అధికార యంత్రాంగాన్ని మన రాజకీయ నాయకులు నిజంగా నిష్పాక్షికంగా పని చేయనిస్తారా? నూరు ఎకరాల భూమి ఉండే అతనికి వృద్దాప్య పించను వస్తా వుంది.ఆర్థికంగా బాగా ఉండేవారు కూడా నాలుగైదు ఇందిరమ్మ గృహాలను సాంక్షను చేయించుకొని మేడలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు.అధికారులేమో వీళ్ళకు ఇవ్వొద్దని చెబుతారు.కానీ వీళ్ళకు ఎలా అందాయి.వీళ్ళు అక్కడ స్థానికంగా ఉండే సర్పంచ్ లాంటి వ్యక్తులకు కావలసిన వ్యక్తులో ,చుట్టాలో అయి ఉంటారు.ఇవన్నీ రాజకీయ నాయకుల ప్రమేయం తోనే జరుగుతాయనేది బహిరంగ రహస్యం.సర్పంచ్ స్థాయి లోనే ఇంత జరుగుతుంటే పై స్థాయిలో అధికారుల మీద ఎంత ఒత్తిడి ఉంటుందో ఊహించుకోవచ్చు.ఇప్పుడు రాజకీయ నాయకులు మేము చేయమంటే చేయడానికి అధికారులేమైనా చిన్నపిల్లలా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.నిజంగా ఏమి జరుగుతుందో రాజకీయనాయకులకు తెలియదా?ఎందుకు ఆత్మ ద్రోహం చేసుకొని మాట్లాడుతున్నారు.మొన్నటికి మొన్న మద్యం సిండికేట్ల విషయంలో ఎ.సి.బి. దాడులు జరిగాయి.అందులో చాలా మంది రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయని వార్తలు వచ్చినాయి.కాని వాటిని బయట పెట్టలేదు . అవి బయట పెట్ట వద్దని ఏ అధికారైనా చెప్పారా?వాటిని మూసి పెట్టి తమ తమ రాజకీయ మైలేజీలను సాధించు కోవాలని ప్రయత్నం చేయడం లేదా?ఇన్ని మాటలు మాట్లాడుతున్నరాజకీయనాయకులు తాము నిజాయితీ పరులమని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా?ఇంత రాద్దాంతం జరుగుతున్న ఈ సమయం లో కూడా ఒక టాక్ షో లో పాల్గొన్న ఒక రాజకీయ నాయకుడిని వాళ్ళ అనుచరులను పోషించడానికి ,రాజకీయాలు చేయడానికి నెలకు ఎంత ఖర్చు అవుతుందన్న ప్రశ్నకు ఆ రాజకీయ నాయకుడు జవాబు దాట వేసాడు .ఆ రాజకీయనాయకుడు నిజాయితీ గా ఆదాయపన్ను కట్టి చేస్తున్న ఖర్చు అయితే ఎందుకు జవాబు దాట వేస్తాడు.వ్యవస్థ లో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు తప్ప ఆవతలి వాళ్ళు అందరూ అవినీతి పరులని ఆత్మ ద్రోహం చేసుకుంటూ మాట్లాడుతున్నారు.ఇలా ఉన్న ఈ వ్యవస్థలో కూడా ఇంకా నిజాయితీ పరులైన అధికారులూ మరియు రాజకీయ నాయకులు మిగిలే ఉన్నారు.అందుకే వ్యవస్థలు కొంతవరకైనా పనిచేస్తున్నాయి.
6, ఫిబ్రవరి 2012, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్‌లు:
తాము చెప్పినట్టు చేయకపోతే అధికారులను అధోగతి పట్టించే, చేస్తే అందలాలు ఎక్కించే అడ్డగోలు అధికారాలు వాళ్ళ చేతిలో వున్నాయి.
సో నైస్
కామెంట్‌ను పోస్ట్ చేయండి