పిల్లల్లో ఈ మధ్య హింసా ప్రవృత్తి పెరిగి పోతాఉంది. దీనికి పరాకాష్టే మొన్న తమిళనాడు లో జరిగిన సంఘటన .ఒక విద్యార్థి తమ టీచర్ ను క్లాసు రూము లోనే కత్తి తో పొడిచి చంపడం.ఇటువంటి పిల్లలు పెరిగి పెద్దైతే సమాజానికి చాలా ముప్పు.పిల్లవాని కంటే ముందు ఆ పిల్లవాని తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలి.ఎందుకంటే ఆ పిల్లవాడు ఆ విధంగా తయారు కావడానికి బాధ్యులు వాళ్ళే .చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పు చేస్తున్నా అది తప్పు అని చెప్పకుండా నవ్వుతూ ఆనందిస్తుంటారు .పిల్లలకు తప్పొప్పులు చెప్పకుండా చాలా ముద్దు చేస్తుంటారు.ఇటువంటి పిల్లలే తర్వాత సమాజానికి ముప్పుగా పరిణమిస్తుంటారు.ఈ మధ్యన వస్తున్న సినిమాలు కూడా ఒక కారణం.చాలా సినిమాలల్లో టీచర్లను ,లెక్చరర్లను చాలా తేలిగ్గా చూపిస్తున్నారు.స్టూడెంట్స్ లెక్చరర్ల మీద కుళ్ళు జోకులు వేసే సీన్లు ఉంటున్నాయి.ఇంకా టి.వి. లలో యాంకర్లు ప్రేక్షకులతో మాట్లాడేటప్పుడు ,మొదట ఏం చదువుతున్నావు అని అడిగిన తర్వాత బాగా చదువుతున్నావా అని అడగడం లేదు .మీది కో ఎడ్యుకేషనా,కాలేజికి బంక్ కొడుతున్నావా ,ర్యాగింగ్ చేసారా,బాగా ఎంజాయ్ చేస్తున్నారా ? అని అడుగుతున్నారు.చాలా మంది పిల్లలు వీటిని అనుకరిస్తున్నారు. కాలేజీ లకు ,స్కూళ్ళకు పోయేది పై వాటి కోసమే నేమో మనమేమో చదువుకొని పొరపాటు చేసున్నామేమో అని అంతో ఇంతో చదివే పిల్లలు కూడా మారుతున్నారు.ముఖ్యంగా తల్లిదండ్రులు ,మీడియా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
10, ఫిబ్రవరి 2012, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్‌లు:
ramanareddy gaaru meeru cheppindi aksharaala nijam-ayte okaa parents ne kaadu-mediani ante teeveelu,sinimaalu
especially cell phones vidhigaa sikshinchakalagaali ane nishedinchaali!emantaaru?
సరిగ్గా చెప్పారు.
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలని యువరాజుల్లా, యువరాణుల్లా గారాబం చేస్తారు.
'మొక్కై వంగనిది మానై వంగునా' అన్నారు అందుకే.
@hari podili
avunu cell phones valana caalaa chedipotunnaaru.
@bonagiri
'మొక్కై వంగనిది మానై వంగునా'
avunu karekt gaa cheppaaru.
కామెంట్‌ను పోస్ట్ చేయండి