ఇన్నాళ్ళు తెలంగాణా నాయకులు సీమాంధ్ర వాళ్ళను ద్రోహులు,దోపిడీ దారులు అని చెబుతూ వచ్చారు . వాళ్ళ దోపిడీ నుండి కాపాడుకోవడానికే తెలంగాణా కావాలని అందరికీ చెబుతూ వచ్చారు . ఇప్పుడు కాంగ్రెస్స్ వాళ్ళు ఆ మాటలు నిజమని నమ్మి తెలంగాణా ఇచ్చారా లేక ఏదైనా ప్రాతిపదిక ఉందా ,సీమాంధ్రు లకు తెలప వలసిన బాధ్యత ఉంది .
31, జులై 2013, బుధవారం
30, జులై 2013, మంగళవారం
భావోద్వేగాలను రెచ్చగొట్టిన తెలంగాణా నాయకులకు ముందుంది ముసళ్ళ పండగ!
తెలంగాణా తెచ్చుకున్నట్లు కాదు,ఒక వేల ఇస్తే ! భావోద్వేగాలను రెచ్చగొట్టిన తెలంగాణా నాయకులకు ముందుంది ముసళ్ళ పండగ,ఎందుకంటే తెలంగాణా ఇస్తే తాము ఏదో ఊడ పొడుస్తామని తెలంగాణా ప్రజలందరికీ అరచేతిలో స్వర్గం చూపెట్టారు . ఇప్పుడు తెలంగాణా ప్రజలు చాలా నిశితంగా గమనిస్తారు. ఇంత భావోద్వేగం తో తెచ్చుకున్న తర్వాత ప్రజలు మార్పును చాలా తొందరగా కోరుకుంటారు . వాళ్ళను ఎలా మభ్య పెట్టారంటే వాళ్ళు ఏమీ పని చేయకుండానే ఇంట్లోకి డబ్బులు వచ్చి పడతాయని చెప్పారు. కోరుకున్నన్ని ఉద్యోగాలు ,బంగళాలు దొరుకుతాయని ఆశ పెట్టారు. అక్కడి ప్రజలు ఒకటి ,రెండు సంవత్సరాలు చూస్తారు,వాళ్ళు కోరుకున్న మార్పు ఏమీ కనపడదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంతగా అభివృద్ధి చెందలేదు .కావున తెలంగాణా ఇచ్చిన పార్టీకి, తెచ్చామని చెప్పిన పార్టీకి ఇద్దరికీ ప్రజలు వాతలు పెట్టి తాము ఎవరికీ ఓట్లు వేయాలనుకుంటారో వాళ్ళకే వేస్తారు.
సీమాంధ్ర నిరుద్యోగులు ఇంక అడుక్కుతినాలి!
తెలంగాణా ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లే ఉంది . ఎంత సేపు కాంగ్రెస్స్ పార్టీకి తమ ఓట్లు ,సీట్ల గురించి,జగన్ ఫోబియా నుండి బయట పడే మార్గం గురించే ఆలోచించి దే తప్ప ,ఒక వేల విభజిస్తే మిగతా ప్రాంతాల్లో ఉండే ప్రజల గురించి ఆలోచన చేసినట్లు లేదు. రాయలసీమ ,మరియు కొన్ని కోస్తా జిల్లాల్లో కరువు వుంది . ప్రజలకు పనులు లేక వలసలు పోవు చున్నారు. కలసి ఉన్నప్పుడే హైదరాబాదులో సీమాంధ్రు లు ఉద్యోగాల కోసం వస్తే వారి సర్టిఫికెట్లను చించి వేసిన సంధర్భాలు ఉన్నాయి. అలాంటిది విడిపోయిన తర్వాత సీమాంధ్రుల నిరుద్యోగుల పరిస్థితి ఏంటి . ముందు సీమాంధ్ర లో పరిశ్రమలు ,నీటి వసతి అభివృద్ధి చేసిన తర్వాత విడగొడితే బాగుండేది . లేక పోతే హైదరాబాదును ఎవరికీ చెందకుండా పెట్టాలి .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)