జగన్ మీడియాలో కాంగ్రెస్స్ పార్టీ గురించి మరియు సోనియా గారి గురించి వచ్చిన వార్తా కథనాన్ని చూసి కాంగ్రెస్స్ పార్టీ వీరాభిమానులు(?) రెచ్చిపోయి ఖండనలు మరియు మీడియా ఆఫీసుల మీద దాడికి పాల్పడుతున్నారు.ఇంతకు ముందు ఒక పత్రికా యాజమాన్యం మీడియాను అడ్డుపెట్టుకొని చట్ట వ్యతిరేకమైన ఆర్ధిక కార్యకలాపాలు చేస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి గారు చట్టప్రకారం చర్యలు తీసుకుంటే మీడియా మీద దాడి అని ప్రతి ఒక్కరూ గగ్గోలు పెట్టారు,కానీ నేడు ఆ ప్రజాస్వామిక వాదులు సాక్షి మీద దాడి జరుగుతూ ఉంటే నోరు మెదపడం లేదు.ఎక్కడ దాక్కున్నారు.రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన మీద అవాకులు చెవాకులు పేలిన కాంగ్రెస్స్ నాయకులకు తెలీదా, ఆయన కూడా కాంగ్రెస్స్ పార్టీ కి చెందిన నాయకుడని.జగన్ ఓదార్పు యాత్ర చేస్తుంటే దానికి లెక్కలేనన్ని అడ్డంకులు కల్పించారు.అప్పుడు తెలీదా జగన్ ఏ పార్టీకి చెందిన వ్యక్తో? ఓదార్పు యాత్రను సమర్థిస్తున్నారన్న ఏకైక కారణంతో ఎందరో నిజమైన కాంగ్రెస్స్ కార్య కర్తలను పార్టీ నుండి వెలివేశారు.రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన అభిమానులని కాంగ్రెస్స్ దగ్గరకు తీసుకో లేదు సరి కదా వాళ్ళని నానా ఇబ్బందులకు గురిచేసింది.ఈ వాళ సాక్షి మీడియాలో ఏదో వార్త వచ్చిందని, కాంగ్రెస్స్ పార్టీ వాళ్ళు నానా యాగీ చేస్తున్నారు.రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ ను మరియి రాజశేఖర రెడ్డి గారి అభిమానులని తమ పార్టీ వాళ్ళే అని,కాంగ్రెస్స్ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా గుర్తించారా ?
21, నవంబర్ 2010, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)