ఇప్పుడు మన దేశం లో పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్త లని మనం ఘనంగా ,గర్వంగా చెప్పుకుంటున్న వాళ్ళు అందరూ చాలా చిన్న స్థాయి నుండి వచ్చినవారే. ప్రపంచంలోని ధనవంతులలో మన వాళ్ళు ఇన్నో స్థానంలో ఉన్నారు,అన్నో స్థానంలో ఉన్నారు,అని మన దేశం లోని వాళ్ళు ఉప్పొంగి పోతుంటారు.మనదేశం లోని వాళ్లైనా ,ఇతర దేశం లోని వాళ్లైనా పారిశ్రామిక వేత్తలు రాజకీయ నాయకుల లేక బ్యూరోక్రసీ యొక్క అండదండలు లేకుండా ఇంత స్థాయి కి వచ్చేవారా? బడా పారిశ్రామిక వేత్తల కోసం ప్రభుత్వాలు చట్టాలు మార్చిన సందర్భాలు ఉన్నాయి.అవన్నీ రాజకీయ నాయకులు ,బ్యూరోక్రాట్లు తమ స్వలాభం మానుకొని చేసి ఉంటారా?ఆ పారిశ్రామిక వేత్తలు రాజకీయాలలోకి రాలేదు.అందువలన వాళ్ళు పొందేది వాళ్ళు పొందుతూ వీళ్ళకు ఇచ్చేది వీళ్ళకు ఇచ్చి ఆనందంగా ఉన్నారు.అంత నైతికంగా వ్యాపారాలు చేస్తే ఏ పారిశ్రామిక వేత్త ఎవరూ అంత పెద్ద స్థాయి కి పోలేరు. చివరికి సామాన్య ప్రజలు కూడా దేవస్థానం లో దేవుని దర్శనానికి ,వసతికి కూడా రాజకీయ నాయకులనో ,అధికారులనో ఆశ్రయించ వలసి వస్తున్నది.మనకు రావలసిన కనీస అవసరాలు కూడా రెకమెండేషన్ లేకుండా రావడం లేదు.వ్యవస్థ ఆ విధంగా అయినది.కొంత మంది ప్రజలు ,కొంత మంది రాజకీయ నాయకులు కడుపు మంట తో ఆత్మ ద్రోహం చేసికొని మాట్లాడుతున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
5 కామెంట్లు:
అందుకనే దివంగత మహా మేత గారు, "చట్టం, తన పని తాను చేసుకుపోతుంది" అని నొక్కి బోలెడు సార్లు సెలవిచ్చారు. ఎంతయినా ముందు చూపున్న వ్యక్తి గదా!!
మహా మేత అనుచరులుగా గురువు గారు చెప్పిన మాటలు గుర్తు పెట్టుకొంటూ, ఆయన ముందుచూపును గౌరవిస్తూ ఉంటే అందరూ, మీరు ఆత్మ ద్రోహమంటారేమిటి :) , అసలు జగన్ మహా నేత కొడుకేనా? తన తండ్రి చెప్పిన మాటలనే ఖండిస్తున్నాడు?
em chepaaru sir......sishyaganam anthaa okate policy.....
corporates thappu cheste pattukovalasindhi government..mari alaanti govment ne..addu pettukone dochesukonaaru...adi koodaa andaroo chesthundhe......kaani ade heroism laa ..andulo tappe lenatlu,....bariteginchi vyavstha morlities ne wrong set cheyaalani try chesthunaaru ee kishkinda saamrats.......
evaroo athma vanchana chesukone pani lekundaa chinnappati nunche pillalni dopidi vypu nadipisthe...evadu dochukogaliginantha vaadu dochukontoo bathukutaarooo...inkaa chaduvulu koodaa avasram ledu appudu......vuggu paala to ne dopidee paatlu nerpincheyochu
అజ్ణాన్ని బయటపెట్టుకొంటు ఏ రాస్తున్నావయ్య. ఆ రెండు వర్గాల పారిశ్రామిక వేత్తలలో నిజాయితిలేదని చెప్పు. మొదటి నుంచు రేడ్లు కాంగ్రెస్ పార్టి అడ్డుపెట్టుకొని సివిల్ ఇంజనిరింగ్ కాంట్రాక్ట్‌లు తెచ్చుకొనే వారు. మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలైన కర్ణాటక,మహరాష్ట్రాలలో కాంగి ప్రభుత్వాల సహాయంతో అక్కడ కూడా పనులు సంపాదించేవారు. ఆ తరువాత తె.దె. అండతో పేపరోడు బాగా లబ్ది పొందాడు. కులగజ్జి బాగా అంటించాడు. ఈ రెండు వర్గాల వారు అధికార, డబ్బు పిచ్చి వలన, గొరె మంద సైకాలజి వలన ప్రజల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. దగ్గులు, పిండారిలతో పోటిపడుతున్నారు. చరిత్రలో వీరి పేరు చెపితే చీత్కరించుకొనే రోజులు ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే బాబు ఎన్ని మాటలు చెప్పిన నమ్మటంలేదు. త్వరలో మిగతావారికి జరుగుతుంది ఆసన్మానం.
పారిశ్రామిక వేత్తలకి నిజాయితి లేదంటావా గోద్రేజ్, టి వి యస్, టి సి యస్ , విప్రొ వీరంతా పారిశ్రామిక వేత్తలు కారా?
అందరు పారిశ్రామిక వేత్తలు అలా ఉండరు.మన సమాజం లో అలా ఒక విషయాన్ని జనరలైజ్ చేయ లేము.చాలా సందర్భాలలో అలా జరిగినాయి.
నాకు తెలిసినంత వరకు చాలా మంది పారిశ్రామికవేత్తలు "చట్టబద్దంగా" వ్యాపారం చేసి పైకి వచ్చారు. ఎక్కడో చిన్న చిన్న గొడవలు లాలూచీలు ఉండవచ్చు కానీ స్తూలంగా ఇదే నిజం.
అయితే ఇప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదురుకుంటున్న వారిలో అధిక శాతం నిజమయిన పారిశ్రామికవేత్తలు కారు. వీరిలో అత్యధికులు crony capitalists లేదా glorified contractors. రాజకీయ పలుకుబడి & అధికార దుర్వినియోగం వీరి "వ్యాపారాలకు" మూల స్తంభం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి