టి.డి.పి పార్టీ రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యంగా ఉంది.ఒకప్పుడు సాధారణ ఎన్నికలల్లో పోలింగ్ శాతం తగ్గినప్పుడు చాలా పార్టీలు టి.డి.పి తో సహా ఓటు విలువ ఓటర్లకు తెలియదని ,ఓటు గురించి,ప్రజాస్వామ్యం గురించి చాలా ప్రసంగాలు చేసినాయి.మరి ఇప్పుడేమి అయ్యిందో అర్థం కావడం లేదు. చెప్పేదొకటి చేసేదొకటా?తమ ఓట్లు వేసి గెలిపించిన టి.డి.పి ఎం.పి లు,ఎమ్మెల్లే లు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించక పొతే , సామాన్య ఓటరు పరోక్షంగా తమ రాష్ట్రపతి ని ఎన్నుకునే అవకాశం కోల్పోయినారు. పార్టీ లు తమ రాజకీయ అవసరాలకోసం ఒక్కక్క సారి ఒక విధంగా పిలుపు ఇవ్వకూడదు.రేప్పొద్దున ఎన్నికలమీద నిరాసక్తత కలిగి సామాన్య ఓటర్లు ఓటు హక్కు వినియోగించక , పోలింగ్ శాతం తగ్గితే ఈ పార్టీ లు ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకొమ్మని పిలుపు ఇచ్చే నైతిక హక్కు ఉండదు.చాలా సార్లు కొన్ని విప్లవ పార్టీ లు ఎన్నికలను బహిష్కరించమని పిలుపునిస్తే వారిని ప్రజాస్వామ్య వ్యతిరేకులని ఇవే పార్టీ లు విమర్శించాయి. ఇప్పుడు సామాన్య ఓటరుకు ఈ పార్టీ ల మీద కూడా అదే అనుమానం వచ్చే ప్రమాదం వుంది.
18, జులై 2012, బుధవారం
12, జులై 2012, గురువారం
నిజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయా??
వేరే మీడియా మరియు పేపర్ లేనప్పుడు ఒక వర్గం మీడియా మరియు పత్రికలు తయారు చేసిన నాయకుని నాయకత్వ లక్షణాల పై ఇపుడిపుడే ప్రజలకు భ్రమలు తొలగి పోతున్నాయి.ఒక వ్యక్తి తన వ్యక్తిగత సంభంధాలలో భాగంగా ఇంకో పార్టీ లో వ్యక్తిని కలిస్తే అతని దిష్టి బొమ్మలు తగలబెట్టడం ,అతని మీదికి తిరగ బడాలనడం ,సంజాయిషీ కోరకుండా పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఏ ప్రజాస్వామ్యంలో భాగం?తన పార్టీ మీద ,తన నాయకత్వ లక్షణాల మీద తనకున్న నమ్మకం ఏ పాటిదో అర్థం అవుతూ ఉన్నది.
ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు వై.ఎస్. తో ఎంతో సన్నిహితంగా మెలిగిన బూరగడ్డ వేదవ్యాస్ లాంటి వాళ్ళు పార్టీ మారతానని చెప్పినప్పుడు వై.ఎస్ గారు చాలా హుందాగా ప్రవర్తించారు.ఏ రోజు దిష్టి బొమ్మలు తగలబెట్టించి ,తిరగబడాలని చెప్పలేదు.అదీ తన నాయకత్వం మీద నాయకునికి ఉండాల్సిన నమ్మకం.తన నాయకత్వం మీద తనకే నమ్మకం లేకుంటే ఇంక పార్టీ కార్యకర్తలు నాయకుని మీద ఏ నమ్మకం పెట్టుకొని పార్టీ లో ఉండాలి .దీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది తాము నిజమైన నాయకులము కాదని తమ, అనుకూల మీడియా తయారు చేసిన నాయకులమని!!

3, జులై 2012, మంగళవారం
హిందూ అరబిక్ నంబర్లు పోస్ట్ లో రావాలంటే ఏం చేయాలి!!
బ్లాగు లో పోస్ట్ వ్రాసేటప్పుడు నంబర్లు వ్రాస్తే నంబర్లు కూడా తెలుగువే వస్తున్నాయి.హిందూ అరబిక్ నంబర్లు రావాలంటే ఏం చేయాలి.దయచేసి బ్లాగు మిత్రులు తెలపగలరు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)