5, డిసెంబర్ 2014, శుక్రవారం

రాయలసీమ కళాకారులు ..

              ఒక చిన్న స్టీలు స్కేలు ,ఉలి ,బొగ్గు ,చిన్న సుత్తె తో బేతంచర్ల పని వారు అక్కడి నాప రాళ్ళతో రకరకాల లతలు,పుష్పాలు ,ఫ్లోరింగ్ డిజైన్లను చాలా అద్బుతంగా చేస్తారు.అందులో చాలా జామెట్రీ దాగి ఉంది.ఏ పరికరమూ ,యంత్ర సహాయం లేకుండా చాలా ఖచ్హితంగా చేస్తారు.కానీ ఈ మధ్యన ఈ ఆర్టిఫిసీల్ టైల్స్ వచ్హిన తర్వాత వారికి పని తగ్గి పోయింది.ఈ పని లో చాలా మటుకు ముస్లిం మైనారిటీ కి చెందిన వారు ,వెనుక బడిన కులాలకు చెందిన వారు ఉపాధి పొందుతూ ఉండేవారు.ఉపాధి తగ్గినందువలన కొత్త తరం ఈ పనిలోకి రావడానికి జంకుతున్నారు.ఇప్పటికే ఎన్నో కళల ను మనం కోల్పోయాము.కావున ప్రభుత్వం,పెద్దలు స్పందించి ఇటువంటి కళను ,కళాకారులను దూరం కాకుండా చేసు కోవలసిన అవసరం ఉంది.





3, డిసెంబర్ 2014, బుధవారం

క్రెడిట్ అంతా ప్రతిపక్షాలకే పోతుంది .

           మొదటి సంతకం రైతు రుణమాఫీ పై పెడతామని అధికారం లోకి  వచ్చి 6 నెలలు అయినా కూడా  ఒక్క రైతు ఖాతా లోకి ఒక్క రూపాయి కూడా  జమ కాలేదు. కొత్త అప్పులు పుట్ట లేదు . దీనిపై  ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి పెంచుతున్నాయి . 

               ఒక వేల అధికార పక్షం ఈ రుణమాఫీ ని  తాము ఎన్నికల ముందు చెప్పినట్లుగా కాకుండా ,అరకొరగా చేసినామంటే  చేసినామని అనిపిస్తే వారు రైతుల విశ్వాసాన్ని పొందలేరు . 

                ఈ మటుకు చేసింది కూడా  ప్రతిపక్షాల వత్తిడికి తలఒగ్గి మాత్రమే చేసారని రైతులు అనుకొంటారు . అధికారపక్షానికి  నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఇన్ని రోజులు మొదటి సంతకానికి సమయం పట్టదని అనుకుంటున్నారు. చివరికి ఈ క్రెడిట్ అంతా ప్రతిపక్షాలకే పోతుంది .