30, జూన్ 2012, శనివారం

మా నానమ్మకు ఎంసెట్ ర్యాంకు వచ్చింది!

నిన్న ఎంసెట్ రిసల్ట్స్ వచ్చిన తర్వాత నాకు తెలిసిన చాలా మందిని మార్కులు ఆడిగితే వాళ్లకు ముప్పై అయిదు శాతం(ఏభై ఆరు మార్కులు ) కూడా రాలేదు. కానీ రాంకులు మాత్రం ముప్పై నాలుగు వేల నుండి పైకి వచ్చినాయి.నేను క్యూరియాసిటీ తో చదువు రాని మా నానమ్మకు కళ్ళు మూసుకొని అన్నీ ఒకే నంబర్ పెట్టుకుంటూ పొమ్మని చెబితే ముప్పై ఆరు మార్కుల నుండి నలభై ఏడు మార్కులు వచ్చినాయి.ఇన్ని సంవత్సరాలు చదివినారు కాబట్టి వాళ్లకు మా నానమ్మ కంటే పది మార్కులు మాత్రం ఎక్కువ వచ్చినాయి.ఇటువంటి వాళ్ళు అందరూ ఇంజినీరులై ఏం ఉద్దరిస్తారు.ఇలా మార్కులు వచ్చినా కూడా సీట్లు ఇంకా మిగిలి పోతా ఉన్నాయి.ఎంసెట్ విద్యావిధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం అవుతూ ఉంది.

8 కామెంట్‌లు:

మయూఖ చెప్పారు...

నంబర్ కూడా తెలుగు నంబర్ కనిపిస్తుంది.అరబిక్ నంబర్ కనిపించాలంటే ఏం చేయాలి.

మయూఖ చెప్పారు...

నంబర్ కూడా తెలుగు నంబర్ కనిపిస్తుంది.అరబిక్ నంబర్ కనిపించాలంటే ఏం చేయాలి.

anrd చెప్పారు...

బాగా చెప్పారండి.

Unknown చెప్పారు...

డిమాండ్, సప్లై రూల్...డిమాండ్ ని మించి సప్లై ఉంటే మార్కెట్లో అందరూ ఇంజీనీర్లే మరి ;)

అజ్ఞాత చెప్పారు...

అన్నిటినీ బ్రష్టు పట్టించారు...చివరికి ఇంజనీరింగ్ విద్యని కూడా.... ఇంజనీరింగ్ చదువుతున్నాడు మా పిల్లాడు అని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నారు కొంత మంది పేరెంట్స్...

అజ్ఞాత చెప్పారు...

ఇలాగే కొనసాగితే, కొన్నాళ్ళకి కూలీల కంటే ఇంజనీర్లే ఎక్కువమంది ఉండచ్చు.

అజ్ఞాత చెప్పారు...

your experiment is good. :)

అజ్ఞాత చెప్పారు...

మీ నాన్నమ్మ గారికి EAMCET రాంక్ రావడం ఏంటో నాకు అర్ధం కాలేదు.
నిజంగా నాన్నమ్మ గారేనా ??
venkat