13, ఏప్రిల్ 2012, శుక్రవారం

సామాన్య ప్రజల కనీస అవసరాలు ఎందుకు తీరడం లేదు?

స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని రోజులైనా ప్రజల కనీస అవసరాలు తీరడం లేదు.దీనికి ప్రధాన కారణం ,మనలను పాలించే ప్రజాప్రతినిధులు సామాన్య ప్రజలతో మమేకం కాకపోవడమే.
ఇందుకు ప్రధాన కారణం ,ప్రజా ప్రతినిధులకు నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటలు కావలసినన్ని నీళ్ళు ,కావలసినంత కరెంటు,కావలసినంత గ్యాసు,కావలసినన్ని టెలిఫోన్ కాల్స్ ,అనారోగ్యం వచ్చినప్పుడు కార్పోరేట్ ఆసుపత్రులు మరియు వాళ్ళు రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నిలిపివేయడమూ జరుగుతుంటాయి.చివరికి అంబులెన్స్ కు దారిని క్లియర్ చేయకున్నా వీళ్ళకు చేస్తారు.వాళ్ళు ఏమీ ఇబ్బంది లేకుండా .సి. రూములల్లో ఉంటారు.వాళ్లకు సామాన్య ప్రజల ఇబ్బందులు ఎలా అర్థమవుతాయి.అందుకే సామాన్య ప్రజల ఇబ్బందులు అలాగే ఉన్నాయి.ప్రజాప్రతినిధులు కూడా సామాన్యుని లాగే అన్ని సమస్యలు ఎదుర్కుంటే వాటి పరిష్కారానికి మనసు పెట్టి ప్రజాసేవకులు అనిపించుకుంటారు .లేకుంటే సామాన్య ప్రజల నెత్తిమీద వాళ్ళు పెనుభారం తప్ప ప్రజలకు ఏమీ ఉపయోగం ఉండదు.

2 కామెంట్‌లు:

dattu చెప్పారు...

vidhaanaalu alaavunte jivitaalu yelaa baagupadatai. Antaraalu penche aardhikavidhanaalu konasaaginantakaalam paristhutulu maaravu. prapanchamantaa velluvettutunna alajadulu aandonalanu prubhutwaalanu padagodutunnai. manadesamlo alaanti alajadulaku aaskaaramledu. kulam matam prantaalakosam kottlaatalu petti paalakulu chodyam choostunnaru.

అజ్ఞాత చెప్పారు...

ఇందుకు ప్రధాన కారణం ,ప్రజా ప్రతినిధులని బాధ్యులను చేసేస్తే అయి పోతుందా? వారేమి ఆషామాషిగా అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రతినిధులా? రాష్ట్రంలో డబ్బులనుఎన్నికలప్పుడు ఎక్కువగా ఖర్చు పెట్టే ట్రెండ్ మొదలు పెట్టిన నెల్లురు, గోదావారి జిల్లాలలో వారి అధికారం చెపట్టే వారి వెనుక ఆయా కులాల ఓట్లు ఉన్నాయి, వారి నయకులు చేసే తప్పులకు ఆయాకులాల ప్రజలే బాధ్యత వహించాలి. వారిని అదుపులో పేట్టాలి. అది చేయక పోగా మంచి చదువులు చదువుకొని అమేరికాలొ ఉన్నవారు కూడా, ఏ ఫోర్స్ రెకన్ విత్ జగన్ అని బ్లాగులు నిర్వహిస్తూంటే అది వారికి ఉన్న కులపిచ్చి ఎలాటిదో తెలియజేస్తున్నాది.