ఆంధ్రప్రదేశ్ పజలను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం మరియు ఈర్ష్య కలుగు తున్నది. ఎందుకంటే జూన్ 2 తర్వాత వారు అనుభవించే సుఖాలను గురించి తలచు కొని.
ఎలా లేదన్నా ఇంటికి ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్లకు పెన్సన్ 2000 రూపాయలు,ఇద్దరు నిరుద్యోగులు వాళ్లకు భృతి 4000 .ఇలా ఏం పని చేయకున్నా ప్రతి కుటుంబానికి నెలకు కనీసం ఆరు వేల రూపాయలు వస్తాయి. ఇక మహిళలు వంట చేయ వలసిన పని లేదు,ఎందుకంటే అన్నా క్యాంటీన్ నుండి తక్కువ రేటు తో పార్సల్ తెచ్చు కోవచ్చు. హాయిగా ఇంట్లో కూర్చొని ఉచిత విద్యుత్ ఉపయోగించుకొని టి.వి. చూస్తూ ఉండడమే . అలాగే యువకులు /యువతులు బోర్ కొడితే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ట్యాబ్ తీసికొని పబ్లిక్ ప్లేసెస్ ల ఉచితంగా లభించే ఎ.సి లో కూర్చొని ,వై.ఫై. ఉపయోగించుకొని స్నేహితులతో చాటింగ్ చేయ వచ్చు . ఇప్పటికే ఒక వేళ ఋణాలు చేసి ఉంటే అవి తీర్చాలనే బాధ లేదు,ఎలాగూ ప్రభుత్వం మాఫీ చేస్తుంది .1,50,000 ల తో ఇల్లు కూడా ఉచితంగా ప్రభుత్వం కట్టి ఇస్తుంది . ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ఇలాంటివి చాలా ఉన్నాయి ఎ. పి . ప్రజలు అనుభవించే సుఖాలు.
కానీ నాకు చాలా ఈర్హ్య గా ఉంది ఎ. పి .ప్రజలను చూస్తే ,ఎందుకంటే ఈ స్వర్గ సుఖాలను నేను అనుభవించే అవకాశం లేదు కాబట్టి.
6 కామెంట్‌లు:
jarigedi kaadu
There will be some constraints for getting these funds. Either one of the family would get benifits, not all...
మీ టపా కాప్షన్ చూసి ఇంతకాలానికైనా తెలంగాణాని వదుల్చుకున్నందుకు ఏపీ ప్రజల్ని చూసి ఈర్షేమో అనుకున్నాను. టపా చదివితే వెటకారం అని అర్ధమైంది.
what viswam ji you are bringing new logic,if in a family two persons are there ,one only will get pension what about other , does not he want food ,...
మీకు ఇప్పుడే తెల్లారినట్టు ఉంది. లేక ఊరికే ఈర్ష్య పడే కొత్త రోగం అయిన వచ్చి ఉండాలి. డాక్టరుకి చుపించుకోండి.
డాక్టరు గారు పరిశీలన చేసి అ.ప ప్రజలని సుఖాలకి అలవాటు చేసింది ఎవరో కూడా సెలవిస్తారు. ప్రజలకి ఆ సుఖ రోగం ఎవరు అంటించారో కూడా చెప్తారు.
ఇంట్లో కనీసం ఆరుగురు. ఇద్దరు మధ్య వయస్కులు. ఇద్దరు ముసలి వాళ్ళు. కనీసం ఇద్దరు చదువుకునే పిల్లలు. మొదటగా కనీసం 100000 రూపాయలు రుణ మాఫీ చేయించుకుని తరవాత ( పింక్ కార్డులు పక్కనపెట్టి) రెండు తెల్ల కార్డులు తీసుకోవడమ్. రెండు ఇందిరమ్మ ఇళ్ళూ కింద మొత్తం కలిపి 100000 రూపాయలు. తెల్ల కార్డులతో 2 రూ లకి బియ్యం కొనుక్కుని, చీపుగా కిరోసిన్ కొనుక్కుని బయట అమ్ముకుని డబ్బు చేసుకొవడమ్. ముసలి వాళ్ళు పెన్సన్ డబ్బులు తెచ్చుకుంటారు. రోజు ఆరుగురు వెళ్లి గ్రామీణ ఉపాధి కింద పని చేసిన చెయ్యకపోయినా 100 రోజులు సంతకం పెట్టి 600 రూ తెచ్చుకుంటారు. మొత్తం 60000 రూపాయలు . అక్కడ సంతకం పెట్టేసి పిల్లలు కాలేజీ కి వెళ్లి హాజరు వేయించుకుని కనీసం ఇద్దరు కలిపి 60000 రూపాయలు స్కాలర్షిప్ కింద తెచ్చేసుకోవడమ్. కష్టపడకుండా వచ్చిన డబ్బుతో ఇంట్లో ఒకళ్ళో ఇద్దరో బెల్ట్ షాపుల్లో తప్పతాగి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఆరోగ్య శ్రీ కింద కనీసం ఒక 100000 రూపాయలు. కనీసం 5 లక్షల సుఖం అన్నమాట! ఇంకా ఎన్నో ఎన్నెన్నో!
ఇదంతా ఓపెన్ కేటగిరి గ్రామీణ కుటుంబం( పేద, మధ్య తరగతి తేడా లేకుండా) గురించి అన్నమాట! ఇంక రిజర్వేషన్ కేటగిరి వాళ్ళకైతే ఇంకా ఎన్నెన్నో!
ఎంత తమాషాగా సుఖ రోగం అంటుకుంది అంటే, 2010 నాటికి 17 లక్షల బోగస్ తెల్ల కార్డులు తేలాయి.
http://www.hindu.com/2010/06/24/stories/2010062463160600.htm
నేనేమన్నాను సార్,మా అన్నదమ్ములు,అక్క చెల్లల్ల,అవ్వా తాతల సంతోషమే కదా సార్ మనకు కావలసింది.అంతకంటే మనకు ఏం కావాలి,అందరూ కొత్త రాష్ట్రం లో సుఖ సంతోషాలతో ఉండడమే కదా సార్ మనకు కావలసింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి