13, నవంబర్ 2009, శుక్రవారం

చంద్రబాబు మరియు ఆయన మిత్రబృందం రెండు నాల్కల ధోరణి

మార్గదర్శి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ,ప్రభుత్వం ప్రజల రక్షణకు తనకున్న పరిధిలో చర్యలు తీసుకుంటే చంద్రబాబు గారు మరియు ఆయన మిత్రబృందం కలిసి ఈనాడు పత్రిక మీద మరియు మీడియా మీద దాడి అని ఎంతో హడావిడి చేసారు.అదే ఈ రోజున జగన్ మీద ఎన్నో ఆరోపణలు అదే చంద్రబాబు మరియు ఆయన మిత్ర బృందం సంధిస్తున్నారు.వాళ్లకు ఇప్పుడు మీడియా మీద దాడి గా కనిపించడం లేదా?ఎందుకంటే జగన్ కు కూడా మీడియా ఉంది. కాంగ్రెస్స్ పార్టీ వాళ్లకు చంద్రబాబు గారి లాగా గోబెల్స్ ప్రచారం చేయడం చేతకాదేమో.చంద్రబాబు గారి రెండు నాల్కల ధోరణి ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నది.చంద్రబాబు గారు ఇటువంటి పనులు చేయడం వలన విశ్వసనీయత ఎప్పుడో పోగొట్టుకున్నారు. మిగతా ప్రతిపక్ష నాయకులు కూడా ఆయన వెంట నడిస్తే, వీళ్ళు కూడా ప్రజలలో విశ్వసనీయత పోగొట్టుకొని ప్రజలలో చెల్లకుండా పోతారు.

16 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఇ౦తకు ము౦దు ఈనాడుపై దాడి జరిగినప్పుడు మీరు ఇలానే బాధ పడ్డారా? ఇప్పుడు మాత్రమే బాధగా వు౦దా?

-Chandra

అజ్ఞాత చెప్పారు...

జగన్ కి, రామోజీరావు గారికి ఏమి పోలిక? రాజకీయం ద్వారా రాష్ట్రాన్ని దోచుకొని పత్రిక పెట్టిన వాడోకడైతే, కష్టపడి పైకొచ్చిన వాడు మరొకడు.

అజ్ఞాత చెప్పారు...

ఎవరైతే ఏంటి మనలని నాశనం చేయటానికి ...సిగ్గు పడాలి మనం

Praveen Mandangi చెప్పారు...

రామోజీ రావు హైదరాబాద్ లోనూ, వైజాగ్ లోనూ ఈనాడు ఆఫీసులు కబ్జా చేసిన స్థలాలలో కట్టాడు. ఒకడు తన తండ్రి దోచిన డబ్బులతో పత్రిక పెడితే ఇంకొకడు తాను స్వయంగా కబ్జా చేసిన స్థలాలలో పత్రిక ఆఫీసులు పెట్టాడు.

అజ్ఞాత చెప్పారు...

జగన్ కి రామొజీరావు కి పొలిక వుందా....

Anil Dasari చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Anil Dasari చెప్పారు...

మూడేళ్లపాటు ముప్పేట దాడి తర్వాత .. మార్గదర్శి ఇంకా వ్యాపారంలోనే ఉంది. సాక్షి పత్రిక పెట్టక ముందు 11 లక్షలున్న ఈనాడు సర్క్యులేషన్ ఇప్పుడు 13.1 లక్షలకు పెరిగింది (Source: ABC, Jan-Jun 2009 report). ఉచితంగా ప్రతులు పంచుతున్నా సాక్షి సర్క్యులేషన్ 12.5 లక్షల దగ్గరే నిలబడిపోయింది. గోబెల్స్ ప్రచారం ఎవరిదో కానీ, పాఠకులు మరీ పిచ్చివాళ్లు కారు.

Praveen Mandangi చెప్పారు...

మన దేశంలో చట్టాలు డబ్బున్న నేరస్తులని ఏమీ చెయ్యవు. కృషీ బ్యాంక్ కేసు దర్యాప్తు ఎలా జోక్ అయిపోయిందో, మార్గదర్శి కేసు దర్యాప్తు కూడా అలాగే ఒక జోక్.

మంచు చెప్పారు...

అబ్రకదబ్ర గారు.. ఈ లెక్కల్లొ ఎక్కడొ తెడా కనిపించడం లేదు.. సాక్షి పెట్టకముందు దినపత్రిక లు చదివే ప్రజల సంఖ్య సుమారు 12 లక్షలు అనుకుందాం ( 11 ఈనాడు + 1 మిగతా చిన్న పత్రికలు).. సాక్షి వచ్చాక ఈనాడు 13.1 + సాక్షి 12 = 25.1 లక్షలు.. ఒక్క పత్రిక రావడంతొ మన రాస్ట్రం లొ దినపత్రికలు చదివే వారు సంఖ్య రెంటింపుకన్న ఎక్కువ వుంది.. ఇది నమ్మసఖ్యంగా లేదు.. అదీ ఇప్పుడు వున్న ఎలెక్ట్రానిక్ మీడియా వున్న టైం లొ..

గోబెల్స్ ప్రచారం లొ బాబు ఎమి తీసిపొడు.. కాంగ్రెస్స్ అంతకన్న రెండు ఆకులు ఎక్కువే చదివింది.. పైన ఎవరొ అజ్ఞాత చెప్పినట్టు "ఎవరైతే ఏంటి మనలని నాశనం చేయటానికి ...సిగ్గు పడాలి మనం"

Anil Dasari చెప్పారు...

@మంచుపల్లకి:

మంచి ప్రశ్న అడిగారు. అయితే తేడా ఏమీ లేదండీ.

నాకు తెలిసిన ఒకరిద్దరు వార్తాపత్రికల ఏజెంట్ల నుండి సేకరించిన సమాచారం - సాక్షి వచ్చిన తర్వాత వార్త, సూర్య, ఆంధ్రప్రభ తదితర పత్రికల సర్క్యులేషన్ బాగా దెబ్బ తినింది. కొంతవరకూ ఆంధ్రజ్యోతి సర్యులేషన్ కూడా సాక్షి వైపుకి మళ్లింది. వాటికి అదనంగా, అతి తక్కువ ధరకి (మొదట్లో రెండు రూపాయలేగా) లభించటం వల్ల, కిలో సైజు ఉండటం వల్ల (not literally, but you know what I mean) నెల తర్వాత తూకానికి అమ్మినా పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుండటం వల్ల సాక్షి దాదాపు ఉచితం అన్న ఉద్దేశంతో అప్పటిదాకా వార్తాపత్రికలు కొనే అలవాటు లేని చాలామంది అది కొనటం మొదలు పెట్టారు. ఆ రకంగా చెప్పాలంటే, సాక్షి రాకతో ఆంధ్రప్రదేశ్‌లో పత్రికలు చదివేవారి సంఖ్య దాదాపు రెట్టింపయింది. ఇవి కాక స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా ఉచితంగా పంపిణీ చేయించే కాపీలూ కొన్ని ఉంటాయి. సాక్షి ఎంతకీ తాము ప్రచురించే కాపీల సంఖ్యని చెబుతుందే కానీ వాటిలో నిజంగా ఎన్ని అమ్ముడవుతున్నాయో చెప్పట్లేదు - గమనించారా? సాక్షి సర్క్యులేషన్ గురించి మనకి తెలిసిందల్లా వాళ్లు చెప్పే నోటి లెక్కలే.

మీకు తెలిసే ఉండొచ్చు - పత్రికల సర్క్యులేషన్‌పై ఆరు నెలలకోసారి ABC వాళ్లు ఆడిట్ చేసి సర్టిఫికెట్ ఇస్తారు. ఈనాడుకి వాళ్లిచ్చిన పత్రం ఇక్కడుంది. అదే నేను పైన ప్రస్తావించింది.

ఇక గోబెల్స్ ప్రచారం గురించి. ఇక్కడ బాబు మంచివాడనో, మరొకరు కాదనో నేననటం లేదు. ఎవరి ప్రచారం ఎలాగున్నా, పత్రికల పాఠకులు అది గ్రహించలేని వాళ్లు కాదని మాత్రమే నేనంటున్నది.

సరే. వాళ్లకీ రాజకీయంగా ఎవరి ఇష్టాఇష్టాలు వాళ్లకుంటాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, తెదేపాల బలమే అటూ ఇటూగా ఆయా పార్టీల కొమ్ము కాస్తున్నాయనుకుంటున్న పత్రికల సర్క్యులేషన్లోనూ ప్రతిఫలిస్తుంది గమనించారా? ఏ పార్టీ వోటర్లు ఆ పార్టీకి అనుకూలంగా రాసే పత్రికనే చదువుతారనుకుంటా :-)

మంచు చెప్పారు...

mm Interesting ..

ఈనాడు బాబు ని పొగడడానికి కాస్త మొహమాటపడుతుంది.. సాక్షి సొంతడబ్బా కి అసలు మొహమాటాలుండవనుకుంట.. సాక్షి లొ రాజాకీయ వార్తలు తప్ప మిగతావి అంటే క్రీడలు, కథలు, మహిళా మరియు పిల్లల కాన్సెప్ట్ ఆర్టికల్స్ బాగానే వుంటాయిని విన్నా ..

కమల్ చెప్పారు...

రామోజి అన్న వ్యక్తి తెలుగుదేశం పుట్టకమునుపు నుండి పత్రికా రంగం లో ఉన్నారు, ఒక్కోమెట్టు ఎక్కుతూ కష్టపడతూ అతనొక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు, మరి ఏమి మెట్లు ఎక్కి జగన్ గారు " సాక్షి " పత్రిక పెట్టాడు, ఎవడబ్బ సొమ్ము అది..? తన తండ్రి అధికారం లోకి రాకమునుపు బ్యాంక్ ౠణాలతో 18 కోట్లు అప్పుతో ఉన్న వ్యక్తి అధికారం వచ్చాక కేవలం రెండేళ్ళలోనే దాదాపుగా 60 వేల కోట్లకు పడగలెత్తాడు..! సాక్షి ఒక్కోపేపర్ తయారికి అయ్యే ఖర్చు 20 రుపాయలు, ఇస్తున్నది 2 రూపాయలకి..? ఎవడబ్బ సొమ్ముతో అలా సబ్సిడీ ఇస్తున్నాడు..? ప్రజలకు అది అవసరమా..? ఎవరు ఏమిటో ప్రజలకు బాగా తెలుసు.

మంచు చెప్పారు...

అబ్రకదబ్ర గారు.
మీరు ఇచ్చిన వివరణ తొ నాకు పెప్సి మార్కెటింగ్ స్టొరి గుర్తొచ్చింది..

అజ్ఞాత చెప్పారు...

కమల్ నువ్వు అతిశయోక్తులు మాట్లాడుతున్నావయ్యా. రామోజీరావు అమాయకుడా? ఒరియా, బెంగాలీ బాషల్లో చానెల్స్ పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చాడు? అవి ఫైనాన్స్ కంపెనీ ద్వారా సంపాదించిన డబ్బులు కావా?

అజ్ఞాత చెప్పారు...

జగన్ గురించి ఇంకో అబద్దం. అనిల్ అంబానీ ఆస్తి 50 వేల కోట్లు. జగన్ అనిల్ అంబానీ కంటే ధనవంతుడు ఎప్పుడయ్యాడు? చెవిలో దూరని కాబేజీ ఫ్లవర్లు పెట్టుకునేవాళ్ళలా కనిపిస్తున్నాం కమల్ కి.

మయూఖ చెప్పారు...

అజ్ఞాత అన్నారు... @
(ఇ౦తకు ము౦దు ఈనాడుపై దాడి జరిగినప్పుడు మీరు ఇలానే బాధ పడ్డారా? ఇప్పుడు మాత్రమే బాధగా వు౦దా?)

అజ్ఞాత గారూ ఇంతకు ముందు ఈనాడు మీద దాడి జరగలేదు.మార్గదర్శి చేసిన మోసం గురించి,చట్టాలను అతిక్రమించడం గురించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే,మీడియా మీద దాడిగా ఈ సో కాల్డ్ ప్రజాస్వామిక వాదులు గోబెల్స్ ప్రచారం తో ఊదరగొట్టేసి డిల్లీ వరకు వెళ్ళి వినతి పత్రాలు ఇచ్హి వచ్హినారు.వ్యాపారాలల్లో కావలసినన్నీ అక్రమాలు చేసి మీడియాను అడ్డం పెట్టుకోవడాన్నే నేను చెబుతున్నాను.జగన్ విషయంలో కాంగ్రెస్స్ వాళ్ళు ఒక్క రోజు కూడా మీడియా మీద దాడి గా అభివర్ణించలేదు.దాన్ని చాలా గొప్ప విషయంగా చూడాలి. కాని చంద్రబాబు గారు మరియు ఆయన మిత్రబృందం మీడియా మీద దాడిగా అభివర్ణించి సమస్యను పక్కదారి పట్టించినారు.ఈ విధంగా ప్రతి ఒక్కరూ రకరకాల వ్యాపారాలలో అక్రమాలు చేసి మీడియాను అడ్డం పెట్టుకుంటే పరిస్థితి ఏమవుతుంది.మీడియాను ,వ్యాపారాలను విభజించి చూడవలసిన అవసరం ఉంది.