మొదటి సంతకం రైతు రుణమాఫీ పై పెడతామని అధికారం లోకి వచ్చి 6 నెలలు అయినా కూడా ఒక్క రైతు ఖాతా లోకి ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. కొత్త అప్పులు పుట్ట లేదు . దీనిపై ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి పెంచుతున్నాయి .
ఒక వేల అధికార పక్షం ఈ రుణమాఫీ ని తాము ఎన్నికల ముందు చెప్పినట్లుగా కాకుండా ,అరకొరగా చేసినామంటే చేసినామని అనిపిస్తే వారు రైతుల విశ్వాసాన్ని పొందలేరు .
ఈ మటుకు చేసింది కూడా ప్రతిపక్షాల వత్తిడికి తలఒగ్గి మాత్రమే చేసారని రైతులు అనుకొంటారు . అధికారపక్షానికి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఇన్ని రోజులు మొదటి సంతకానికి సమయం పట్టదని అనుకుంటున్నారు. చివరికి ఈ క్రెడిట్ అంతా ప్రతిపక్షాలకే పోతుంది .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి