5, ఆగస్టు 2009, బుధవారం

చిరంజీవిగారి స్వయంకృతాపరాధం

చిరంజీవి గారి పార్టీ నుండి ఒక్కక్కరూ నిష్క్రమిస్తున్నారు.దీనికంతటికి చిరంజీవిగారు చేసుకున్నస్వయంకృతాపరాధమే.ఆయన మార్పు అని వచ్చి అధికారమే పరమావధిగా, ఇతర పార్టీ నుండి వచ్చిన వారిని ఇష్టంవచ్చినట్లు తీసుకున్నారు.వాళ్లకు అధికారం దక్కలేదు కాబట్టి వాళ్ల దారి వాళ్లు చూసుకుంటున్నారు.చిరంజీవిగారుకొత్తవాళ్ళకు ,ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న వాళ్లకు,అవినీతి మకిలి వీలైనంత తక్కువ అంటిన వాళ్లకు ,ఇప్పుడునడుస్తున్న రాజకీయానికి భిన్నమైన రాజకీయం చేయాలనే వాళ్లకు ,మేధావులకు టిక్కెట్లు ఇచ్చి ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉండేది.ఏదో ప్రయోజనం ఆశించి వచ్చిన వాళ్లు ,ఒక్కక్కరు బయటికి వెళుతుంటే అక్కడ ఉన్న వాళ్లకు కూడాతమ తమ రాజకీయ భవిష్యత్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు.ప్రజలకు కూడా పార్టీ ఉంటుందా మునుగుతుదా అని డైలమా లో పడ్డారు.

రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ,అప్పటి వరకూ రాజకీయాలకు దూరంగా ఉన్న మెజారిటీ వ్యక్తులకు టిక్కెట్లుఇచ్చినారు.రామారావు గారిని టిక్కెట్లు అమ్ముకున్నారని ఒక్కరు కూడా వేలెత్తి చూపలేదు. చిరంజీవి గారికి రామారావు గారికి అదే తేడా .అందుకే రామారావు గారు అఖండ విజయం సాధించి చరిత్ర సృష్టించినారు.ప్రజలకుఏమాత్రం తెలియని వాళ్లు కూడా రామారావు గారి బొమ్మ పెట్టుకొని విజయం సాధించినారు.ఇప్పుడున్న తెలుగుదేశంపార్టీకి అప్పటికి తేడా ఉంది,అది వేరే విషయం.

3 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

చిరంజీవి కంటే నీచమైన పనులు NTR చేశాడు. పార్టీ ఆఫీస్ లో రూం బయట తన చెప్పులు ఉంచి, తన చెప్పులకి దణ్ణం పెట్టిన వాళ్ళకే MLA టికెట్లు ఇచ్చేవాడు. ఇప్పుడు జనానికి సినిమా హీరోల మీద క్రేజ్ తగ్గడం వల్ల చిరంజీవి ఓడిపోయాడు. సినిమాకీ, నిజ జీవితానికీ తేడా ఉందని మనం గ్రహించాలి.

అజ్ఞాత చెప్పారు...

"రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ,అప్పటి వరకూ రాజకీయాలకు దూరంగా ఉన్న మెజారిటీ వ్యక్తులకు టిక్కెట్లుఇచ్చినారు.రామారావు గారిని టిక్కెట్లు అమ్ముకున్నారని ఏ ఒక్కరు కూడా వేలెత్తి చూపలేదు." NTR పార్టీ పెట్టినప్పుడు 1983 లో ఎన్నికలకప్పుడు మాత్రం ఇది అక్షరసత్యం. తర్వాత అధికారం లోకి వచ్చిన తర్వాత అహంకారం తో ప్రవర్తించారంటే, అది వేరే కథ.

చిరంజీవి కి మాత్రం, ఓడినా, గెలిచినా, నిజాయితీ పరులకు, సేవ చేయాలనుకొనే వాళ్లకు టికెట్స్ ఇద్దామనుకొనే అలోచన బదులు, వాళ్లు ఎంత డబ్బులు (పార్టీ ఫండ్ కు అయినా, అరవింద్ ఫండ్ కు అయినా) ఇస్తారు అన్న దానిమీదే ద్యాస ఎక్కువయ్యింది అని అనుకొన్నవాళ్లే ఎక్కువ, దానికి తోడు, అవతల పార్టీ వాళ్లతో కుమ్మక్కు అయ్యినట్లు, కొన్ని చోట్ల ఇచ్చిన టికెట్సే సాక్ష్యం. ఇలాంటి పరిస్తితులలో చిరు అభిమానులే చిరు కు వోటు వేయాలా, లేక ఆయన కుమ్మక్కు అయిన అవతల పార్టీ candidate కు వోటు వేయాలా అన్న సంధిగ్దత పడిన నియోజక వర్గాలు కూడా ఉన్నాయ్యి.
పైన వాటి వలన, చిరు కు క్రెడిబిలిటీ పోయి, వోట్లు రాలలేదు. NTR 1983 అఖండ మేజారిటీ తో గెలవటానికి కారణం ఆయనకు అప్పుడు ఉన్న క్రెడిబిలిటీ నే కారణం.

చిరుకు ఉన్న మంచి బలం తను మూడో పార్టీ అవటం. తను కాంగ్రెస్స్, TDP లకంటే చిత్తశుద్ది ఉన్న వాడు గా ప్రవర్తించిఉంటే (కనీసం టికెట్స్ ఇవ్వటం లో) తనకు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ సీట్లే వచ్చేవి.

ఇక, పోయిన క్రేడిబిలిటీ తెచ్చుకోవటానికంటే, ప్రస్తుతానికి, కాంగ్రెస్ తో కుమ్మక్కు అవ్వటానికి, కాస్తో కూస్తో రాజకీయాలలో కూడేసుకొన్న డబ్బును తెల్ల ధనం గా మార్చుకోవటానికే, చిరు ప్రాధాన్యం ఇస్తున్నారని చిరు ప్రక్కన తిరిగే వాళ్ల గొడవ. ఇక వచ్చే ఎన్నికలలో, కాంగ్రెస్ కు బహిరంగ proxy గా ప్రజారాజ్యం మారుతుందో, లేక ఇప్పుడు లాగే match fixings వరకే పరిమితం అవుతుందో, లేదో చూడాలి మరి.

కమల్ చెప్పారు...

బ్లాగర్ Praveen Sarma అన్నారు...

చిరంజీవి కంటే నీచమైన పనులు NTR చేశాడు. పార్టీ ఆఫీస్ లో రూం బయట తన చెప్పులు ఉంచి, తన చెప్పులకి దణ్ణం పెట్టిన వాళ్ళకే MLA టికెట్లు ఇచ్చేవాడు. ఇప్పుడు జనానికి సినిమా హీరోల మీద క్రేజ్ తగ్గడం వల్ల చిరంజీవి ఓడిపోయాడు. సినిమాకీ, నిజ జీవితానికీ తేడా ఉందని మనం గ్రహించాలి.

August 5, 2009 9:37 PM


అయ్యా ప్రవీణ్ శర్మ గారు, యన్.టి.ఆర్ తన చెప్పులకు మొక్కిన వారికి M.L.A. టికెట్స్ ఇచ్చారా..? ఏంటి తమరు చూసారా..? లేక మీ పెద్దలు మీకు అలా చెప్పారా..? మీ అంతక్షవులు కాస్త తెరవండి మహాను భావా..? యన్.టి.ఆర్ అంటే సరిపడని వారు ఇలాగే చెప్పుకునే వారు ! ఆయన అహంభావి అన్న సంగతి అందరికీ తెలిసిందే దానిని ఆసరాగా చేసుకొని ఇలాంటి పుకార్లు చాలానే పుట్టించిన ఆయన వ్యతిరేకులు చాలా పబ్బం గడుపుకున్నారు.ఇలాంటి మాటలు మీలాంటి వారు నమ్మడం లో తప్పేమి లేదులేండి..!..కమల్..