స్వైన్ ఫ్లూ గురించి ప్రభుత్వాలు,మీడియా చాలా హడావిడి చేస్తున్నాయి,ఎందుకంటే ఇది విమానాల ద్వారా విదేశాలనుండి దిగుమతైన ధనవంతుల జబ్బు కాబట్టి.మన దేశంలో మలేరియా ,అతిసార వలన కొన్ని వేల మంది ప్రతిసంవత్సరం మరణిస్తున్నారు.ఒక్కరోజైనా ప్రభుత్వాలు ,మీడియా ఇంతగా స్పందించాయా?ప్రజల ప్రాథమిక హక్కుఅయిన రక్షిత మంచి నీరు కూడా పొందలేక ఈ మధ్యన హైదరాబాదు లో చాలా మంది చని పోయారు.ప్రజలకు కనీసవైద్యం అందించ లేని ప్రభుత్వాల చేతగాని తనం వలన మన దేశం లో గర్భిణుల ,శిశువుల ,గిరిజనుల,ప్రజల మరణాలుసంభవిస్తున్నాయి. సామాన్య ప్రజల ప్రాణాల విలువ ప్రభుత్వాల,మీడియా దృష్టిలో ఏంటో ఇప్పుడు అర్థం అవుతున్నది. స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవద్దని నేను చెప్పడం లేదు.జాగ్రత్తలు తీసుకోవలసిందే,కానీ సామాన్యప్రజలకు వచ్చే నయం చేయగలిగే జబ్బులను కూడా ప్రభుత్వాలు పట్టించుకొని ,వారి ప్రాణాలకు కూడా ధనవంతుల ప్రాణాల కున్న విలువలో కొంత విలువైన ఇస్తే చాలా సంతోషం.
16, ఆగస్టు 2009, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
ధనవంతుల జబ్బు
who said so.
the slumdwellers are more prone to it, if once reaches there
కామెంట్‌ను పోస్ట్ చేయండి