21, ఆగస్టు 2014, గురువారం

ప్రజలు పోలింగు కు 100 శాతం ఎందుకు రావడం లేదు !

     రాజకీయ పార్టీ లు ఓటర్లు పోలింగు కు రావడం లేదని చెబుతూ ,పోలింగు శాతం పెంచడానికి ఓటింగు ను కంపల్సరీ చేయాలని చెబుతూ ఉంటారు . ప్రజలు పోలింగు కు ఎందుకు రావడం  లేదని రాజకీయ పార్టీలు ఎప్పుడైనా ఆలోచించాయా ?ముఖ్యంగా రాజకీయ పార్టీలు  ఇచ్చే హామీల మీద నమ్మకం లేకనే !

                  ప్రతి చిన్న వస్తువు కొన్నా కూడా  వినియోగదారుడు మోస పోకుండా వినియోగ దారుల చట్టం ఉంది . కానీ ప్రజాస్వామ్యం లో ఓటరు కు తానూ నమ్మి ఓట్లు వేసిన ప్రభుత్వాలు తమకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారో లేదో అనే నమ్మకం లేదు .  

                    ఎన్నికల కమీషన్ ఇప్పటి కైనా  సంస్కరణ లు తేవాలి. రాజకీయ పార్టీల హామీలు స్పష్టంగా కూడా ఉండాలి,ఉదా: సింగపూర్ చేస్తాను,అమెరికా చేస్తాను,ఆఫ్రికా చేస్తాను లాంటి అస్పష్టమైన హామీలు ఉండ  కూడదు . రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల మీద బడ్జెట్ చూపించి నిధులు ఏ రూపంగా సేకరిస్తారో ,ఎంత సమయం లోపల ఆ హామీలు నేర వేరుస్తారో రాజకీయ పార్టీల నుండి రాతపూర్వకంగా  తీసికోవాలి . ఎన్నికల కమీషన్ ఆ హామీల మీద సంతృప్తి  చెందిన తర్వాత నే ఆ పార్టీలు మానిఫెస్టో లో పెట్టాలి . ఒక వేల ఆ హామీలు ఆ నిర్దిష్ట సమయం లోపల నెరవేరక పోతే ఆ ప్రభుత్వం ఆటోమాటిక్ గా రద్దయ్యే గా చట్టం చేయాలి. తిరిగి ఎన్నికలు నిర్వహించాలి . ఆ ఎన్నికల ఖర్చును హామీలు నెరవేర్చ లేక అధికారం నుండి  దిగి పోయే రాజకీయ పార్టీ నుండి  వసూలు చేయాలి . ఆ అసత్యపు  హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీ ని కొన్ని సంవత్సరాల పాటు తిరిగి ఎన్నికలలో పోటీ చేయ కుండా నిషేధించాలి . 

                           అప్పుడు చూడండి ఓటర్లు పోలింగుకు ఎందుకు  బారులు తీరరో !తాము కోరుకున్న పార్టీని ,తమకు నచ్చిన హామీలు ఇచ్చిన పార్టీని ఎన్నుకోవడానికి  ఓటర్లు బారులు తీరి పోలింగు బూతు కు వస్తారు . 
                     

15, ఆగస్టు 2014, శుక్రవారం

జగన్ అధికారం లోకి రాక పోవడం మంచిదైంది !

ఒక వేల జగన్ అధికారం లోకి వచ్చి ఉండుంటే   --- , వివిధ మీడియా చర్చల్లో టి. డి. పి  నాయకులు ,మరియు వారికి సంభందించిన మీడియా  ల లో-- "టి. డి. పి అధికారం లోకి వచ్చి ఉండింటే  ఈ పాటికే లక్షా రెండు  వేల కోట్ల రైతు  రుణమాఫీ జరిగి పోయి ఉండును ,అలాగే డ్వాక్రా రుణమాఫీ ,అందరికీ ఉద్యోగాలు ,ఉద్యోగం రాని  వారికి నిరుద్యోగ భృతి ,కాలేజి పిల్లలకు ట్యాబులు ఇలా తాము మానిఫెస్టో లో  ప్రకటించిన  ప్రతి పని ,పైన మోడి ఉన్నారు కాబట్టి  ఈ పాటికే అయి పోయి ఉందును అని" , ఎన్నికల ముందు  తమ కు సంభందించిన మీడియా లో ఎలా ప్రచారం చేసారో  అలా ఊదర గొట్టేసేవారు . పాపం ప్రజలు కూడా  తాము జగన్ ను అధికారం లోకి తీసుకు వచ్చి చాలా తప్పు చేసామని భావించే పరిస్థితిని కల్పించే వారు . ఆ పథకాలను ఎలాగైనా అందుకోవటానికి తక్షణం జగన్ ను అధికారం లో నుండి   దించి ,  టి. డి. పి ని అధికారం లోకి తీసుకు రావాలన్నంతగా  ప్రచారం ఉండేది . ఆ ప్రమాదం ఇప్పుడు తప్పి పోయింది . 

శుభాకాంక్షలు

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ  శుభాకాంక్షలు .