 'ఉచిత' పాటే పాడక తప్పదు. ఏ రోజుకారోజు గడవటమెలా అనే పరిస్థితిలోకి ప్రజలని తోసేశాక దీర్ఘకాలిక లక్ష్యాల గురించే మాట్లాడే వాళ్లకంటే ఇప్పటికిప్పడు ఏం చేస్తారో చెప్పేవాళ్లకే ఓట్లేస్తారు. ఇదో నిష్టుర సత్యం. మంచి చేస్తామంటూ ప్రణాళికలతో సహా వచ్చిన లోక్ సత్తాని ఎవరు పట్టించుకుంటున్నారు? 'ప్రజల తెలివి' విషయంలో మీరు పునరాలోచించుకోవాలి.

Praveen Mandangi చెప్పారు...

ఓట్లు వేసేవాడు ఏమీ నిర్ణయించలేడు. ఓట్లు లెక్కబెట్టేవాడే ఏదైనా నిర్ణయించగలడు.