తెలంగాణా విమోచన దినం గురించి మాట్లాడ కుండా తప్పించుకోవడానికి టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్ళు నానా రభస చేసి ఎ.పి.పి.ఎస్.సి. నిర్వహించే పరీక్షలను తెర పైకి తెచ్చి అడ్డుకుని చాలా మంది కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకున్నారు.ఈ వాళ నష్టపోయిన విద్యార్థుల గురించి ఎవరూ మాట్లాడడం లేదు.టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్ళు ఎ.పి.పి.ఎస్.సి. పరీక్షలను తెర మీదికి తెచ్చి తెలంగాణా విమోచన దినం గురించి మాట్లాడకుండా తప్పుకుని తమ రాజకీయ పబ్బం గడుపుకున్నారు.కాని అమాయక విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకున్నారు.ఇప్పటికైనా తెలంగాణా విద్యార్థులు భావోద్వేగాలతో ఆడుకునే రాజకీయ నాయకులతో జాగ్రత్తగా మసలుకోవాలి.
10, సెప్టెంబర్ 2010, శుక్రవారం
4, సెప్టెంబర్ 2010, శనివారం
తెలంగాణా ప్రజలు తిరిగి కే.సి.ఆర్ ఉచ్చులో పడ్డారు.
సెప్టెంబర్ 17 వ తేదిని తెలంగాణా విమోచన దినం జరపాలని అన్ని పార్టీ ల నుండి డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ,టి.ఆర్.ఎస్ పార్టీ కూడా చిన్నగా ఆ డిమాండ్ చేసింది.కానీ టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్లకు ముఖ్యంగా కే.సి.ఆర్ కు విమోచన దినం డిమాండ్ చేసి ముస్లిం ల ను దూరం చేసుకోవడం ఇష్టం లేదు ,అలాగని తెలంగాణా పరుగులో వెనక పడ్డం ఇష్టం లేదు .అందుకే వ్యూహాత్మకంగా ఎ.పి.పి.ఎస్.సి నిర్వహించే గ్రూప్ -1 పరీక్షలను ముందుకు తెచ్చి తెలంగాణా వాళ్ళను ముఖ్యంగా విద్యార్థులను రెచ్చగొట్టి తను అనుకున్నది సాధించారు.ఇప్పుడు అందరూ ఎ.పి.పి.ఎస్.సి నిర్వహించే పరీక్షల వెంట పడ్డారు.విమోచన దినం గురించి అందరూ మర్చి పోయారు.రాజకీయ నాయకుల స్వార్థ వ్యూహాలు వాళ్లకు ఉంటాయి.విద్యార్థులు స్వార్థ రాజకీయనాయకుల ఉచ్చులో పడి వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు.
2, సెప్టెంబర్ 2010, గురువారం
పేదల పక్షపాతి కి అశ్రునివాళులు
పేదల పక్షపాతి ,విశ్వసనీయతకు మారు పేరైన రాజశేఖర రెడ్డి గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని కోరుకుంటూ .....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)