రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత భాధతో మరణించిన వ్యక్తుల కుటుంబాలను ప్రాంతాలకతీతంగా పరామర్శిస్తూ ,వీలైనంత ఆర్ధిక సాయం ప్రకటిస్తున్న జగన్ గారిని కే.సి.ఆర్ మరియు ఆయన పార్టీ వాళ్ళు అభినందించాల్సి పోయి విమర్శించడం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది.కే.సి.ఆర్ మరియు టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్ళ రెచ్చగొట్టే మాటల వలన తెలంగాణా లోని అమాయక ప్రజలు కొంత మంది ప్రాణ త్యాగం చేసినారు.తెలంగాణా కోసం అమరులైనారని పదేపదే చెప్పుకొని శవ రాజకీయాలు చేస్తున్న టి.ఆర్.ఎస్ వాళ్ళు ఆ కుటుంబాలను ఒకసారైనా పరామర్శించి,వాళ్లకు ఏమైనా ఆర్ధిక సాయం చేశారా?ఈ విషయం చూస్తే తెలుస్తుంది,టి.ఆర్.ఎస్ వాళ్లకు తెలంగాణా ప్రజల మీద ఉన్నప్రేమ.తెలంగాణా ప్రజల మేలు కోసమే తెలంగాణా రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పుకుంటున్న టి.ఆర్.ఎస్ .పార్టీ కి పదవుల మీద ఉన్న ఆసక్తి తెలంగాణా ప్రజల మీద లేనట్లుంది. ఇటువంటి వాళ్ళ వలన వచ్చిన తెలంగాణా(ఒక వేళ వస్తే) ఏ విధంగా సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందో తెలంగాణా ప్రజలు ఒక సారి ఆలోచన చేయాలి.
17, ఏప్రిల్ 2010, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 కామెంట్‌లు:
గీడ మీరు సంజ్ షేషుకునేది షానా వుంది. జగన్ కి ఆడి అబ్బ హాత్ కా కమాల్ చేసి దోచిన సొమ్ములు మస్తున్నాయ్. ఆడు ఒక లచ్చ కాదు 1కోటి ఇవ్వగలడు, అందుకే అంతమంది సచ్చిన్రు. మాకు వసూల్ అయ్యేది చాయ్ పానీలు పోగా మాకే మింగుల్తలేదు. మేమిప్పుడు ఓదార్చనీకి పోతే మమ్మల్ని జిందగీ భర్ ఎవరో ఓదార్చాల్సి వస్తుంది. గందుకే ఓ దఫా మాకూ ముఖ్యమంత్రి ఇస్తే , నలుగురున్నాం తలా ఓ వేయికోట్లు వెనకేసుకుని , మేమూ ఆనాక ఓదారుస్తం , జర ఓపిక పట్టుర్రి. :P
చచ్చిన వారి కుటుంబానికి ఆ చావుని వైఎస్సార్ ఖాతాలో వేయడానికి ఇచ్చింది కుటుంబానికి ఐదు వేలు. ఇప్పుడు ఓదార్పు పేరుతో తన రాజకీయ బాట వేసుకోవడానికి ఇచ్చేది కుటుంబానికి ఒక లక్ష. ఆ లక్ష ఇవ్వడానికి జన సమీకరణకు, మందీ మార్బలానికి పెట్టే ఖర్చు కోట్లు. దానికి ఒక ఎంపీ గా పర్యటనలు చేస్తుంటే రాష్ట్ర మంత్రులు వస్తే అయ్యే ప్రభుత్వ ఖర్చు కోట్లు.
ఇదంతా ఒక జోకయితే, ఇవన్నీ తెలిసి కూడా చదువుకుని బ్లాగులు కూడా రాసుకునే వారు ఈ వెధవ పనిని సమర్ధించడం పెద్ద జోకు.
శవ రాజ కీయాలు అంటే ఏమిటి? జగన్ చేసేది శవ రాజకీయాలు కావా? మొత్తం ఎంతమంది చనిపోయారు ఎంత మందికి ఆర్ధిక సహాయం చేసారు ... చేయ బోతున్నారు? చనిపోయిన వారికి ఆర్ధిక సహాయం చేయడానికి ఇంట హంగామా? ఊరేగింపులూ ఉపన్యాసాలు అవసరమా? ఎదునేలలు ఎందుకు ఆలస్యం చేసారు. పార్టీ తరపున ఎ ప్రతినిదినయినా వారి ఇళ్ళకు పంపి లేదా చనిపోయిన కుటుంబ సభ్యులను ఇడుపులపాయకు రప్పించుకుని వెంట నే సహాయం ఎందుకు చేయలేదు? ఇప్పుడు పనిలో పనిగా లక్షలు ఖర్చు చేస్తూ ఊరూరా రాజ శేకర రెడ్డి కాంస్య విగ్రాహాలను నెలకొల్పడం వెనక రాజకీయ ప్రయోజనం లేదా? ఆ ఖర్చు అంత అవసరమా? ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చింది? రాజశేకర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు జగన్ ఆస్తి ఎంత? ఇప్పుడు అతని ఆస్తి ఎంత? తెలంగాణా కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మాహుతి చేసుకున్న విద్యార్ధుల శవాలను కనీసం గన్ పార్క్ వరకూ తీసుకెళ్ళి నివాళి అర్పించడానికి కూడా అనుమతించక, పోలీసుల చేత రాక్షసంగా లాటీ చార్జీలు , కాల్పులు జరిపించిన ప్రభుత్వం ఇప్పుడు ఆర్నెల్ల తర్వాత తీరుబడిగా జగన్ బయలు దేరితే ప్రభుత్వ కర్చుతో, మంత్రుల వండి మాగదిత్వం తో , పోలీసుల పహారాతో అనుమతించడం వెనక ఏ రాజకీయాలూ లేవా? ఈ ప్రశ్నలకు ఈ బ్లాగు రాసినవారు గానీ ... చూసిన వారు గానీ దేవుడి మీద ప్రమాణం చేసి నిజమైన సమాధానాలు చెప్పక పొతే వారి తల వేయి వక్కలవుతుంది.
-TELANGANA RAMUDU
తెలంగాణా ఉద్యమం కోసం ప్రజలు చనిపోతే అది చేస్తాం ఇది చేస్తాం అని ఆ శవాల దగ్గర ఆవేశంగా డైలాగులు చెప్పి మర్చి పోవడం కాదు.రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన ఏడు నెలల తర్వాత ఆ రోజు ప్రజలకిచ్హిన మాట ప్రకారం జగన్ మాట తప్పకుండా పరామర్శ కోసం వెళ్ళడం లోని నిజాయితీని చూడాలి.తెలంగాణా ఉద్యమం మొదలు పెట్టకముందు కె.సి.ఆర్ మరియు వాళ్ళ బంధువుల ఆస్తి ఎంత ,ఇప్పుడు వాళ్ళ ఆస్తి ఎంత అది కూడా తెలుసు కోవాలి .ఆస్తి ఉంటే సరిపోదు ,ఆస్తి చాలా మంది దగ్గర ఉంది ,దాన్ని జనాల కోసం ఖర్చు చేయగల దమ్ము ,ప్రజల మీద దయా గుణం ఉండాలి.ప్రజల కోసం ఎంత దూరమైనా పోయే దయా గుణం ఉండాలి.అవన్నీ ఉన్నాయి కాబట్టే రాజశేఖరరెడ్డి గారు ప్రజల గుండెల్లో అంతగా నిలిచి పోయినారు.అందుకే ఆయన చనిపోయి ఏడు నెలలైనా ఆయన కొడుకు చేపట్టిన ఓదార్పు యాత్రలో ప్రాంతాలకతీతంగా అంత జన సమూహం కనిపిస్తోంది.వాస్తవాలను ఒప్పుకొనే ధైర్యం కావాలి.
పారిశ్రామికవేత్తలను సినిమా వాళ్ళ ను బ్లాక్మైల్ చేసి గుంజిన డబ్బులు కె.సి.ఆర్ దగ్గర ఉన్నాయి కదండి,సహాయం చేయాలంటే చేయవచ్హు .
Dark truths
http://www.greatandhra.com/ganews/viewnews.php?id=18381
సాటి అజ్ఞాత తెలంగాణ రాముడు, రమణారెడ్డి గార్లు చెప్పిందాంట్లో అర్ధ సత్యాలు, తక్కిన 50శాతం స్వంత సెంటిమెంటు, తప్పుడు ఆలోచన, వూకదంపుడు, మూర్ఖత్వమూ వున్నాయి. ఈ రెడ్డి క్రీస్తుల నిజాయతీని సాక్షాత్తు మేరిమాత కూడా నమ్మదు. మతాన్ని కూడా అవసరానికి తగ్గట్టు రెండుస్థంభాలాట ఆడిన నికృష్టజాతి అది. వాళ్ళలో దేశభక్తి, ప్రజాసేవాతత్పరత చూసిన వాడు ఓ పనికిమాలిన జీవి. అలాగే కెసిఆర్& కో ( ఫేమిలీ) అంతే నికృష్టమైనది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి