రాజకీయ పార్టీ లు ఓటర్లు పోలింగు కు రావడం లేదని చెబుతూ ,పోలింగు శాతం పెంచడానికి ఓటింగు ను కంపల్సరీ చేయాలని చెబుతూ ఉంటారు . ప్రజలు పోలింగు కు ఎందుకు రావడం లేదని రాజకీయ పార్టీలు ఎప్పుడైనా ఆలోచించాయా ?ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల మీద నమ్మకం లేకనే !
ప్రతి చిన్న వస్తువు కొన్నా కూడా వినియోగదారుడు మోస పోకుండా వినియోగ దారుల చట్టం ఉంది . కానీ ప్రజాస్వామ్యం లో ఓటరు కు తానూ నమ్మి ఓట్లు వేసిన ప్రభుత్వాలు తమకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారో లేదో అనే నమ్మకం లేదు .
ఎన్నికల కమీషన్ ఇప్పటి కైనా సంస్కరణ లు తేవాలి. రాజకీయ పార్టీల హామీలు స్పష్టంగా కూడా ఉండాలి,ఉదా: సింగపూర్ చేస్తాను,అమెరికా చేస్తాను,ఆఫ్రికా చేస్తాను లాంటి అస్పష్టమైన హామీలు ఉండ కూడదు . రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల మీద బడ్జెట్ చూపించి నిధులు ఏ రూపంగా సేకరిస్తారో ,ఎంత సమయం లోపల ఆ హామీలు నేర వేరుస్తారో రాజకీయ పార్టీల నుండి రాతపూర్వకంగా తీసికోవాలి . ఎన్నికల కమీషన్ ఆ హామీల మీద సంతృప్తి చెందిన తర్వాత నే ఆ పార్టీలు మానిఫెస్టో లో పెట్టాలి . ఒక వేల ఆ హామీలు ఆ నిర్దిష్ట సమయం లోపల నెరవేరక పోతే ఆ ప్రభుత్వం ఆటోమాటిక్ గా రద్దయ్యే గా చట్టం చేయాలి. తిరిగి ఎన్నికలు నిర్వహించాలి . ఆ ఎన్నికల ఖర్చును హామీలు నెరవేర్చ లేక అధికారం నుండి దిగి పోయే రాజకీయ పార్టీ నుండి వసూలు చేయాలి . ఆ అసత్యపు హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీ ని కొన్ని సంవత్సరాల పాటు తిరిగి ఎన్నికలలో పోటీ చేయ కుండా నిషేధించాలి .
అప్పుడు చూడండి ఓటర్లు పోలింగుకు ఎందుకు బారులు తీరరో !తాము కోరుకున్న పార్టీని ,తమకు నచ్చిన హామీలు ఇచ్చిన పార్టీని ఎన్నుకోవడానికి ఓటర్లు బారులు తీరి పోలింగు బూతు కు వస్తారు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి