జగన్ గారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్స్ పార్టీ జెండా ను ఆవిష్కరించినారు.కానీ పార్టీ పేరు మీద కొంత మంది కాంగ్రెస్స్ వాళ్ళు తప్పు పడుతున్నారు.వాళ్ళ అభ్యంతరమంతా కాంగ్రెస్స్ అనే పదం మీదే.కానీ "కాంగ్రెస్స్" అంటే డిక్షనరీ అర్థం "ఫార్మల్ మీటింగ్" అని.కావున కాంగ్రెస్స్ అనే పదం కాంగ్రెస్స్ పార్టీ సొత్తు ఏ మాత్రం కాదు.దీన్ని విమర్శలు చేస్తున్న నాయకులు గుర్తించాలి.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్స్ పార్టీ ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలలో బోణీ కొట్టి ,తర్వాత జరిగే శాసన సభ,పార్లమెంట్ ఎన్నికలలో ఘనవిజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.
12, మార్చి 2011, శనివారం
11, మార్చి 2011, శుక్రవారం
తెలుగుతల్లి కంట మరొక సారి కన్నీరొలికింది.
తెలుగు జాతి మరొక సారి అవమానాల పాలైంది.ఆఫ్గనిస్తాన్ లోని బమియాన్ బుద్ద విగ్రహాల కూల్చివేత కు ఏమాత్రం తీసిపోకుండా టాంక్ బండ్ మీద ఉన్న తెలుగుజాతి సాంస్కృతిక సంపదకు మరియు పౌరుషానికి ప్రతీకలైన మహాపురుషుల విగ్రహాలను పనిగట్టుకొని ధ్వంసం చేసారు.ఈ దృశ్యం చూసిన నిజమైన ప్రతి తెలుగువాడి గుండె మండి పోయింది.ఇది ముందే ప్రణాళిక ప్రకారం చేసినట్లుంది.ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?ఉంటే ఏం చేస్తుంది..ఇటువంటి పని చేసిన ముష్కరులను కఠినంగా శిక్షించి ఆ మహాత్ముల విగ్రహాలను తిరిగి పునరుద్దరించాలి.
1, మార్చి 2011, మంగళవారం
ఏ ప్రజల కోసం .........
ప్రజల చేత ,ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అని మనం ఘనంగా చెప్పుకుంటున్న మన ప్రభుత్వాలు నిజంగా సామాన్య ప్రజల కోసం పని చేస్తున్నాయా ?సామాన్య ప్రజలు వాళ్ళ బ్రతుకులు వాళ్ళు గౌరవంగా కూలో,కుల వృత్తులో ,వ్యవసాయమో చేసుకొని బ్రతుకుతున్నారు.దాన్ని కూడా ప్రభుత్వాలు చేసుకోనీయడం లేదు.ఈ వాళ శ్రీకాకుళంలో థర్మల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సంఘటన లో కొందరు సామాన్యులు మృతి చెందినారు.వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఏమీ కోరడం లేదు.కేవలం తమ బతుకులను తమను గౌరవంగా బతక నీయమని కోరుతున్నారు.సామాన్యుల కనీస అవసరాలైన కూడు ,గుడ్డ, నీడ,విద్య,వైద్యం లు కల్పించడం లో ప్రభుత్వాలు విఫల మైనాయి.ఈ ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయో ఒక సారి పరిశీలించు కోవాలి.మెజారిటీ ప్రజల ప్రయోజనాలు విస్మరించి ,కొద్దిమంది పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పని చేస్తే ప్రజాస్వామ్యానికి పరమార్థమే ఉండదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)