8, జులై 2011, శుక్రవారం

ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ..

ప్రజా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి 62 వ జయంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ....

23, జూన్ 2011, గురువారం

ఎవరి మెప్పు కోసం ఈ గోబెల్స్ ప్రచారం......

జగన్ గారు ఓదార్పు యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ప్రాంతం లో పర్యటించినపుడు ,ఎంతో మంది భక్తుల ఆరాధ్య దైవమైన సాయిబాబా గారు పరమ పదించిన తర్వాత ఆయన కుమారుడైన రత్నాకర్ గారిని జగన్ గారు మానవతా దృక్పథం తో పరామర్శించడం కొంత మీడియా బురద చల్లడానికి ఒక అవకాశంగా తీసుకొని తిరిగి తమ విశ్వసనీయతను మరొక సారి పోగొట్టుకున్నాయి.జగన్ గారి ఓదార్పు యాత్రకు వస్తున్న స్పందన చూసి దాన్ని తగ్గించి చూపడానికి కొన్ని మీడియా సంస్థలు ఈ పనికి పూను కొన్నాయి.జగన్ గారు ఓదార్పు యాత్ర కు ఒక ప్రాంతానికి వెళ్ళినపుడు ప్రాంతంలో ఉన్న ప్రముఖులు అనారోగ్యం పాలైనపుడు గాని ,వాళ్ళ బంధువులు చనిపోయినపుడు గాని వాళ్ళు తమతో రాజకీయంగా విభేదించినప్పటికీ వాళ్ళను పరామర్శిం చడం ఆనవాయితీ.అది వాళ్ళ మానవత్వానికి ఒక నిదర్శనం.ఉదాహరణకు ఎం.పి . హర్షకుమార్ గారు సుపత్రి లో ఉన్నప్పుడు కూడా జగన్ గారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు పరామర్శించారు.జగన్ గారు మాత్రమే కాదు,వాళ్ళ తండ్రి రాజశేఖరరెడ్డి గారికి కూడా శత్రువులకు కూడా సహాయం చేసే లక్షణం ఉంది.అందుకే వాళ్లకు ప్రజలలో విశ్వసనీయత ఉంది. మిగతా రాజకీయ నాయకుల లాగా ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలకు డ్రామాలు వినిపించి తర్వాత ప్రజలను పట్టించు కోకుండా ఉండే రకం కాదు.సాయబాబా గారు జీవించి ఉన్నప్పుడు ఆయన చుట్టూ చీటికీ మాటికి తిరిగి ఆయన దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు కనిపించి ఆయన ద్వారా పనులు చేయించుకొని ,ఆయన మరణ శయ్య మీద ఉన్నప్పుడు తమ తమ ఆర్ధిక లావాదేవీలు పరిష్కరించుకొని తర్వాత అటువైపు చూడని పెద్దమనుషులు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి.వై.ఎస్.వాళ్ళు ఎప్పుడూ అటువంటి పనులు చేయలేదు,మీడియా ద్వారా నాయకులు కాలేదు .దమ్ముగా ప్రజలలో నుండి వచ్చారు,ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారు.ఇప్పటికైనా మీడియా సంస్థలు ప్రజలు నవ్వుకునేటట్లు ఉన్న తమ గోబెల్స్ ప్రచారం మానుకుంటే కొంతవరకైనా వాళ్ళ విశ్వసనీయతను నిలుపుకుంటారు.

31, మే 2011, మంగళవారం

డబ్బుల కోసం ఏమైనా చేస్తారా?

మన రాష్ట్రంలో పేరున్న ఒక చానల్ ఇంకొక చానల్ యాజమాన్యానికి సంభంధించిన తలకు పెట్టుకునే ఆయుర్వేద మందు గురించి , మందు పనికి రానిదని ప్రజలను మోసం చేస్తున్నారని ఒక రోజంతా నిపుణులతో చానల్ లో చర్చా కార్యక్రమం పెట్టి మందు పనికి రానిదని తేల్చేసారు.కానీ అదే చానల్ కు సంభందించి పత్రికలో మాత్రం మందు కు సంభంధించిన ప్రకటన మొదటి పేజీ లో చూసి నేను ఆశ్చర్య పోయాను.ప్రకటనకు డబ్బులిస్తే ఏమైనా వేస్తారా ? ఇతరులకు నైతిక విలువలు భోదించే వరకేనా ?తమకు నైతికత అక్కరలేదా?ఇటువంటి వాటి వలెనే పత్రికలు విశ్వసనీయత కోల్పోయాయి.

14, మే 2011, శనివారం

మీసాలు తెగి పడ్డాయి,తొడలు బొబ్బలెక్కాయి.

మీసాలు తెగిపడ్డాయి.తొడలు బొబ్బలెక్కాయి.అధికార ,ప్రతిపక్షాలు కుమ్మక్కై ముప్పేట దాడి చేసినా వై.ఎస్.ఆర్ .కాంగ్రెస్స్ పార్టీ కడప ,పులివెందుల ఉప ఎన్నికలలో భారీ మెజార్టీ తో బోణీ కొట్టింది.జగన్ పేరుతో మరియు విజయమ్మ పేరుతో పదిమంది చేత నామినేషన్లు వేయించి, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి వై.ఎస్.ఆర్. పార్టీ కార్యకర్తల మీద అన్యాయంగా బైండోవర్ కేసులు పెట్టించి ,విచ్చల విడిగా డబ్బులు పంచి ,గెలవడానికి అధికార పార్టీ చేయని కుట్ర అంటూ ఏమీ లేదు.అయినా కూడా కడప వోటర్లు వాళ్ళ ప్రలోభాలకు లొంగ కుండా విశ్వసనీయతలో రాజశేఖర రెడ్డి గారి వారసులమని మరోసారి చాటి చెప్పారు.అధికార ,ప్రతిపక్షాలు ఎన్ని మేకపోతు గాంభీర్యపు మాటలు మాట్లాడుతున్నా రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉంది.అపజయాన్ని ఇప్పటికైనా హుందా గా ఒప్పుకుంటే ప్రజలు వాళ్ళను మన్నిస్తారు.