18, మే 2014, ఆదివారం

మరొక సారి విశ్వసనీయతకు పరీక్ష !

ముందుగా అంధ్రప్రదేశ్ ,తెలంగాణా లో కొత్త ప్రభుత్వాలు చేబడుతున్న పార్టీ ల పెద్దలకు, ప్రజా ప్రతినిధులకు అభినందనలు . కాంగ్రెస్స్ అధిష్టానానికి నిజాలు చెప్పకుండా ఇక్కడ వై .ఎస్. హవా ఏమీ ఉండదు అని చెప్పి తెలంగాణా ఇస్తే పార్టీని అధికారం లోకి తీసుక వస్తామని బీరాలు పలికిన నేతలు నేడెక్కడ?తెలంగాణా ఇచ్చిన తర్వాత కూడా పార్టీని అధికారం లోకి తేవడం పక్కన పెట్టి చివరికి తమ స్థానాల్లో కూడా  గెలవలేక పోయారు. అదే వై.ఎస్.  ఉన్నప్పుడు 2009 లో తెలంగాణా సెంటిమెంట్ ఉన్నప్పుడు , తెలంగాణాకు మొదటి ప్రతినిధిగా భావించే టి.ఆర్.ఎస్ ,టి.డిపి. ఇంకా ఇతర పార్టీలు కూటమిని ఏర్పాటు చేసినా  కూడా వై.ఎస్. ఒంటి చేత్తో అధికారం లోకి తీసుకొని వచ్చాడు . అదీ నాయ కత్వం అంటే ! 
        
            ఇంక అంధ్రప్రదేశ్  లో జగన్ తాను  ఖచ్చితంగా అధికారం లోకి వస్తాను అనుకున్నాడు,అందుకే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అవి తీర్చలేక ,విశ్వసనీయతను పోగొట్టుకోవడం ఇష్టం లేక అమలు చేయ గలిగే హామీలనే ఇచ్చాడు .కానీ టి.డి.పి  కి ఇప్పటికే పది సంవత్సరాలుగా  అధికారం లేదు ,చావో రేవో తేల్హుకోవలసిన పరిస్థితి,ఒక వేల ఇప్పుడు ఓడిపోతే పార్టీ ఉనికే ప్రమాదం లో పడే పరిస్థితి,కావున ఒకప్పుడు గొప్ప సంస్కరణ వాదిగా ,ఎ. పి  లో సంస్కరణలకు ఆద్యుడుగా తనకు తానూ చెప్పు కునే చంద్రబాబు గారు హామీలను తీర్చగల నో లేదో అని ఆలోచించ కుండా ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చేశారు. ముఖ్యంగా రైతు  ఋణ  మాఫీ ని ప్రజలు  బాగా నమ్మినట్లున్నారు.  ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తారో లేక మరొక సారి తన విశ్వసనీయతను కోల్పోతారో చూడాలి.  
     
         జగన్ గారు తన అపజయానికి కారణాలేవో నిష్పాక్షికంగా విశ్లేసించు కొని ఒక బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరుపున పనిచేస్తూ ,టి.డి .పి  ఇచ్చిన అన్ని హామీలను నూటికి నూరు పాళ్ళు  అమలు చేసేలా అధికార పక్షాన్ని ప్రజల తరపున ప్రశ్నిస్తూ ప్రయాణం చేయాలని ఆశిస్తూ ......  

కామెంట్‌లు లేవు: