12, జులై 2012, గురువారం

నిజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయా??

వేరే మీడియా మరియు పేపర్ లేనప్పుడు ఒక వర్గం మీడియా మరియు పత్రికలు తయారు చేసిన నాయకుని నాయకత్వ లక్షణాల పై ఇపుడిపుడే ప్రజలకు భ్రమలు తొలగి పోతున్నాయి.ఒక వ్యక్తి తన వ్యక్తిగత సంభంధాలలో భాగంగా ఇంకో పార్టీ లో వ్యక్తిని కలిస్తే అతని దిష్టి బొమ్మలు తగలబెట్టడం ,అతని మీదికి తిరగ బడాలనడం ,సంజాయిషీ కోరకుండా పార్టీ నుండి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంలో భాగం?తన పార్టీ మీద ,తన నాయకత్వ లక్షణాల మీద తనకున్న నమ్మకం పాటిదో అర్థం అవుతూ ఉన్నది.
ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు వై.ఎస్. తో ఎంతో సన్నిహితంగా మెలిగిన బూరగడ్డ వేదవ్యాస్ లాంటి వాళ్ళు పార్టీ మారతానని చెప్పినప్పుడు వై.ఎస్ గారు చాలా హుందాగా ప్రవర్తించారు. రోజు దిష్టి బొమ్మలు తగలబెట్టించి ,తిరగబడాలని చెప్పలేదు.అదీ తన నాయకత్వం మీద నాయకునికి ఉండాల్సిన నమ్మకం.తన నాయకత్వం మీద తనకే నమ్మకం లేకుంటే ఇంక పార్టీ కార్యకర్తలు నాయకుని మీద నమ్మకం పెట్టుకొని పార్టీ లో ఉండాలి .దీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది తాము నిజమైన నాయకులము కాదని తమ, అనుకూల మీడియా తయారు చేసిన నాయకులమని!!

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

you are some what correct.Jagan also a leader created by his own media. you have to accept it. Is he proved as a leader? But I really feel why Mysoora Reddy who published book on corruption of YS joined in YSRCP. Is it Vargam feeling or any other..

I can surely say.. someday will come..chowdries reddies naidus rule is gone.. we will rule with ethics unlike dirty upper cast people.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) చెప్పారు...

>> "Dirty upper caste people"...

upper caste or lower caste, for that matter any section is as dirty and as clean as any other section.

It is better to use these sections and other things to understand their perspectives and problems rather than for characterization.

అజ్ఞాత చెప్పారు...

ముఖ్యంగా చంద్రబాబు గారి మరియు టి.డి.పి వాల్ల బాధ ఏమంటే ఇన్ని రోజులూ పరిటాల రవి హత్య లో వై.ఎస్ మరియు జగన్ హస్తం ఉందని అబద్దాలు గోబెల్స్ ప్రచారం చేసినారు.ఈ వాల అదే పరిటాల రవి ముఖ్య అనుచరులైన నాని మరియు వంశీ జగన్ తో మాట్లాడం వలన ఇన్ని రోజులూ టి.డి.పి. వాల్లు చేసిన ప్రచారాలు అబద్దాలని తేలిపోతున్నాయి.ముఖ్యంగా ఈ వాల టి.డి.పి వాల్లకు నాని పొయిన దానికంటే వాల్ల నిజ స్వరూపం ప్రజలకు ఒక్కొక్కటి అర్థం అవుతున్నందుకే బాధ.టి.డి.పి. వాల్లను ఈ వాల మన రాష్ట్రంలో నమ్మే వాళ్ళు ఎవరూ లేరు.అందుకు నిదర్శనమే ఇంత వరకూ జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు.

పరిచయ్ చెప్పారు...

వంగవీటి రాధా కూడా కాంగ్రెస్ వదిలివెళ్ళిపోతానన్నప్పుడు కూడా YSR హుందాగా ప్రవర్తించారు. కాంగ్రెస్ లోనేవుండు నీకు మంచిది అని చెప్పారేగాని, దిష్టిబొమ్మలు తగలబెట్టండి, తిరగబడండి అని పిచ్చి మాటలు మాట్లాడలేదు. తనమీద తనకు నమ్మకంవున్నవాడైతే పోతేపోనీ వాడి ఖర్మ అనుకుని వదిలెయ్యాలేగాని యిదేంటి.