నేను ఈ మధ్య ఎక్కడో చదివాను.దాన్ని ఇక్కడ రాస్తున్నాను.ఎవరినీ నొప్పించడానికి కాదు.సరదాగా తీసుకోండి.అన్ని సందర్భాలలో ను ఇది నిజం కాక పోవచ్చు.
స్కూల్లో...
1) మొదటి తరగతి లో పాస్ అయిన చాలా మంది ఇంజనీరులో లేక డాక్టర్లో అవుతారు.
2) రెండవ తరగతి లో పాస్ అయిన వాళ్ళు ఎం.బి.ఎ లు చేసి అడ్మినిస్ట్రేషన్ లో చేరి పైన వారిని కంట్రోల్ చేస్తారు.
3) మూడవ తరగతి లో పాస్ అయిన వాళ్ళు రాజకీయాలలో చేరి ఎం.ఎల్.ఎ గానో మంత్రి గానో అయ్యి పై ఇద్దరినీ కంట్రోల్ చేస్తారు.
4) ఫెయిల్ అయిన వాళ్ళు మాఫియా లోనో ,లేక రౌడిజం లోనో చేరి పై ముగ్గురినీ కంట్రోల్ చేస్తారు.
5) ఇంక చివరగా అసలు స్కూలు మొఖం చూడని వాళ్ళు బాబా లుగా స్వామీజీ లు గా మారి పైన నలుగురినీ తమ చుట్టూ తిప్పుకుంటారు.
3, డిసెంబర్ 2011, శనివారం
1, డిసెంబర్ 2011, గురువారం
పట్నం మింగేసింది !
మా ఊరి పేరు మారి పోయింది.ఏదో నోరు తిరగని పేరుతొ పిలుస్తున్నారు.
మా ఇరుగు పొరుగు లేరు .మా ఇంటి చుట్టూ పక్కలా ఎవరెవరో ఉన్నారు.
మాకు అర్థం కాని రకరకాల భాషలు మాట్లాడుతున్నారు.
మా భాషను మా యాసలో నోరారా మాట్లాడుకోవడానికి ఎవరూ కనపడ్డం లేదు.
మా పండుగలు కనపడ్డం లేదు ,వేరే పండుగలు చేస్తున్నారు.
మా సంస్కృతీ కనపడ్డం లేదు.
మా బాధను మన అనే వాళ్ళతో పంచుకుందామంటే ఎవరూ కనపడ్డం లేదు.
అంతా యాంత్రికంగా పరుగులు పెడుతున్నారు.
మా ఊరిని మమ్మల్ని పట్నం మింగేసింది.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)