రాయలసీమ(జమ్మలమడుగు,ప్రొద్దుటూరు ప్రాంతాలలో పల్లెల్లో ) లో వాడే కొన్ని పదాలు ఈ మధ్య కనుమరుగవుతున్నాయి.ఒకసారి గుర్తు చేసుకుంటూ..
అమ్మలపొద్దు = ఉదయం తొమ్మిది గంటల సమయం.
పైటాల = మధ్యాన్నం.
మాయిటాల = పొద్దు గూకే వేళ.
వాకిలి =తలుపు.
సిలుకు = తలుపుకు పెట్టే గొళ్ళెం లాంటిది.
గడెమాను = తలుపుకు అడ్డంగా లోపలనుండి పెట్టే గడియ.
బూయిండ్లు = వంట గది.
నడవ = హాల్ .
ఆయిపిండ్లు = పంటలను దాచు కునే రూము.
దండెం = బట్టలను వేసేందుకు ఉపయోగించే త్రాడు లేక కర్ర.
ఉట్టి = పదార్థాలను ఎత్తిపెట్టెందుకు వేలాడదీసిన త్రాడు(గిన్నెలను పెట్టడానికి అనుకూలంగా ఉన్న).
సుట్టకూతురు = కుండలు పడిపోకుండా ఉండేదుకు కుండ క్రింద పెట్టే వృత్తాకారంలో ఉండే త్రాడు.
అటిక = మట్టికుండ.
బాణ = నీళ్ళు నింపుకునేందుకు ఉపయోగించే మట్టి కుండ .
కడవ = నీళ్ళు పట్టుకు రావడానికి ఉపయోగించే మట్టి పాత్ర.
తప్యాల = వంట వండుకునే లోహ పాత్ర.
బోకులు = లోహ పాత్రలు.
చెంబు = నీళ్ళు త్రాగడానికి ఉపయోగించే లోహ పాత్ర .
ఆబువ్వ = వరి అన్నం.
సిబ్బి = అన్నం గంజి వార్చ డానికి ఉపయోగించే వెదురుప్లేట్ .
తాపలు = మెట్లు (స్టెప్స్ ).
మెట్లు = చెప్పులు.
మచ్చు = పశువుల కోసం గడ్డిని ఉంచే ప్రదేశం.
మేపు = పశువుల కోసం ఉపయోగించే ఎండు గడ్డి.
జొల్ల = పశువుల గడ్డిని తేవడానికి ఉపయోగించే వెదురుతో చేసిన ఒక పెద్ద బుట్ట.
గాజ = ధాన్యాన్నినిలువ చేసేందుకు ఉపయోగించే వెదురు బుట్ట.
ఎనుము =బర్రె.
రొచ్చు = పశువుల మూత్రం.
తలుగు =పశువులను కట్టేందుకు ఉపయోగించే త్రాడు.
మోకు = వ్యవసాయ పనులకు ఉపయోగించే త్రాడు .
మాసీలు =పంటలు.
అబ్బ =నాన్న నాన్న.
జేజి = నాన్న అమ్మ.
తాత =అమ్మ నాన్న.
అవ్వ =అమ్మమ్మ.
ఈ పదాలు కొన్ని ఈ మధ్యన కనుమరుగు అవుతున్నాయి,వాటిని కాపాడుకోవలసిన భాద్యత ఉంది.
మరి కొన్ని పదాలు తర్వాత చూద్దాం..
6, జులై 2010, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)