26, సెప్టెంబర్ 2008, శుక్రవారం

ఏడు కేజీలకు మూడు కేజీలు ఉచితం

ఈ మధ్యన కొవ్వు తగ్గిస్తామని పేపర్ లో బాగా ప్రకటనలు వస్తున్నాయి. విపరీతంగా తిని బరువు పెరిగి వాటి వల్ల అనారోగ్య సమస్యలు వచ్చి ,తిరిగి డబ్బులిచ్చి బరువు తగ్గించు కుంటున్నారు.
ఆ ప్రకటనలలో డిస్కౌంట్ స్కీములు కూడా ఉన్నాయి.ఎలాగంటే ఉదాహరణకు ఏడు కేజీలకు మూడు కేజీలు ఉచితం అని.

ప్రపంచ జనాభా లో ఒక పూట భోజనానికి లేని వాళ్లు ఎందరో ఉన్నారు.కావున అనవసర తిండి తగ్గిస్తే రెండు విధాలు గా ప్రపంచానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము.ఒకటి వృధా ధాన్యం ఖర్చు మరియు డబ్బు పొదుపు .

3 కామెంట్‌లు:

Anil Dasari చెప్పారు...

రమణారెడ్డిగారు,

కొవ్వు ఎక్కువ కావటానికి మితిమీరిన తిండి ఒక్కటే కారణం కానవసరం లేదు. దైనందిన జీవితంలో వత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవటం, హార్మోనుల అసమతౌల్యం, జన్యుపరంగా సంక్రమించే జబ్బులు, వగైరా బోలెడు కారణాలుంటాయి.

మయూఖ చెప్పారు...

అబ్రక దబ్ర గారు నేను ఆరోగ్య సమస్యలు ఉన్న వారి గురించి చెప్పలేదు.వారెటూ డబ్బులు ఖర్చు చేసి బరువు తగ్గించు కోవాలి.సాధారణంగా ప్రజలను గమనించినాక ఆ పోస్ట్ చేసాను.మీ కామెంట్ కు ధన్యవాదాలు.

రమణారెడ్డి

Praveen Mandangi చెప్పారు...

డబ్బున్న వాడు అనవసర తిండికి పెట్టే ఖర్చు తగ్గించినా ఆ డబ్బుతో పేదవాడి ఆకలి కొంచెమైనా తీర్చొచ్చు. బిర్యాణీలు తినడం అనవసరమే. వాటిలో నూనె ఎక్కువ వేస్తారు, దాని వల్ల కొవ్వు పెరుగుతుంది. కొవ్వు మరీ ఎక్కువైతే డాక్టర్లు బిర్యాణీలు మానెయ్యమని సలహా ఇస్తారు. ఒంట్లో కొవ్వు పెంచుకోవడం ఎందుకు ఆ తరువాత కొవ్వు కరిగించుకోవడం ఎందుకు? బురద తొక్కనేల, కాళ్ళు కడగనేల అన్న సామెత లాగ? చిన్నప్పుడు నేను కూడా అదే తప్పు చేశాను. బిర్యాణీలు బాగా భుక్కేవాడిని. మసాలాల వల్ల కడుపు మంట సమస్య ఎక్కువైన తరువాత బిర్యాణీలు తినడం మానేశాను. కొవ్వు పదార్థాలు సులభంగా అరగవు కాబట్టి అవి తినడం వల్ల నాకు అజీర్తి సమస్య కూడా వచ్చేది. పేద వాళ్ళకి తిండి దొరకదు, డబ్బున్న వాడికి తిన్నది అరగదు.