మా చిన్నప్పుడు టవున్నుండి మా ఊరికి బస్సేక్కడానికి బస్టాపులో నిల్చుంటే బస్సు ఆగగానే కండక్టర్ బస్సు దిగి మగోల్లంతా పైకెక్కండి ,మగోల్లంతా పైకెక్కండి, అని అరుస్తా ఉండే వాడు .ఎందుకంటే అప్పుడు మా ఊరికి ఆర్.టి.సి. బస్సు సర్వీసులు చాలా తక్కువగా ఉండేవి.అందువలన బస్సులో ఎంత మంది జనాలు ఉండారో అంతకంటే ఎక్కువ జనాలు బస్సు టాపు పైన ఉండేవారు.మమ్మల్నేమో మా నాయన వాళ్ళు టాపు పైన ఎక్కద్దు కరెంటు తీగలు,చెట్ల కొమ్మలు తగులుతాయని చెప్పేవారు.కానీ కండెక్టరేమో మగోల్లంతా పైకెక్కండి ,మగోల్లంతా పైకెక్కండి, అని అరుస్తా ఉండే వాడు. ఒక వేల టాపు పైకి ఎక్కుతే మా వాళ్ళ కంట పడితే దెబ్బలు తప్పవు.మేమేమో మగోల్లమైపోతిమి మా సావు సావు కాకుండా ఉండేలే ఏం చెబుతావు .
2, ఫిబ్రవరి 2012, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
5 కామెంట్‌లు:
అయ్యో పాపం!
బస్సు టాపు
బస్సు పై టాపు
టాపు ఈ టపా
మగాళ్ళంతా పై కెక్కండీ
ఆండో ళ్ళంతా లోపలకి కుక్కండీ
జిలేబి.
@ రసజ్ఞ ,Zilebi
Thank you
:))
BAGUNDANDI...:):)
RASAGNAA CHADUVUKOKUNDAA ILAA TIRUGUTUNNAVAA?!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి