1, జనవరి 2011, శనివారం

శుభాకాంక్షలు

బ్లాగు మిత్రులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

16, డిసెంబర్ 2010, గురువారం

ఇప్పుడున్నది వ్యవస్థలను గౌరవించే నాగరిక సమాజమేనా?

ఊర్లలో పొలాల కోసం కావలి వాండ్లు ఉండే వారు.ఇప్పటికీ కూడా పద్దతి చాలా ఊర్లలో ఉంది.ఊరి పంచాయితీ మరియు పెద్దమనుషులు కలిసి వాళ్ళను పెట్టే వారు.చాలా సందర్భాలలో కావలి వాండ్లు దళిత కులాలకు చెందిన వారే ఉండే వారు.వాళ్ళు ఊరి మొదట్లో ఒక కర్ర చేత బట్టుకొని ఉండే వారు.ఊర్లోని వాళ్ళు ఎవరైనా సరే పంటల సమయం లో పొలాల్లో నుండి కోసుకు రాకుండా ఉండడానికి వీళ్ళను పెట్టే వారు (పంటలు కోసే సమయం లో తప్ప ).దీనివలన ఇతరుల పంటలను దొంగతనం చేయడానికి వీలు లేకుండా ఉండేది.ఒక వేళ సమయంలో ఎవరైనా పంటను తీసుక వస్తే వాళ్లకు జుర్మానా విధించి డబ్బును పంచాయితీకి జమ చేసేవాళ్ళు.వీళ్ళను చూస్తే ఎవరికైనా భయం ఉండేది.నూరు ఎకరాల ఆసామి అయినా వాళ్లకు భయపడే వాడు.పెద్దగా చదువుకోని పల్లెటూరి సమాజాలల్లో కూడా వ్యక్తులతో సంబంధం లేకుండా వ్యవస్థల పట్ల అంత గౌరవం ఉండేది.కానీ నేడు బాగా చదువుకున్న నాగరిక సమాజం(?) లో కూడా వ్యవస్థలకు విలువ లేకుండా పోయింది.పోలీసులు చివరికి ముఖ్యమంత్రి ,ప్రధాన మంత్రి వంటి ప్రధాన మైన వ్యవస్థలకు కూడా విలువ ఇవ్వడం లేదు.

21, నవంబర్ 2010, ఆదివారం

జగన్ ఎవరి వాడు?

జగన్ మీడియాలో కాంగ్రెస్స్ పార్టీ గురించి మరియు సోనియా గారి గురించి వచ్చిన వార్తా కథనాన్ని చూసి కాంగ్రెస్స్ పార్టీ వీరాభిమానులు(?) రెచ్చిపోయి ఖండనలు మరియు మీడియా ఆఫీసుల మీద దాడికి పాల్పడుతున్నారు.ఇంతకు ముందు ఒక పత్రికా యాజమాన్యం మీడియాను అడ్డుపెట్టుకొని చట్ట వ్యతిరేకమైన ఆర్ధిక కార్యకలాపాలు చేస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి గారు చట్టప్రకారం చర్యలు తీసుకుంటే మీడియా మీద దాడి అని ప్రతి ఒక్కరూ గగ్గోలు పెట్టారు,కానీ నేడు ప్రజాస్వామిక వాదులు సాక్షి మీద దాడి జరుగుతూ ఉంటే నోరు మెదపడం లేదు.ఎక్కడ దాక్కున్నారు.రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన మీద అవాకులు చెవాకులు పేలిన కాంగ్రెస్స్ నాయకులకు తెలీదా, ఆయన కూడా కాంగ్రెస్స్ పార్టీ కి చెందిన నాయకుడని.జగన్ ఓదార్పు యాత్ర చేస్తుంటే దానికి లెక్కలేనన్ని అడ్డంకులు కల్పించారు.అప్పుడు తెలీదా జగన్ పార్టీకి చెందిన వ్యక్తో? ఓదార్పు యాత్రను సమర్థిస్తున్నారన్న ఏకైక కారణంతో ఎందరో నిజమైన కాంగ్రెస్స్ కార్య కర్తలను పార్టీ నుండి వెలివేశారు.రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన అభిమానులని కాంగ్రెస్స్ దగ్గరకు తీసుకో లేదు సరి కదా వాళ్ళని నానా ఇబ్బందులకు గురిచేసింది. వాళ సాక్షి మీడియాలో ఏదో వార్త వచ్చిందని, కాంగ్రెస్స్ పార్టీ వాళ్ళు నానా యాగీ చేస్తున్నారు.రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ ను మరియి రాజశేఖర రెడ్డి గారి అభిమానులని తమ పార్టీ వాళ్ళే అని,కాంగ్రెస్స్ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా గుర్తించారా ?

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

ఎ.పి.పి.ఎస్.సి పరీక్షలు రాయలేని విద్యార్థుల బాధలకు భాధ్యులు ఎవరు?

తెలంగాణా విమోచన దినం గురించి మాట్లాడ కుండా తప్పించుకోవడానికి టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్ళు నానా రభస చేసి .పి.పి.ఎస్.సి. నిర్వహించే పరీక్షలను తెర పైకి తెచ్చి అడ్డుకుని చాలా మంది కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకున్నారు. వాళ నష్టపోయిన విద్యార్థుల గురించి ఎవరూ మాట్లాడడం లేదు.టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్ళు .పి.పి.ఎస్.సి. పరీక్షలను తెర మీదికి తెచ్చి తెలంగాణా విమోచన దినం గురించి మాట్లాడకుండా తప్పుకుని తమ రాజకీయ పబ్బం గడుపుకున్నారు.కాని అమాయక విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకున్నారు.ఇప్పటికైనా తెలంగాణా విద్యార్థులు భావోద్వేగాలతో ఆడుకునే రాజకీయ నాయకులతో జాగ్రత్తగా మసలుకోవాలి.