ఆంధ్రప్రదేశ్ పజలను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం మరియు ఈర్ష్య కలుగు తున్నది. ఎందుకంటే జూన్ 2 తర్వాత వారు అనుభవించే సుఖాలను గురించి తలచు కొని.
ఎలా లేదన్నా ఇంటికి ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్లకు పెన్సన్ 2000 రూపాయలు,ఇద్దరు నిరుద్యోగులు వాళ్లకు భృతి 4000 .ఇలా ఏం పని చేయకున్నా ప్రతి కుటుంబానికి నెలకు కనీసం ఆరు వేల రూపాయలు వస్తాయి. ఇక మహిళలు వంట చేయ వలసిన పని లేదు,ఎందుకంటే అన్నా క్యాంటీన్ నుండి తక్కువ రేటు తో పార్సల్ తెచ్చు కోవచ్చు. హాయిగా ఇంట్లో కూర్చొని ఉచిత విద్యుత్ ఉపయోగించుకొని టి.వి. చూస్తూ ఉండడమే . అలాగే యువకులు /యువతులు బోర్ కొడితే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ట్యాబ్ తీసికొని పబ్లిక్ ప్లేసెస్ ల ఉచితంగా లభించే ఎ.సి లో కూర్చొని ,వై.ఫై. ఉపయోగించుకొని స్నేహితులతో చాటింగ్ చేయ వచ్చు . ఇప్పటికే ఒక వేళ ఋణాలు చేసి ఉంటే అవి తీర్చాలనే బాధ లేదు,ఎలాగూ ప్రభుత్వం మాఫీ చేస్తుంది .1,50,000 ల తో ఇల్లు కూడా ఉచితంగా ప్రభుత్వం కట్టి ఇస్తుంది . ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ఇలాంటివి చాలా ఉన్నాయి ఎ. పి . ప్రజలు అనుభవించే సుఖాలు.
కానీ నాకు చాలా ఈర్హ్య గా ఉంది ఎ. పి .ప్రజలను చూస్తే ,ఎందుకంటే ఈ స్వర్గ సుఖాలను నేను అనుభవించే అవకాశం లేదు కాబట్టి.