19, ఏప్రిల్ 2014, శనివారం

నోటా బటన్ నొక్కిన తర్వాత?

చాలా  రాజకీయ పార్టీ లు నిలబెట్టే అభ్యర్తు ల  చరిత్ర  చూసినా ఏమున్నది గర్వకారణం,పాత రౌడినో లేక ఖూనికోరో లేక అక్రమ వ్యాపారాలవలన కోట్లు సంపాదించినవాడో కనిపిస్తున్నాడు.వీళ్ళకు వోట్లు వేయాలంటే వెగటు పుడుతుంది. కాబట్టి వోటింగ్ యంత్రం లో నోటా  బటన్ పెట్టినట్లున్నారు . నిల్చిన అభ్యర్థులెవరూ ఇష్ఠంలేని వాళ్లు ఆ బటన్ నొక్కుతారు. మొత్తం వోట్లు లెక్కించిన తర్వాత కొంత శాతం వోట్లు నోటా  బటనుకు వస్తే ఆ ఎన్నికను రద్దు చేసి తిరిగి నిర్వహించాలి.ఆ ఇష్ఠం లేని అభ్యర్థులను కొన్ని సంవత్సరాలు ఎన్నికలలో పాల్గొనకుండా డిబార్ చేసి,ఆ ఎన్నికల ఖర్చును ఆ గుర్తింపు పొందిన పార్టీలనుండి వసూలు చేయాలి.ఇలా చేస్తే తర్వాత నుండి  ఆ పార్టీ లు వీలైనంత మంచి అభ్యర్ధు లను నిలబెడతారు. దీని మీద ఎన్నికల కమీషన్ దృష్టి  పెట్టాలి. 

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

నా అభిప్రాయమూ అదే.కానీ యెలక్షన్ కమిషన్ ప్రస్తుతం దాన్ని యెందుకూ పనికిరాని విధంగా రూపొందించిది, యెందుకనో?ప్రస్తుతం ఉన్న పధ్ధతిలో దాని వల్ల ఉపయోగమే లేదు.