నిన్న ఎంసెట్ రిసల్ట్స్ వచ్చిన తర్వాత నాకు తెలిసిన చాలా మందిని మార్కులు ఆడిగితే వాళ్లకు ముప్పై అయిదు శాతం(ఏభై ఆరు మార్కులు ) కూడా రాలేదు. కానీ రాంకులు మాత్రం ముప్పై నాలుగు వేల నుండి పైకి వచ్చినాయి.నేను క్యూరియాసిటీ తో చదువు రాని మా నానమ్మకు కళ్ళు మూసుకొని అన్నీ ఒకే నంబర్ పెట్టుకుంటూ పొమ్మని చెబితే ముప్పై ఆరు మార్కుల నుండి నలభై ఏడు మార్కులు వచ్చినాయి.ఇన్ని సంవత్సరాలు చదివినారు కాబట్టి వాళ్లకు మా నానమ్మ కంటే పది మార్కులు మాత్రం ఎక్కువ వచ్చినాయి.ఇటువంటి వాళ్ళు అందరూ ఇంజినీరులై ఏం ఉద్దరిస్తారు.ఇలా మార్కులు వచ్చినా కూడా సీట్లు ఇంకా మిగిలి పోతా ఉన్నాయి.ఎంసెట్ విద్యావిధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం అవుతూ ఉంది.
30, జూన్ 2012, శనివారం
29, జూన్ 2012, శుక్రవారం
అమితాబ్ బచ్చన్ కు ప్రమాదం జరిగిందా?జరగలేదా?
మొన్న ఒక ప్రముఖ తెలుగు చానల్ అమెరికా లో అమితాబ్‌బచ్చన్ కు ప్రమాదం జరిగి తీవ్ర గాయాలైనాయని పదే పదే బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది.వేరే చానల్ వాళ్ళెవరూ ఇవ్వలేదు.తర్వాత రోజు ఏ పేపర్ లోనూ ఇది రిపోర్ట్ కాలేదు. ఇది నిజమా కాదా?ఒక వేల నిజం కాకుంటే ఆ చానల్ ఖండన కూడా నేను చూడ లేదు.ఏది నమ్మాలి .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)