21, నవంబర్ 2010, ఆదివారం

జగన్ ఎవరి వాడు?

జగన్ మీడియాలో కాంగ్రెస్స్ పార్టీ గురించి మరియు సోనియా గారి గురించి వచ్చిన వార్తా కథనాన్ని చూసి కాంగ్రెస్స్ పార్టీ వీరాభిమానులు(?) రెచ్చిపోయి ఖండనలు మరియు మీడియా ఆఫీసుల మీద దాడికి పాల్పడుతున్నారు.ఇంతకు ముందు ఒక పత్రికా యాజమాన్యం మీడియాను అడ్డుపెట్టుకొని చట్ట వ్యతిరేకమైన ఆర్ధిక కార్యకలాపాలు చేస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి గారు చట్టప్రకారం చర్యలు తీసుకుంటే మీడియా మీద దాడి అని ప్రతి ఒక్కరూ గగ్గోలు పెట్టారు,కానీ నేడు ప్రజాస్వామిక వాదులు సాక్షి మీద దాడి జరుగుతూ ఉంటే నోరు మెదపడం లేదు.ఎక్కడ దాక్కున్నారు.రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన మీద అవాకులు చెవాకులు పేలిన కాంగ్రెస్స్ నాయకులకు తెలీదా, ఆయన కూడా కాంగ్రెస్స్ పార్టీ కి చెందిన నాయకుడని.జగన్ ఓదార్పు యాత్ర చేస్తుంటే దానికి లెక్కలేనన్ని అడ్డంకులు కల్పించారు.అప్పుడు తెలీదా జగన్ పార్టీకి చెందిన వ్యక్తో? ఓదార్పు యాత్రను సమర్థిస్తున్నారన్న ఏకైక కారణంతో ఎందరో నిజమైన కాంగ్రెస్స్ కార్య కర్తలను పార్టీ నుండి వెలివేశారు.రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన అభిమానులని కాంగ్రెస్స్ దగ్గరకు తీసుకో లేదు సరి కదా వాళ్ళని నానా ఇబ్బందులకు గురిచేసింది. వాళ సాక్షి మీడియాలో ఏదో వార్త వచ్చిందని, కాంగ్రెస్స్ పార్టీ వాళ్ళు నానా యాగీ చేస్తున్నారు.రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ ను మరియి రాజశేఖర రెడ్డి గారి అభిమానులని తమ పార్టీ వాళ్ళే అని,కాంగ్రెస్స్ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా గుర్తించారా ?

4 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

మీ ఆవేశంలో జగన్ని వెనకేసుకొచ్చేస్తున్నారేమో చూడండి ముందు. వై. ఎస్ ఉండి వుంటే ఇలాంటి కథనాలు సాక్షిలో వచ్చేవా? సోనియాగాంధీ- జగన్ విషయంలో కటువుగా ఉన్నారనే అనుకుందాం. దానికి జగన్ రియాక్టవ్వల్సింది ఇలాగేనా?! కాస్త హుందాగే ప్రవర్తిస్తే బావుంటుందేమో. కరెక్టుగా చెప్పాలంటే ఆఖరుకు జగన్ అత్యుత్సాహం... తండ్రి వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళ అభిమానాన్ని కూడా తక్కువ చేసేలా ఉంది. ఇది జగన్- ఆయన్ను ఇంతలా అభిమానించే మీలాంటి వారు కూడా ఆలోచించాలి. ఇలాంటి సున్నితాంశాలు మాకు లెక్కలోకి రావనుకున్నప్పుడు ఈ చొప్పదంటు ప్రశ్నలు వేయాల్సిన అవసరం కూడా లేదు. అదేదైనా మొదటగా బాగా ఆలోచించడం నేర్చుకోవాలి జగన్ అండ్ కంపెనీ. ఈ విషయం మీరు కూడా బాగా ఆలోచించండి ముందు!!!

Harish చెప్పారు...

"వై. ఎస్ ఉండి వుంటే ఇలాంటి కథనాలు సాక్షిలో వచ్చేవా?"

వై య స్ బ్రతికుంటె సాక్షి లో ఇలాంటి కథనాలు ప్రసారం చెయ్యాల్సిన అవసరం వచ్చెదా??......కె సి ర్ దీక్ష కు కూర్చునే వాడా?.....రాష్త్ర ప్రజలకు ఇంత చెత్త పరిపాలన లో బ్రతకాల్సిన ఖర్మ పట్టేదా??

మయూఖ చెప్పారు...

తెలుగుశాల.కాం గారు హరీష్ గారు చెప్పినట్లు వై.ఎస్.బ్రతికి ఉండుంటే ఆంధ్రప్రదేశ్ ఈవాళ ఉన్నట్లు కుక్కలు చింపిన విస్తరి లాగా ఉండేది కాదు.ఈ వాళ సాక్షి లో వచ్హిన దాని కంటే ఎక్కువగా మిగతా పత్రికలలో కాంగ్రెస్స్ గురించి మరియు నాయకుల గురించి ఉన్నవి లేనివి ఊహించి చాలా వ్రాసారు.అప్పుడు లేదే ఈ స్వామి భక్తి? ఒకప్పుడు టి.ఆర్.ఎస్. వాళ్ళు సోనియాను దెయ్యం అన్నారు,తెలంగాణా ఇవ్వకపోతే కాంగ్రెస్స్ ను భూస్థాపితం చేస్తామన్నారు . ఈ వాళ గోల చేస్తున్న వీరాభిమానులకు అవి ఆ రోజు కనపడ లేదా ?లేక వీళ్ళకు వేరే పార్టీ వాళ్ళతో లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయనుకోవాలా?వీళ్ళంతా ప్రజల్లో లేని మనుషులు ,బ్లాక్మైల్ రాజకీయాలు చేసేవాళ్ళు.కాంగ్రెస్స్ కు వ్యతిరేకంగా ఆఫ్ఫిడవిట్ లు దాఖలు చేసిన పత్రికా యాజమాన్యాలతో ,మిగతా రాజకీయ పార్టీ ల తో ఒంటరి పోరాటం చేసి పార్టీ కాడర్ ను నిలబెట్టుకొని రెండు సార్లు పార్టీని అధికారం లోకి తీసుకొని వచ్హిన బలమైన నాయకుడు వై.ఎస్.గారు.అప్పుడు వీల్లంతా ఎక్కడ ఉన్నారు?

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) చెప్పారు...

Nice Post.